Jump to content

ప్రసన్న

వికీపీడియా నుండి
ప్రసన్న
జననం
ప్రసన్న వెంకటేశన్
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2002–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
(m. 2012)
పిల్లలు2

ప్రసన్న వెంకటేశన్, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన భారతీయ నటుడు. అయితే, ఆయన తమిళంతో పాటు కొన్ని తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాలలోనూ నటించాడు.

ఆయన 2002లో మణిరత్నం నిర్మించిన ఫైవ్ స్టార్‌లో తన మొదటి విజయాన్ని సాధించాడు. విజయవంతమైన ఆయన చిత్రాలలో మరికొన్ని కన్నుమ్ కన్నుమ్ (2008), చీనా తానా 001 (2007), అంజతే (2008), కంద నాల్ ముదల్ (2005), నంగా రొంబ బిజీ (2020), నానయం (2010) వంటివి. ప్రధాన పాత్రలే కాకుండా విలన్ పాత్రలు కూడా ఆయన పోషించాడు. అచ్చముండు! అచ్చముండు! (2009) సినిమాలో ఆయన స్నేహ, అమెరికన్ నటుడు జాన్ షియాతో కలిసి నటించాడు. ఈ చిత్రం షాంఘై, కైరో వంటి అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించబడింది.[1][2]

2009లో ఆర్యన్ రాజేష్ నటించిన తమిళ సినిమాలో ఆయనకు ప్రసన్న వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. ఇక ప్రసన్న నటించిన తెలుగు సినిమాలలో భాయ్ (2013), రాజాధి రాజా (2015), జవాన్ (2017), విశ్వామిత్ర (2019) ఉన్నాయి. స్ట్రీమింగ్ సేవ ఆహా వెబ్ సీరీస్ అద్దం (2020)లోనూ ఆయన నటించాడు.

ప్రారంభ జీవితం

[మార్చు]

ప్రసన్న తిరుచిరాపల్లిలో జన్మించాడు. అక్కడ, ఆయన బీహెచ్ఈఎల్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసాడు. అతనికి ఒక తమ్ముడు ఉన్నాడు. ప్రసన్న పాఠశాల విద్య నుండే మిమిక్రీ, నటనలలో అభిరుచి కలిగి ఉన్నాడు.[3] దీంతో, ఆయన సారనాథన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఈఈఈ చదువుతూండగానే సుసి గణేశన్ దర్శకత్వంవహించిన ఫైవ్ స్టార్ (2002)లో మొదటగా అవకాశం వచ్చింది.[4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అచ్చముండు! అచ్చముండు! చిత్రంలో తన సరసన నటించిన స్నేహను 2012 మే 11న వివాహం చేసుకున్నాడు.[5][6][7] వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు.[8][9][10][11]

మూలాలు

[మార్చు]
  1. "Achchamundu Achchamundu screened at International film festivals". Jointscene. Archived from the original on 11 August 2010. Retrieved 29 March 2011.
  2. "News". IndiaGlitz.com. 2018-11-23. Retrieved 2018-12-12.
  3. Prasanna. "Meet Prasanna of Tamil films". Rediff.com (Interview). Interviewed by Shobha Warrier. Retrieved 13 February 2012.
  4. Prasanna. "I want to do meaningful films: Prasanna". IndiaGlitz (Interview). Archived from the original on 2005-02-10. Retrieved 29 March 2011.
  5. "Sneha to wed actor Prasanna!". Behindwoods. Retrieved 9 November 2011.
  6. "Prasanna out public about his relationship with Sneha!". Sify. Archived from the original on 12 November 2011. Retrieved 9 November 2011.
  7. "Sneha to marry Prasanna!". IndiaGlitz. Archived from the original on 10 November 2011. Retrieved 9 November 2011.
  8. "ఈ ఫొటోలో ఉన్న చిన్నారి.. స్టార్​ హీరోయిన్! ఎవరో గుర్తుపట్టగలరా?, actress-sneha-childhood-pic-viral". web.archive.org. 2024-01-01. Archived from the original on 2024-01-01. Retrieved 2024-01-01. {{cite web}}: zero width space character in |title= at position 32 (help)CS1 maint: bot: original URL status unknown (link)
  9. "Sneha and Prasanna First Film together after Marriage". kollywoodtoday.net. 14 August 2013. Archived from the original on 18 January 2015. Retrieved 29 March 2011.{{cite web}}: CS1 maint: unfit URL (link)
  10. subramanian, anupama (12 August 2015). "Baby boy for Sneha, Prasanna". Deccan Chronicle.
  11. "Sneha reveals her baby girl's pictures for the first time". The Times of India.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రసన్న&oldid=4284202" నుండి వెలికితీశారు