Jump to content

బి.వి.ఎస్ రవి

వికీపీడియా నుండి
బి.వి.ఎస్. రవి
జననం
బాచిమంచి వెంకట సుబ్రహ్మణ్యం రవి

(1974-06-22) 1974 జూన్ 22 (వయసు 50)
విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
ఇతర పేర్లుమచ్చ రవి[1]
వృత్తిరచయిత, నిర్మాత, దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2002 — ప్రస్తుతం
జీవిత భాగస్వామిశ్రీ లత

బి.వి.ఎస్ రవి (జననం 1974 జూన్ 22) తెలుగు చిత్రాలలో పనిచేసే భారతీయ స్క్రీన్ రైటర్, డైలాగ్ రైటర్. సన్నిహితులు మచ్చ రవిగా పిలుచుకునే బి.వి.ఎస్ రవి పూర్తిపేరు బాచిమంచి వెంకట సుబ్రహ్మణ్యం రవి.[2]

కెరీర్

[మార్చు]

పోసాని కృష్ణమురళికి సహాయ కథా రచయితగా శివయ్య, సీతారామరాజు, ప్రేయసి రావే, స్నేహితులు, అయోధ్య రామయ్యా, భద్రాచలం వంటి చిత్రాలకు బి.వి.ఎస్ రవి పనిచేసాడు. ఇక 2011లో వాంటెడ్ చిత్రానికి దర్శకుడిగా మారాడు. ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించగా గోపీచంద్, దీక్షా సేథ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

2012లో వివాదాస్పద హిట్ చిత్రం దేనికైనా రెడీకి ఆయన కథ అందించాడు. పూరి జగన్నాథ్‌తో కలిసి కెమెరామెన్ గంగతో రాంబాబు, ఇద్దరమ్మాయిలతో, దేవుడు చేసిన మనుషులు చిత్రాలకు సహ రచయితగా ఉన్నారు.

బి.వి.ఎస్ రవి సెకండ్ హ్యాండ్ చిత్రానికి నిర్మాతగా మారాడు. ఆయన తక్కువ బడ్జెట్‌లో చిత్రాన్ని దృశ్యపరంగా, సాంకేతికంగా అద్భుతంగా పూర్తి చేయడం ద్వారా తన నిర్వహణ, సృజనాత్మక నైపుణ్యాలను ఈ చిత్రంతో నిరూపించాడు.[3] తెలుగు చిత్ర పరిశ్రమలో సింగిల్ షాట్ సినిమాటోగ్రఫీ అనే కాన్సెప్ట్‌ను రూపొందించిన మొదటి నిర్మాత బివిఎస్ రవి గా గుర్తింపుతెచ్చుకున్నాడు.

రామ్ గోపాల్ వర్మ, పూరీ జగన్నాథ్, కృష్ణ వంశీ, రానా దగ్గుబాటి, అల్లు అర్జున్, రవితేజ, దిల్ రాజు, మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మీ ప్రసన్నలకు ఆయన సన్నిహితుడు.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

దర్శకుడిగా

[మార్చు]
Year Title
2011 వాంటెడ్
2017 జవాన్

నిర్మాతగా

[మార్చు]
Year Title
2013 సెకండ్ హ్యాండ్

నటుడిగా

[మార్చు]
Year Title idi ra BVS
2004 కేడీ నం:1
2005 శ్రావణమాసం
2005 అయోధ్య
2006 నాయుడమ్మ
2021 క్రాక్

స్క్రీన్ రైటర్‌గా

[మార్చు]
Year Work Notes
2021 - ప్రస్తుతం ఏబుల్ టాక్ షో
2017 జవాన్
2015 డైనమేట్
2014 పాండవులు పాండవులు తుమ్మెద
2013 గౌరవం
2013 ఇద్దరమ్మాయిలతో
2012 దేనికైనా రెడీ
2012 కెమెరామెన్ గంగతో రాంబాబు
2012 దేవుడు చేసిన మనుషులు
2011 వాంటెడ్
2010 తకిట తకిట
2010 ఝుమ్మంది నాదం
2009 జయూభవ
2009 సలీం
2008 తులసి
2008 కింగ్
2008 పరుగు
2007 మున్నా
2007 అతిధి
2006 నాయుడమ్మ
2006 రామ్
2005 ధన 51
2005 నాయకుడు
2005 చక్రం
2005 అయోధ్య
2005 భద్ర
2003 సత్యం
2002 ఖడ్గం
2002 ఖైదీ బ్రదర్స్
2002 గర్ల్ ఫ్రెండ్

మూలాలు

[మార్చు]
  1. "Sai Dharam Tej's next launched". Deccan Chronicle. 17 January 2017.
  2. "BVS RAVI Guest Faculty". Annapurna International School of Film and Media. Archived from the original on 23 January 2018. Retrieved 20 September 2017.
  3. "BVS Ravi turns co-producer - Telugu cinema news".