వర్షిణి

వికీపీడియా నుండి
(షామిలి సుందరరాజన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వ‌ర్షిణి
జననం
ఇతర పేర్లువ‌ర్షిణి
వృత్తినటి, ప్రచారకర్త

షామిలి సుందరరాజన్ (వ‌ర్షిణి) భారతీయ చలనచిత్ర నటి,[1] ప్రచారకర్త. ఆమె ఎక్కువగా తెలుగు చలన చిత్రాలలో నటించింది. ఆమె 2014లో జాతీయ పురస్కారం లభించిన చందమామ కథలు ద్వారా నటనా జీవితాన్ని ప్రారంభించింది.

జీవితం తొలిదశలో, వృత్తి[మార్చు]

వ‌ర్షిణి హైదరాబాదులో స్థిరపడిన తమిళ కుటుంబంలో రెండో కూతురుగా జన్మించింది. ఆమె ఎలక్ట్రానిక్స్‌లో తన బాచిలర్ డిగ్రీని పూర్తిచేసింది. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది, శంభో శివ శంభో చిత్రంలో చిన్న పాత్ర చేసిన తరువాత ఆమె జాతీయ పురస్కారం గెలుచుకున్న చందమామ కథలు సినిమాలో కూడా నటించింది. ఆమె లవర్స్ , కాయ్ రాజా కాయ్ , బెస్ట్ యాక్టర్స్ వంటి చిత్రాలలో నటనకుగాను పేరు తెచ్చుకుంది. ఆమె అన్నపూర్ణా స్టుడియొస్ సమర్పించిన పెళ్ళి గొల[2] అనే వెబ్ సిరీస్‌లో నటించి మంచిపేరు తెచ్చుకుంది. ఆ వెబ్ సిరీస్‌కు లభించిన ఆదరణకు గాను రెండొవ సీసన్ పెళ్ళి గొల 2 విడుదల చేసారు. ఆమె టీవీ షో ఢీలో టీం లీడర్‌గా కూడా ప్రసిద్ది చెందింది. ఇప్పుడు ఆమె పటాస్ 2 అనే టీవీ షోలో నటిస్తుంది.[3]

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2010 శంభో శివ శంభో
2014 చందమామ కథలు రేణు
2014 లవర్స్ సౌమ్య
2015 కాయ్ రాజా కాయ్ గీతాంజలి
2015 బెస్ట్ యాక్టర్స్‌ అర్చన
2016 శ్రీరామ రక్ష
2022 మళ్ళీ మొదలైంది నిషా
2023 శాకుంతలం సానుమతి
భాగ్ సాలే రమ్య
2024 భూతద్దం భాస్కర్ నారాయణ

మూలాలు[మార్చు]

  1. "Varshini Sounderajan signs her next film". deccanchronicle.com. 2 December 2017. Archived from the original on 24 నవంబరు 2018. Retrieved 1 నవంబరు 2020.
  2. "Two young and quirky digital series to entertain you this Ugadi". timesofindia.com. 29 March 2017.
  3. TV9, తెలుగు (6 April 2020). "బుల్లి తెర‌పై ఈమె నయా సెన్సేష‌న్..వ‌ర్షిణి...అందాల వాహిని". TV9 Telugu. Archived from the original on 7 ఏప్రిల్ 2020. Retrieved 7 April 2020.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=వర్షిణి&oldid=4182296" నుండి వెలికితీశారు