త్రిపుర (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
త్రిపుర
(2015 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజకిరణ్
నిర్మాణం ఎ.చినబాబు,
ఎం.రాజశేఖర్
కథ రాజకిరణ్
చిత్రానువాదం కోన వెంకట్,
వెలిగొండ శ్రీనివాస్
తారాగణం నాని,
కలర్స్ స్వాతి,
నవీన్‌చంద్ర,
రావు రమేశ్,
సప్తగిరి,
శ్రీమాన్,
‘షకలక’ శంకర్
సంగీతం కామ్రాన్
గీతరచన చంద్రబోస్,
రామజోగయ్య శాస్త్రి
సంభాషణలు రాజా
ఛాయాగ్రహణం రవికుమార్ సానా
కూర్పు ఉపేంద్ర
నిడివి 151 నిముషాలు
భాష తెలుగు

త్రిపుర రాజకిరణ్ దర్శకత్వంలో నాని, కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర ప్రధాన తారాగణంగా ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్ నిర్మించిన 2015 నాటి తెలుగు చలన చిత్రం.

కథ[మార్చు]

వరహాపట్నం అనే గ్రామం. అందులో శివన్నారాయణ దంపతుల (శివన్నారాయణ, రజిత) పెద్దమ్మాయి త్రిపుర అలియాస్ చిట్టి (స్వాతి). మరదలు త్రిపురకూ, ఇంట్లోవాళ్ళకీ ఇష్టం లేకపోయినా ఆమెనే పెళ్ళాడాలని తిరిగే మేనమామ సన్న్యాసిరాజు (సప్తగిరి). పెళ్ళీడుకొచ్చినా వచ్చిన సంబంధాలన్నీ తప్పిపోతున్న త్రిపురకు ఒక చిత్రమైన లక్షణం. ఆ అమ్మాయికి ఎవరి గురించైనా, ఏదైనా కలలో వస్తే - అది నిజమవుతుంటుంది. ఊరు ఊరంతా ఆ అమ్మాయి నిద్ర లేవగానే - ఆమె కలల్లో తమ గురించి, తమ వాళ్ళ గురించి ఏమొచ్చిందో తెలుసుకోవడానికి క్యూలు కడుతుంటారు.

కలలపై ట్రీట్‌మెంట్ కోసం త్రిపురను హైదరాబాద్‌లో ప్రొఫెసర్ రమేశ్ (రావు రమేశ్) దగ్గరకు తీసుకువెళతారు. అక్కడ డాక్టర్ నవీన్ (‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర) ఆమెకు ట్రీట్‌మెంట్ చేయడం మొదలుపెడతాడు. అప్పటి దాకా ఎవరిని చూసినా పెళ్ళికి వద్దనే హీరోయిన్ తీరా ఒక్క అనుకోని ముద్దుకే సదరు డాక్టర్‌ను ఇష్టపడుతుంది. ఆ మరునాడే అతని బెకైక్కి ఊరంతా తిరుగుతుంది. అతనూ ఆనందంగా తిప్పుతాడు. పెళ్ళికి ఒప్పుకోని తల్లితండ్రుల్ని వదిలేసి, లేచిపోదామని హీరోయిన్ అంటుంది. చివరకు డాక్టర్‌తో హీరోయిన్ పెళ్ళవుతుంది.

పెళ్ళయి హైదరాబాద్ వచ్చిన హీరోయిన్‌కు రకరకాల అనుభవాలు. ఊరికి దోవ అడిగిన వ్యక్తి మరణిస్తాడు. కలలో వచ్చినట్లే బ్రోకర్ తాతారావుకు యాక్సిడెంట్ అవుతుంది. ఇంతలో తన భర్తను తానే కత్తితో పొడిచినట్లు కల. అక్కడ ఇంటర్వెల్. మరోపక్క డాక్టర్ నవీన్‌తో చాలా సన్నిహితంగా మెలిగిన కొలీగ్ డాక్టర్ ఈషా (పూజా రామచంద్రన్) నెలరోజులుగా కనిపించదు. డాక్టర్ నవీన్‌కు ఫ్రెండ్‌‌స గ్రూప్‌లో ఒకడైన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తిలక్ (కన్నడ నటుడు తిలక్) దర్యాప్తు చేస్తుంటాడు. కనిపించకుండా పోయిన ఆ అమ్మాయిని చంపిందెవరు? హీరో అమ్మేద్దామనుకుంటున్న ఫార్మ్‌హౌస్‌లో ఉన్న దయ్యం కథేమిటి? దయ్యం పగ ఏమిటి? ఇంతకీ హంతకుడెవరన్నది మిగతా ఫిల్మ్.