Jump to content

రోజులు మారాయి (2016 సినిమా)

వికీపీడియా నుండి
రోజులు మారాయి
దర్శకత్వంమురళీ కృష్ణ ముడిదాని
స్క్రీన్ ప్లేమారుతి
నిర్మాతజి.శ్రీనివాసరావు
తారాగణంచేతన్ మద్దినేని
పార్వతీశం
కృతిక
తేజస్వి మదివాడ
ఛాయాగ్రహణంపి.బాల్ రెడ్డి
కూర్పుఎస్.బి. ఉద్దవ్
సంగీతంజేబీ
నిర్మాణ
సంస్థలు
మారుతి టాకీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్
విడుదల తేదీ
2016 జూలై 1
దేశం భారతదేశం
భాషతెలుగు

రోజులు మారాయి 2016లో విడుదలైన తెలుగు సినిమా.[1] దిల్ రాజు సమర్పణలో మారుతి టాకీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్స్‌పై జి.శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకు మురళీ కృష్ణ ముడిదాని దర్శకత్వం వహించాడు. చేతన్ మద్దినేని, పార్వతీశం, కృతిక, తేజస్వి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియోను జూన్ 11న విడుదల చేసి, సినిమాను జూలై 1న విడుదల చేశారు.[2]

ఆధ్య(కృతిక), రంభ(తేజస్వి) అనే ఇద్దరూ స్నేహితులు. పీటర్(పార్వతీశం), అశ్వద్ (చేతన్)అనే ఇద్దరబ్బాయిలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి వారి సొంత అవసరాలు తీర్చుకునేందుకు వారిని వాడుకుంటూ వేరొకరితో ప్రేమ వ్యవహారం నడుపుతూ వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. ఈ క్రమమంలో ఓ బాబాను కలిస్తే ఆధ్య(కృతిక), రంభ(తేజస్వి) ను పెళ్లాడే వారు పది రోజుల్లోనే చనిపోతారని తెలుసుకున్న ఈ ఇద్దరు తమ జీవితం బావుండాలంటే మొదట ఎవరినైనా పెళ్లి చేసుకుని బలి చేయాలని ప్లాన్ చేసుకొని ఆద్య.. అశ్వద్ ను, రంభ..పీటర్ ను పెళ్ళాడి కొన్ని కారణాల వల్ల ఇద్దరూ అశ్వద్, పీటర్ లను చంపేస్తారు. అశ్వద్, పీటర్ చనిపోయారా? వీరి మరణం తర్వాత ఏమి జరిగిందనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్లు: మారుతి టాకీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్
  • సమర్పణ: దిల్ రాజు
  • నిర్మాత: జి.శ్రీనివాసరావు
  • కథ, స్క్రీన్‌ప్లే: మారుతి
  • దర్శకత్వం: మురళీ కృష్ణ ముడిదాని[5]
  • సంగీతం: జేబీ
  • సినిమాటోగ్రఫీ: పి.బాల్ రెడ్డి
  • మాటలు: రవివర్మ నంబూరి
  • ఎడిటర్: ఎస్.బి. ఉద్దవ్

మూలాలు

[మార్చు]
  1. Sakshi (5 June 2016). "రోజులు మారాయి." Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
  2. Sakshi (19 June 2016). "ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
  3. Filmy Focus (1 July 2016). "రోజులు మారాయి". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
  4. Deccan Chronicle (1 July 2016). "Kruthika talks about her upcoming film Rojulu Marayi" (in ఇంగ్లీష్). Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
  5. Sakshi (7 July 2016). "మా రోజులు మారాయి". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.

బయటి లింకులు

[మార్చు]