అంతర్జాతీయ పురుషుల దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
International Men's Day
International Men's Day
పాశ్చాత్య దేశాలలో పురుషులు/వారి హక్కులు/వారి అవసరాలు/వారి ఆరోగ్యం/వారి సుఖసంతోషాల గురించిన ఆలోచన తొంభైయవ దశకంలోనే ప్రారంభమైనది. అయితే భారతదేశం లో మాత్రం ఈ దినోత్సవానికి భర్త పట్ల క్రౌర్యం ఊతమిచ్చినది.[1] నిరాధార వరకట్న వేధింపు/గృహ హింస వ్యాజ్యాలతో పురుషుఓగల వ్యక్తిగత/వృత్తిసంబంధిత/వైవాహిక జీవితం చిన్నాభిన్నమవటం; ఏ నేరము చేయకనే పురుషులు, వారు తోబుట్టువులు, వారి వృద్ధ తల్లిదండ్రులు జైలుపాలు కావటం; సంఘం, వ్యవస్థ, చట్టాలు, ప్రసార మాధ్యమాలు, స్త్రీ వాదులు/స్త్రీ వాద సంస్థలు తల్లి/ఆడపడుచు స్థానాలలో ఉన్న స్త్రీలను విస్మరించి కేవలం భార్య స్థానంలో ఉన్న స్త్రీలను మాత్రమే స్త్రీలుగా పరిగణించటంతో ఈ వైఖరిని ఖండిస్తూ, ఈ దృక్పథంలో మార్పును ఆశిస్తూ భారతీయ స్త్రీలు సైతం అంతర్జాతీయ పురుషుల దినోత్సవంలో పాలుపంచుకోవటం ప్రారంభించారు. చట్టపరమైన తీవ్రవాదాన్ని (Legal Terrorism) ఆపమని, అకారణంగా బనాయించబడే 498ఏ/గృహహింస వ్యాజ్యాలకు అడ్డుకట్ట వేయమని అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా 2007 లో కలకత్తా నగరంలో ప్లేకార్డులు ప్రదర్శిస్తూ కవాతును నిర్వహిస్తోన్న భారతీయ మహిళలు
జరుపుకొనేవారుఈ క్రింది దేశాలలోని ప్రజలు/సంస్థలు: ట్రినిడాడ్ , టొబాగో, జమైకా, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బెల్జియం, భారతదేశం, చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, రొమేనియా, సింగపూరు, మాల్టా, యునైటెడ్ కింగ్‌డమ్, దక్షిణ ఆఫ్రికా, టాంజానియా, జింబాబ్వే, బోత్సువానా, సెషెల్స్, బురుండి, హంగేరి, ఐర్లాండ్, లిథువేనియా, ఐజిల్ ఆఫ్ మ్యాన్, ఘనా, కెనడా, డెన్మార్క్, నార్వే, ఆస్ట్రియా, క్రొయేషియా, బోస్నియా , హెర్జెగొవీనా, ఉక్రెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, పాకిస్థాన్, గ్రెనాడా, క్యూబా, ఆంటిగ్వా , బార్బుడా, సెయింటి లూషియా, సెయింట్ కిట్స్ , నెవిస్ , కేమ్యాన్ దీవులు
రకంCivil awareness day
Men and boys day
Anti-sexism day
జరుపుకొనే రోజు19 November
సంబంధిత పండుగపితృ దినోత్సవం, బాలల దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఒకే తేదిన

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం (ఆంగ్లం:International Men's Day లేదా IMD) ప్రతి సంవత్సరం నవంబరు 19 న అంతర్జాతీయా స్థాయిలో జరుపబడే ఉత్సవం. 1992 ఫిబ్రవరి 7న ప్రొఫెసర్ థామస్ ఓస్టర్ చే ఈ దినము ప్రారంభించబడిననూ, ట్రినిడాడ్ , టొబాగో దేశస్థులు దీనికి కొత్త ఊపిరులు ఊదారు.[2] దక్షిణ ఐరోపాకు చెందిన మాల్టా దీవిలో ఈ ఉత్సవాన్ని 1994 ఫిబ్రవరి 7 నుండి క్రమం తప్పక జరుపుతున్నారు. ఈ ఉత్సవాన్ని సుదీర్ఘ కాలంగా జరుపుతున్నది మాల్టా వారే. ఇది ఐక్య రాజ్య సమితి (United Nations) ఆమోదంతో మొదటగా ట్రినిడాడ్ , టొబాగోలో 1999 లో ప్రారంభించబడింది.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవానికి

ల నుండి పలు వ్యక్తులు, సంస్థలు మద్దతు తెలుపుతున్నాయి. యునెస్కో యొక్క స్త్రీ , శాంతికాముక సంస్కృతి విభాగ నిర్దేశకురాలు ఇంగెబోర్గ్ బ్రెయ్నెస్ ఈ దినోత్సవం గురించి ప్రస్తావిస్తూ

"This is an excellent idea and would give some gender balance.
(ఈ దినోత్సవం లింగ సమానతను అలవర్చే ఒక అద్భుతమైన ఆలోచన.)"

అని వ్యాఖ్యానించింది. దీని నిర్వాహకులకు సహాయ సహకారాలను అందించటానికై యునెస్కో ఎదురు చూస్తూ ఉంటుందని తెలిపినది.

అప్పటికే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపబడుతుండటం పితృ దినోత్సవం జరుపుబడుతున్ననూ, తండ్రికాని పురుషులకంటూ ఒక దినోత్సవం లేకపోవటం, ఈ దినోత్సవ ఆలోచనకు దారి తీశాయి.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపటం నేపథ్యంలో గల ప్రాథమిక లక్ష్యాలు:

 • ఆదర్శ పురుషుల గురించి ప్రత్యేకించి తెలుపటం
 • కేవలం సినిమా తారలనో, క్రీడాకారులనో మాత్రమే కాక, దైనందిన జీవితంలో కాయకష్టం చేసుకునైనా సరే గౌరవప్రదమైన నిజాయితీపరమైన జీవితాలు గడిపేవారి గురించి కూడా చెప్పటం
 • సంఘానికి, వర్గానికి, కుటుంబానికి, వైవాహిక వ్యవస్థకు, శిశు సంరక్షణకు , పర్యావరణకు పురుషులు ఒనగూర్చిన ప్రయోజనాలను గుర్తించటం
 • పురుషుల సాంఘిక, భావోద్వేగ, శారీరక , ఆధ్యాత్మిక ఆరోగ్యంపై దృష్టి సారించటం
 • సాంఘిక సేవలలో, విలువలలో, అంచనాలలో , చట్టాలలో పురుషులేదుర్కొంటూన్న వివక్షను చాటటం
 • స్త్రీ-పురుషుల మధ్యన సఖ్యత, సరైన సంబంధాలను నెలకొల్పటం
 • లింగ సమానత్వాన్ని వ్యాపింపజేయటం
 • హాని గురించిన తలంపులు లేని, పరిపూర్ణ అభివృద్ధికి అవకాశాన్నిచ్చే సురక్షితమైన ప్రపంచం రూపొందించటానికి కృషి చేయటం

ఇవే కాక -

 • సంఘంలో పురుషులు/బాలురు ఎదుర్కొనే వివక్షను
 • పురుషజాతికి
  • సంఘం పట్ల
  • కుటుంబం పట్ల
  • వివాహం పట్ల
  • శిశు సంరక్షణ పట్ల గల సత్సంకల్పము, ఆయా దిశలలో పురుషజాతి సల్పే కృషి, వీటి వలన పురుషజాతికి కలిగే సాధకబాధకాలను

- విశదీకరించే సందర్భమే అంతర్జాతీయ పురుషుల దినోత్సవము. స్థూలంగా ఈ దినోత్సవం యొక్క విశాల , అంతిమ ధ్యేయం ప్రాథమిక మానవీయ విలువలను పెంపొందించటం.

19 నవంబరున ఈ ఉత్సవాన్ని 70కి పైగా దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకొంటున్నాయి.

చరిత్ర

[మార్చు]
అంతర్జాతీయ పురుషుల దినోత్సవ చిహ్నం
అంతర్జాతీయ పురుషుల దినోత్సవ చిహ్నం

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం యొక్క చరిత్ర, ప్రత్యేకించి బాలురు/పురుషులు ఎదుర్కొనే సమస్యలను అధిగమిస్తూ, వారి అనుభవాలను పంచుకొంటూ ఆదర్శ పురుషుల ప్రాముఖ్యతను వివరిస్తూ వస్తోన్నది.

"It is deemed necessary in a social context which is often fascinated with images of males behaving badly..."
"(తరచూ చెడుగా ప్రవర్తించే పురుషుల ప్రతిబింబాలతో నింపేసి సంఘాన్ని ఆకర్షిస్తోన్న సందర్భంలో ఈ (దినోత్సవ) ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.)"

"In highlighting positive male role models IMD attempts to show that males of all ages respond much more energetically to positive role models than they do to negative stereotyping."
"(పురుషులు దుర్మార్గులనే మూసలో ఇరికించబడటం కంటే ఆదర్శ పురుషుల గురించి తెలుసుకొనటంలోనే అన్ని వయస్కుల పురుషులు ఉత్సాహంగా ప్రతిస్పందిస్తారని అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఋజువు చేయటానికి ప్రయత్నం చేస్తోంది.)"

1960 ల నుండే రష్యాలో పురుషుల దినోత్సవ ప్రతిపాదన ఉంది. 1968లో అమెరికన్ విలేకరి జాన్ పి హారిస్, పురుషులకంటూ ఏ దినోత్సవం లేకుండానే మహిళా ఉద్యోగులు జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం వలన సోవియట్ వ్యవస్థ లోని సమతూకం దెబ్బతిన్నదని వ్రాశాడు. తాను స్త్రీల దినోత్సవాన్ని వ్యతిరేకించటం లేదని, కానీ స్వామ్యవాద వ్యవస్థలో లింగ అసమానత ఒక తీరని లోటుగా నెలకొని ఉన్నదని ప్రస్తావించాడు. అతని మాటలలో -

"It has given much of equal rights to the sexes, but as it turns out, the women are much more equal than the men."
"(స్వామ్యవాద వ్యవస్థ స్త్రి-పురుషులిరువురికీ సమాన హక్కులనే ఇచ్చినా, పురుషులకన్నా స్త్రీలకే ఎక్కువ సమానత్వాన్ని ఇచ్చినట్లు అనిపిస్తోంది.)"

ప్రభుత్వాదేశాల అనుసారం, స్త్రీ ఆకాంక్షల ప్రకారం పురుషులు రెక్కలు ముక్కలు చేసుకొంటున్ననూ వారి కృషిని గుర్తించటానికి ఒక్క రోజు కూడా లేదు అని హారిస్ అభిప్రాయపడ్డాడు.

"This strikes me as unwarranted discrimination and rank injustice."
"(ఇది అసమంజసమైన వివక్ష అనీ, అన్యాయమనీ నాకు అనిపిస్తూ ఉంటుంది.)"

60వ దశకం నుండి 90వ దశకం వరకూ ముద్రణా మాధ్యమాలలో ఈ అసమానత పై అనేక ప్రశ్నలు వెలువడ్డాయి.

కన్సాస్ లోని మిస్సోరీ విశ్వవిద్యాలయానికి చెందిన, పురుష అధ్యయనాల ప్రొఫెసర్ అయిన థామస్ ఓస్టర్ 1991 ఫిబ్రవరి 7న తన సహచరులతో కలిసి సంఘానికి పురుషులు చేసే సేవలని గుర్తిస్తూ వారికి ధన్యవాదాలు తెలపాలనే ఆలోచన చేశారు.[3]

7 ఫిబ్రవరి 1992న ఇదే ఆలోచనను అమలులోకి తెచ్చారు. పురుషులే కాక స్త్రీలు సైతం ఒక చిన్న సమూహంగా ఏర్పడి మొట్టమొదటి అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరిపారు. 1991-92 సమయంలో థామస్ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం పై ఒక పుస్తకాన్ని కూడా రచించారు.

"One point which should be understood here is that International Men's Day (IMD) is conceived to include all persons and all peoples, not just a few who are actively involved in work with the individual psychological, social, economic, and cultural issues identified with the men's movement(s)."
("ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. పురుషుల ఉద్యమాలకు సంబంధించి వ్యక్తిగత, మానసిక, సాంఘిక, ఆర్థిక , సాంస్కృతిక అంశాలలో క్రియాశీలకంగా ఉండే ఏ కొద్దిమందికో పరిమితం కాకుండా అంతర్జాతీయు పురుషుల దినోత్సవం అందరినీ, సకలజనులను కలుపుకుపోవటానికి ఆవిష్కరించబడినది.")

"There are other social movements, other community groups, and in an issue oriented sense these other groups are like so many spokes in the wheel. The wheel has a hub and the hub represents core issues of interest to a variety of community groups."
("ఇతర సాంఘిక ఉద్యమాలు, ఇతర సమూహాలు చాలానే ఉన్నాయి. సమస్యల కోణం నుండి చూచినట్లైతే, ఇవన్నీ ఒక చక్రపు చువ్వలే. ఈ చక్రానికి ఒక కేంద్రం కలదు, ఈ కేంద్రమే అన్ని సాంఘిక సమూహాల మూల సమస్యలను సూచిస్తుంది.")

"...there is yet another more fundamental point which can be made about the value of a day of respect for all men as human beings."
("...పురుషులను కూడా మానవులుగనే విలువ కట్టే ఒక గౌరవప్రదమైన దినం యొక్క అవసరం ఇంకా ప్రాథమికమైన విషయంగానే మిగిలిపోయినది.")

మాల్టాలో 7 ఫిబ్రవరిన అంతర్జాతీయ పురుషుల దినోత్సవం తొలిసారిగా నిర్వహించబడింది. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులేదుర్కొంటూన్న పురుషులెవరూ విదేశాలకు వెళ్ళకుండా అక్కడి చట్టాలుండేవి. కోర్టులో కేసులు విచారణ దశలో ఉన్ననూ, భర్తను కారాగారంలోనే ఉంచేవారు. అతి సుదీర్ఘంగా ఈ దినోత్సవాన్ని జరుపుతూ వస్తోన్న దేశాలలో మాల్టానే మొదట నిలచింది. 2009 లో అక్కడి పురుషుల హక్కుల సంఘాలు మిగతా దేశాలోలాగానే 19 నవంబరుకు ఈ దినోత్సవాన్ని మార్చటానికి ఏకగ్రీవంగా అంగీకరించాయి.

ట్రినిడాడ్ , టొబాగో 19 నవంబరు న మొట్టమొదటి అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకొన్నది.[4]

జమైకా 19 నవంబరు న మొట్టమొదటి అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకొన్నది.[5] అక్కడి గాయకుడు లూసియానో ఈ వేడుకకు ప్రధాన వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఆస్ట్రేలియా అంతర్జాతీయ పురుషుల దినోత్సవానికి శ్రీకారం చుట్టినది. చైనా ఈ దినోత్సవాన్ని 2003 డిసెంబరులో జరిపినది.

దస్త్రం:International Men's Day , Kolkata 2013.jpg
భారతదేశంలో అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపటం 2007లో ప్రారంభమైనది. 2013 లో కలకత్తాలోని హృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన దినోత్సవంలో పాల్గొన్న పురుషులు

ప్రముఖ పురుష హక్కుల సంస్థ సేవ్ ఇండియని ఫ్యామిలీ అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరపటానికి పిలుపునిచ్చింది.[6] పురుషులకు కూడా సంక్షేమ శాఖ నెలకొల్పాలన్నది వీరి ప్రధాన డిమాండు. భారతదేశంలో పన్ను కట్టేవారిలో 82% శాతం పురుషులేనని, కానీ గడచిన 60 సంవత్సరాలలో పురుషుల సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా వెచ్చించబడలేదని, తెలిపారు. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కేవలం పురుషుల కోసమే ఉద్దేశించబడినది కాదని, తెలిపారు. వివక్ష లేని గృహహింస చట్టాలు కావాలని, పురుషుల సమస్యలు పరిగణలోకి తీసుకోవాలని ఈ దినోత్సవాన్ని ఇతర పురుషుల హక్కుల సంస్థలు సమర్థించాయి.

ఇంగ్లాండు ఒక విశ్వవిద్యాలయంలో మొట్టమొదటి సారిగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపబడింది. ఐర్లాండ్, స్కాట్లాండ్ దేశాలు కూడా ఇదే సంవత్సరం మొదటి అంతర్జాతీయ పురుషుల దినోత్సవంగా జరుపబడింది. దక్షిణ ఆఫ్రికా కూడా ఈ దినోత్సవాన్ని జరుపుకొనే జాబితాలో చేరినది.

హంగేరిలో మేరీ క్లారెన్స్ అనే ఒక మహిళా రచయిత లింగ సమతూకం, , లింగ సమానత్వం కోసం ఆ దేశానికి ఈ దినోత్సవాన్ని పరిచయం చేసింది. ఘనా కూడా ఈ దినోత్సవాన్ని జరుపటం ఈ సంవత్సరమే ప్రారంభించింది. ఇదే సంవత్సరం కెనడా, ఇటలీలు కూడా ఈ దినోత్సవాన్ని ఆచరించటం ప్రారంభించినవి.

హాంగ్‌కాంగ్, డెన్మార్క్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఫ్రాన్స్, పాకిస్తాన్, గ్రెనడా ఆంటిగ్వా , బార్బుడా, సెయింటి కిట్స్ , కివిస్ లలో మొదటి అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపబడింది. 2000 - 2004 సంవత్సరాల వరకు మెన్స్ వరల్డ్ డేను జరిపిననూ దాని తర్వాత ఆ దేశంలో అక్కడ ఆ ఉత్సవాన్ని జరుపటం మానివేశారు. అయితే 2010లో మరల ఈ ఉత్సవాలను పునరుత్తేజితం చేశారు.

టాంజానియా, జింబాబ్వే, బోత్సువానా, నార్వే, బోస్నియా , హెర్జెగొవీనా, క్యూబా కేమ్యాన్ దీవులు, సెయింట్ లూషియా దేశాలు ఈ దినోత్సవానికి శ్రీకారం చుట్టినవి.

సెషలెస్, బురుండి, ఐజిల్ ఆఫ్ మ్యాన్, ఉక్రెయిన్లు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపటం ప్రారంభించాయి.

ఇమామీ సంస్థకు చెందిన HE డియోడరెంట్ కుటుంబానికి, కార్యాలయానికి, సంఘానికి పురుషులు ఎంత చేసినా వారికి కావలసిన గుర్తింపు రావటం లేదనే సందేశాన్ని హాస్యాస్పదంగా చిత్రీకరిస్తూ ఒక గీతాన్ని రూపొందించింది.[7]

పురుషుల హక్కుల కోసం పోరాడే దీపికా నారాయణ్ భరద్వాజ్ పురుషుల పై ఒక కవిత రాసి తన ట్విట్టర్ అకౌంటులో పోస్టు చేసింది. నిత్యజీవితంలో పురుషుడు ఎన్నో కష్టాలను పడుతుంటాడని అతని ఇది కేవలం ఒక చిన్ని కృతజ్ఞత అని తెలుపుతూ దీనిని పురుషులకు అంకితమిచ్చింది.

ప్రముఖ బాలీవుడ్ నటి సోనాలీ కులకర్ణి పురుషులందరికీ అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినది. ఓటు హక్కు వచ్చీ రాకనే పురుషుడు సంపాదించవలసి వస్తోందని, పురుషుడే ఆధారవనరు అయిన కుటుంబాలలో ఇది మరీ ఎక్కువగా ఉన్నదని విచారం వ్యక్తం చేసింది. తనకేం కావాలో, తనకు ఇష్టమైనదేదో, తన మనస్తత్వమేమిటో తెలుసుకొనే లోపే పురుషుడు యాంత్రిక జీవితాన్ని అందిపుచ్చుకొంటాడని, పురుషుని త్యాగం అక్కడే మొదలవుతుందని తెలిపినది. స్త్రీ విమోచనకు కృషి చేసిన పురుషులను గుర్తు చేసుకొంటూ, వారు లేనిదే స్త్రీ జాతి ఈ రోజున ఇంత ముందుకు పోలేకపోయేదంది.

పురుషుల విషయంలో తను మాత్రం 'కలవారి అమ్మాయినే' నని తెలిపినది. తాను ఈ స్థాయికి ఎదిగినదంటే తన తండ్రి, సోదరుల వలననే తెలిపినది. తన తండ్రి చాలా సహనశీలుడని, తనకు సంగీతం నేర్పాలనుకొన్నది తన తండ్రేనని తెలిపినది. తన సోదరులెప్పుడూ తనలోని సృజనకు సాన పడుతూనే ఉంటారని తెలిపినది. తన భర్తకు తానంటే చాల ప్రేమ అని, అతనిది అర్థం చేసుకొనే గుణమని, స్త్రీలందరికీ అటువంటి భర్తే రావాలని తాను కోరుకొంటున్నాన్నది.

పురుషులు కూడా మానవులేనని, ఒక స్త్రీకి ప్రేమాభిమానాలు ఎంత అవసరమో, పురుషుడికి కూడా అంతే అవసరం అని, సృష్టిలో స్త్రీ-పురుషులిరువురూ భాగస్థులేనని తెలిపినది. పురుషులు మార్స్ నుండి రాలేదని (Men are not from Mars) అని తెలిపినది.[8]

నేపథ్యాలు

[మార్చు]

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నేపథ్యాన్ని ముందుకు తీసుకువస్తుంది.

 • 2001 - Today's Man. Tomorrow's Future (ఈనాటి పురుషుడే రేపటి భవిష్యత్తు)
 • 2002 - Peace (శాంతి)
 • 2003 - Men's Health (పురుషుల ఆరోగ్యం)
 • 2007 - Healing and Forgiveness (స్వస్థత , క్షమాగుణం)
 • 2008 - Honour and Scarifice (గౌరవం , త్యాగం)
 • 2009 - Positive Role Models (ఆదర్శ , స్ఫూర్తిదాయక పురుషులు)
 • 2010 - Our Children's Future (మన సంతాన భవిష్యత్తు)
 • 2011 - Giving Boys the Best Possible Start in Life (బాలురకు సాధ్యమైనంత ఉత్తమ జీవనారంభాన్ని ఇవ్వటం)
 • 2012 - Helping Men and Boys Live longer, Happier and Healthier Lives (సంతోషకర, ఆరోగ్యకర, , దీర్ఘకాలిక జీవితాలను గడిపేందుకు బాలురకు/పురుషులకు సహాయపడటం)
 • 2013 - Keeping Men and Boys safe (పురుషులను , బాలురను సురక్షితంగా ఉంచటం)
 • 2014 - Working Together For Men and Boys (పురుషుల , బాలుర కొరకు సమష్టి కృషి సల్పటం)
 • 2015 - Working To Expand Reproductive Options for Men (పురుషుల పునరుత్పత్తి అవకాశాలను పెంచటం కోసం కృషి చేయటం)

ఆదర్శ పురుషులు

[మార్చు]

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం యొక్క చరిత్ర బాలుర/పురుషుల సమస్యలను ప్రత్యేకించి పరిగణించటమే కాక స్ఫూర్తినిచ్చే ఆదర్శ పురుషులపై దృష్టి కేంద్రీకరించింది. ప్రస్తుత సాంఘిక దృక్పథంలో పురుషుడిని దురుసుగా ప్రవర్తించే ప్రతిబింబాలుగానే చూపటం జరుగుతోందని దీనిని మార్చవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ దినోత్సవాన్ని జరిపే వారి అభిప్రాయం. ఆదర్శ పురుషులను స్మరించటం వలన పురుషులపై ఉన్న దురభిప్రాయాలను తొలగించే ప్రయత్నం చేస్తోంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. పురుషుల హక్కుల అగ్నికి ఆజ్యం పోసిన వరకట్న వేధింపు/గృహ హింస చట్టాల దుర్వినియోగం - బజ్ ఫీడ్ న్యూస్ (1 డిసెంబరు 2015)
 2. 'UNESCO comes out in Support of International Men's Day', Article Trinidad Guardian Nov 20, 2001
 3. అంతర్జాతీయ పురుషుల దినోత్సవానికి రూపునిచ్చిన థామస్ ఓస్టర్
 4. ట్రినిడాడ్ , టొబాగోలో మొట్టమొదటి సారిగా జరిగిన అంతర్జాతీయ పురుషుల దినోత్సవం (CBTT - 20 నవంబరు 2002)
 5. జమైకా లో అంతర్జాతీయ పురుషుల దినోత్సవం (జమైకా గ్లీనర్ - 19 నవంబరు 2001)
 6. రేపే 'అంతర్జాతీయ పురుషుల దినోత్సవం'. సిద్ధమౌతున్న భారతీయ పురుషుడు. (హిందుస్తాన్ టైమ్స్ - 18 నవంబరు 2007
 7. "మెన్స్ డే యాంథెం ను రూపొందించిన ఇమామీ HE డియోడరెంట్ (బెస్ట్ మీడియా ఇన్ఫో - 20 నవంబరు 2014)". Archived from the original on 2016-03-04. Retrieved 2015-12-17.
 8. అందరికీ అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బాలీవుడ్ నటి సోనాలీ కులకర్ణి

be-x-old:Міжнародны мужчынскі дзень