మహానుభావుడు (2017 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహానుభావుడు
దర్శకత్వందాసరి మారుతి
నిర్మాతవంశీ ప్రమోద్
తారాగణంశర్వానంద్, మెహరీన్
ఛాయాగ్రహణంనిజార్ షరీఫ్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
సెప్టెంబరు 29, 2017 (2017-09-29)[1]
సినిమా నిడివి
152 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

మహానుభావుడు 2017 లో దాసరి మారుతి దర్శకత్వంలో విడుదలైన సినిమా.[2] ఇందులో శర్వానంద్, మెహరీన్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) అనే మానసిక సమస్యతో బాధపడే వ్యక్తి గురించిన కథ ఇది.[3]

ఆనంద్ ది తాను వాడే ప్రతి వస్తువు అత్యంత శుభ్రంగా, పద్ధతిగా ఉండాలనుకునే మనస్తత్వం. తన ఎదుటి వారు అలాంటి పద్ధతులు పాటించకపోయినా సరే అతనికి ఏదో లోటుగా తోచి తనే శుభ్రం చేసేస్తుంటాడు. ఇది ఓసీడీ అనే మానసిక వైపరీత్యం. ఇందువల్ల అతనితో పాటు పనిచేసే ఉద్యోగులు కూడా ఇబ్బంది పడుతుంటారు. అమ్మాయిలు కూడా ఇతనికి దూరంగా ఉంటుంటారు. ఒకానొక సమయంలో శుభ్రత గురించి తపన పడే మేఘన అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. మొదట్లో ఇతని సింసియారిటీ చూసి మేఘన కూడా అతని ప్రేమలో పడుతుంది.

ఆనంద్ పెళ్ళి గురించి ప్రస్తావించగా మేఘన తన తండ్రి ఒప్పుకుంటేనే పెళ్ళి జరుగుతుందని చెబుతుంది. ఆమె తండ్రి ఒక పల్లెటూరిలో నివసిస్తూ ఉంటాడు. ఆయన మేనల్లుడిని తన దగ్గర ఉంచుకుని పోషిస్తూ ఉంటాడు. అతను మల్లవిద్యలో అందరినీ ఓడిస్తూ తన మావయ్య పరువుతో బాటు సర్పంచి పదవినీ కాపాడుతుంటాడు.

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • రెండు కళ్లు, రచన: కృష్ణకాంత్, గానం. ఆర్మాన్ మాలిక్
  • మహానుభావుడు , రచన: కృష్ణకాంత్ , గానం. ఎం ఎం. మానసి , గీతా మాధురి
  • కిస్ మీ బేబీ , రచన: కృష్ణకాంత్ , గానం.ఎస్.థమన్ , మనీషా ఈరాబత్తిన
  • మై లవ్ ఈజ్ బ్యాక్, రచన: కృష్ణకాంత్, గానం. రాహుల్ నంబియార్
  • బొమ్మలు బొమ్మలులు , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.నకేష్ అజీజ్
  • ఎప్పుడైనా, రచన: సిరి వెన్నెల సీతారామ శాస్త్రి, గానంశ్వేతా పండిట్, రీటా , త్యాగరాజన్

మూలాలు

[మార్చు]
  1. "మహానుభావుడు తెలుగు సినిమా సమీక్ష". 123telugu.com. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. Retrieved 4 December 2017.
  2. న్యాయపతి, నీషిత. "మహానుభావుడు సినిమా సమీక్ష". timesofindia.indiatimes.com. టైమ్స్ ఆఫ్ ఇండియా. Retrieved 4 December 2017.
  3. వై, సునీతా చౌదరి. "'Mahanubhavudu' review: a decent time pass story". thehindu.com. ది హిందు. Retrieved 4 December 2017.