జవాన్ (2017 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జవాన్
సినిమా పోస్టర్
దర్శకత్వంబి.వి.ఎస్ రవి
రచనబి.వి.ఎస్ రవి
కళ్యాణ్ వర్మ దండు
సాయి కృష్ణ
వంశి బాలపనూరి
నిర్మాతకృష్ణ
దిల్ రాజు(సమర్పణ)
తారాగణంసాయి ధరమ్ తేజ్
మెహ్రీన్ పిర్జాదా
ప్రసన్న
సుబ్బరాజు
ఛాయాగ్రహణంకే.వి. గుహన్
కూర్పుఎస్.ఆర్ శేఖర్
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
అరుణాచల్ క్రియేషన్స్
విడుదల తేదీ
1 డిసెంబర్ 2017[1]
దేశంఇండియా
భాషతెలుగు
బడ్జెట్25-30 కోట్లు(అంచనా)
బాక్సాఫీసు18.9 కోట్లు

జవాన్ 2017లో విడుదలైన తెలుగు చలనచిత్రం. అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై కృష్ణ నిర్మించాడు. సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ పిర్జాదా, సుబ్బరాజు నటించిన ఈ చిత్రానికి బి.వి.ఎస్ రవి దర్శకత్వం అందించాడు.[2]

కథ[మార్చు]

జై(సాయిధ‌ర‌మ్ తేజ్‌), కేశ‌వ్‌(ప్ర‌సన్న‌) భిన్న వ్యక్తిత్వాలున్నవారు. ఈ మ‌న‌స‌త్త్వాల‌తో చిన్న‌ప్పుడే విడిపోతారు. జై దేశ‌భ‌క్తితో పెరిగి పెద్ద‌వుతాడు. కేశ‌వ హింసా ప్ర‌వృత్తితో పెరిగి తీవ్ర‌వాద సంస్థ‌ల‌తో ప‌రిచ‌యాలు పెంచుకుంటాడు. ఈ క్ర‌మంలో దేశ ర‌క్ష‌ణ‌లో కీల‌క పాత్ర పోషించే సంస్థ డి.ఆర్‌.డి.ఒ .. అక్టోప‌స్ అనే మిసైల్‌ను, దానికి సంబంధించిన ఫార్ములాను త‌యారు చేస్తుంది. దాన్ని కొట్టేయాల‌ని కేశ‌వ అండ్ గ్యాంగ్ ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తుంది. అదే స‌మయంలో డి.ఆర్‌.డి.ఒ సంస్థ‌లో ఉద్యోగం సంపాదించుకోవాల‌నుకునే జైకి కోట‌శ్రీనివాస‌రావు వ‌ల్ల సంస్థ‌లో ఏదో జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. దాంతో రంగంలోకి దిగి త‌న తెలివి తేట‌ల‌తో కేశ‌వ అండ్ గ్యాంగ్‌కు చెక్ చెప్పే ప్ర‌య‌త్నం చేస్తాడు. దాంతో కేశ‌వ అండ్ గ్యాంగ్ జై స‌హా అత‌ని కుటుంబాన్ని టార్గెట్ చేస్తుంది. అప్పుడు జై ఏం చేస్తాడు? త‌న కుటుంబాన్ని, దేశాన్ని ఎలా కాపాడుకుంటాడనేది కథ......[3]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: బి.వి.ఎస్ రవి
  • నిర్మాత: కృష్ణ, దిల్ రాజు(సమర్పణ)
  • రచన: బి.వి.ఎస్ రవి కళ్యాణ్ వర్మ దండు, సాయి కృష్ణ. వంశి బాలపనూరి
  • సంగీతం: ఎస్.ఎస్. తమన్
  • ఛాయాగ్రహణం: కే.వి. గుహన్
  • కూర్పు: ఎస్.ఆర్ శేఖర్

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందించాడు. పాటలని మ్యాంగో మ్యుజిక్ ద్వారా విడుదల చేశారు.[4]

పాటల పట్టిక
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఇంటికి ఒక్కడు కావాలి"కృష్ణకాంత్ఆదిత్య, రఘురామ్, సాకేత్, శ్రీ కృష్ణ04:13
2."అవునన్నా కాదన్నా"కృష్ణకాంత్శ్రేయ ఘోషాల్, ఎస్.ఎస్. తమన్04:30
3."బంగారు"భాస్కరభట్ల రవికుమార్దీపు, రాశి ఖన్నా04:17
4."బుగ్గంచున"శ్రీమణిశ్రీ కృష్ణ, లిప్సిక04:02
5."బొమ్మ అదిరింది"భాస్కరభట్ల రవికుమార్సాకేత్, మోహన భోగరాజు03:35
Total length:20:37

మూలాలు[మార్చు]

  1. [1]
  2. "Sai Dharam Tej's "Jawaan" launched". Idlebrain.com. Retrieved 23 August 2019.
  3. "Sai Dharam Tej's "Jawaan" pre-look released". Idlebrain.com. Retrieved 23 August 2019.
  4. ""Sai Dharam Tej's" "Jawaan" PreRelease Event". Mango Music. Retrieved 23 August 2019.

ఇతర లంకెలు[మార్చు]