Jump to content

భాగ్ సాలే

వికీపీడియా నుండి
భాగ్ సాలే
దర్శకత్వంప్రణీత్ బ్రమండపల్లి
రచనప్రణీత్ బ్రమండపల్లి
నిర్మాతఅర్జున్‌ దాస్యన్‌
యష్‌ రంగినేని
కల్యాణ్‌ సింగనమల
తారాగణం
ఛాయాగ్రహణంరమేశ్ కుశేన్దర్
కూర్పుఆర్. కార్తీక శ్రీనివాస్
సంగీతంకాల భైరవ
నిర్మాణ
సంస్థలు
బిగ్‌ బెన్‌ సినిమా, సినీ వాల్లే మూవీస్‌
విడుదల తేదీ
2023 జులై 7 (2023-07-07)
దేశంభారతదేశం
భాషతెలుగు

భాగ్‌ సాలే 2023లోవిడుదలైన తెలుగు సినిమా. బిగ్‌ బెన్‌ సినిమా, సినీ వాల్లే మూవీస్‌ బ్యానర్‌లపై అర్జున్‌ దాస్యన్‌, యష్‌ రంగినేని, కల్యాణ్‌ సింగనమల నిర్మించిన ఈ సినిమాకు ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వం వహించాడు. శ్రీ సింహా, నేహా సోలంకి, వైవా హర్ష, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 26న విడుదల చేసి[1] సినిమాను జులై 7న విడుదల చేశారు.[2][3]

ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో 2025 ఆగష్టు 28 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]

అర్జున్ (శ్రీసింహా) ఓ స్టార్ హోటల్‌లో షెఫ్‌గా పని చేస్తూనే ఓ పెద్ద రెస్టారెంట్‌కు ఓనర్ కావాలని కలలు కంటుంటాడు. తాను ఓ ధనవంతుల బిడ్డ అని మాయా (నేహా సోలంకి)కి నమ్మిస్తూ ప్రేమలో దించుతాడు. అర్జున్ తన తండ్రి (రాజీవ్ కనకాల)కి ఎంతో ఇష్టమైన సొంతింటిని అమ్మించి ఆ డబ్బులతో రెస్టారెంట్ పెట్టాలని అనుకుంటాడు. ఇంతలో మాయ ఇంటిపై డాన్ శామూల్ (జాన్ విజయ్) దాడి చేసి తనకు డైమండ్ రింగ్ ఇవ్వాలంటూ ఆమె తండ్రి (సంజయ్ స్వరూప్)ని శామ్యూల్ కిడ్నాప్ చేస్తాడు. అసలు ఆ రింగ్ ఏంటి ? దాని వెనుక స్టోరీ ఏంటి ? మాయ తండ్రిని అర్జున్ కాపాడాడా? తన రెస్టారెంట్ కల నెరవేర్చుకున్నాడా ? అర్జున్ చెప్పినవన్నీ అబద్ధాలు అని తెలిసాక, మాయ ఏం చేసింది? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: బిగ్‌ బెన్‌ సినిమా, సినీ వాల్లే మూవీస్‌
  • నిర్మాత: అర్జున్‌ దాస్యన్‌, యష్‌ రంగినేని, కల్యాణ్‌ సింగనమల
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రణీత్ బ్రమండపల్లి[5]
  • సంగీతం: కాలభైరవ
  • సినిమాటోగ్రఫీ: రమేశ్ కుశేన్దర్
  • ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

పాటలు

[మార్చు]
భాగ్ సాలే
సౌండ్‌ట్రాక్ by
Released2023
Recorded2023
Genreసౌండ్‌ట్రాక్
Length17:12
Languageతెలుగు
Labelఆదిత్య మ్యూజిక్
కాల భైరవ chronology
కృష్ణమ్మ
(2022)
భాగ్ సాలే
(2023)
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."కూత రాంప్"కృష్ణ కాంత్కాల భైరవ4:07
2."థేర పదదేమో"మశ్చేంద్రకాల భైరవ3:07
3."ప్రేమ కోసం"కాసర్ల శ్యామ్మంగ్లీ3:29
4."హృదయం ఓడిపోయేలా"శ్రీ వల్లిసాయి సింధుజ3:16
5."ది వైబ్ ఆఫ్ భాగ్ సాలే"ప్రణవ్ చాగంటిప్రణవ్ చాగంటి3:13
మొత్తం నిడివి:17:12

మూలాలు

[మార్చు]
  1. ↑ Namasthe Telangana (26 June 2023). "కేసీఆర్‌కు తెలంగాణ ఎంతిష్టమో నువ్వంటే అంత ఇష్టం.. ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా భాగ్‌ సాలే ట్రైలర్‌". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
  2. ↑ Namasthe Telangana (27 June 2023). "ఉంగరం చుట్టూ తిరిగే కథ". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
  3. ↑ Eenadu (3 July 2023). "ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. థియేటర్లలో ఏకంగా 10 చిత్రాలు". Archived from the original on 4 July 2023. Retrieved 4 July 2023.
  4. ↑ "తెలుగు క్రైమ్ కామెడీ మూవీ.. రెండేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి.. నిజాం ఉంగరం చుట్టూ తిరిగే కథ". Hindustantimes Telugu. 26 August 2025. Archived from the original on 29 August 2025. Retrieved 29 August 2025.
  5. ↑ Eenadu (27 June 2023). "మంచి ఇరానీ ఛాయ్‌ లాంటి చిత్రమిది". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=భాగ్_సాలే&oldid=4629333" నుండి వెలికితీశారు