రొమాన్స్ (2013 సినిమా)
Jump to navigation
Jump to search
రొమాన్స్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | డార్లింగ్ స్వామి |
కథా రచయిత | డార్లింగ్ స్వామి |
నిర్మాత | జి. శ్రీనివాస్ రెడ్డి, ఎస్.కె.ఎన్. శ్రీనివాస్, దాసరి మారుతి |
తారాగణం | ప్రిన్స్, డింపల్ చొపడా, మానస, సాయి కుమార్, భార్గవి |
ఛాయాగ్రహణం | జె. ప్రభాకర్ రెడ్డి |
కూర్పు | ఎస్.బి. ఉద్ధవ్ |
సంగీతం | సాయి కార్తీక్ |
నిర్మాణ సంస్థ | గుడ్ సినిమా గ్రూప్ |
విడుదల తేదీ | 2013 ఆగస్టు 2[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రొమాన్స్ 2013, ఆగస్టు 2న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] డార్లింగ్ స్వామి దర్సకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రిన్స్, డింపల్ చొపడా, మానస, సాయి కుమార్, భార్గవి నటించగా, సాయి కార్తీక్ సంగీతం అందించాడు. సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.[2]
కథా నేపథ్యం[మార్చు]
తను ప్రేమించి, జీవితం పంచుకునే అమ్మాయి ఫరఫెక్ట్ గా ఉండాలనేది కృష్ణ (ప్రిన్స్) కోరిక. తనకు పరిచయమయిన అనూరాధ (డింపుల్) ను ప్రేమిస్తాడు. ఆమె తనకు సరైనదో కాదో తెలుసుకునే ప్రయత్నంలో కృష్ణ వేసిన ప్లాన్ రివర్స్ అయ్యి, అతన్ని ఛీ కొట్టి వెళ్లిపోతుంది. ఆ తర్వాత తన ప్రేమను కృష్ణ ఎలా గెలుచుకున్నాడు, ఆ ప్రాసెస్ లో కృష్ణకు అనూరాధ ఎలాంటి టెస్ట్ లు పెట్టిందనేది మిగతా కథ.[3]
నటవర్గం[మార్చు]
- ప్రిన్స్ (కృష్ణ)
- డింపల్ చొపడా (అను)
- మానస (లలిత)
- సాయి కుమార్ పంపన (బ్లూటూత్ బాబు)
- భార్గవి (శృతి)
- ప్రభాకర్
- సాయికృష్ణ
- వెంకీ
- హరీష్
- నిఖిల్
- శశాంక్
- అవినాష్
- రాము
- భార్గవి
- విష్ణు ప్రియ
- బిందు
సాంకేతికవర్గం[మార్చు]
- రచన, దర్శకత్వం: డార్లింగ్ స్వామి
- నిర్మాతలు: జి. శ్రీనివాస్ రెడ్డి, ఎస్.కె.ఎన్. శ్రీనివాస్, దాసరి మారుతి
- సంగీతం: సాయి కార్తీక్
- పాటలు: కాసర్ల శ్యామ్, కరుణాకర్ అడిగర్ల
- ఛాయాగ్రహణం: జె. ప్రభాకర్ రెడ్డి
- కూర్పు: ఎస్.బి. ఉద్ధవ్
- నిర్మాణ సంస్థ: గుడ్ సినిమా గ్రూప్
విడుదల[మార్చు]
ఇతర వివరాలు[మార్చు]
- డార్లింగ్, ‘రెబెల్’ సినిమాలకు మాటలు అందించిన డార్లింగ్ స్వామి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
- మారుతి మీడియా హౌస్ నుంచి వచ్చిన 4వ చిత్రమిది. చిన్న బడ్జెట్ తో తీయబడింది.[4]
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 "Romance in theaters worldwide on August 2nd". raagalahari.com. Retrieved 5 May 2020.
- ↑ "Romance got 'A' Certificate". IndiaGlitz. Retrieved 7 May 2020.
- ↑ 123తెలుగు, సమీక్ష (3 August 2013). "సమీక్ష : రొమాన్స్ – అంత రొమాంటిక్ గా లేదు." www.123telugu.com. Retrieved 7 May 2020.
- ↑ "Romance on 2 August". idlebrain.com. Retrieved 7 May 2020.