చర్చ:అంతర్జాతీయ పురుషుల దినోత్సవం
కేవీఆర్ గారు, ఇటువంటి దినోత్సవం ఒకటి ఉన్నదని నాకు ఈ మధ్యనే (పురుషవాద రచనలు మొదలు పెట్టినప్పటి నుండే) తెలిసినది కానీ, ఈ వ్యాసం సృష్టించటానికి, లేదా విస్తరించటానికి నేను పెద్దగా చొరవ చూపలేకపోయాను. (పురుషుడికి జరిగే అన్యాయాలపైనే నా దృష్టి కేంద్రీకరిస్తూ వచ్చాను గానీ, నాణేనికి మరో వైపు, అనగా పురుషులలో ఉన్న మంచితనాన్ని, సుహృద్భావాన్ని ఏ విధంగా వ్యాపింప/విస్తరింపచ్చునో నా సంకుచిత దృక్పథానికి అందలేదు.) మీరు ఈ వ్యాసాన్ని విస్తరించమని కోరినపుడు కూడా, నాలో పెద్దగా ఆసక్తి కలుగలేదు. ఏదో కాస్త రాసి ముగిద్దాం అనుకొన్నాను. (హన్నన్నా...ఎంతటి పొరబాటు!) వ్యాసం మొదలు పెట్టి, కాస్త ముందుకెళ్ళిన తర్వాత గానీ అర్థం కాలేదు, ఈ వ్యాస విస్తరణ ఎంత ముఖ్యమని! ఇది ఏదో సరదాకో, మీరు చెప్పారనో, నేను పురుషవాద రచనలు చేస్తున్నాననో వ్రాయవలసిన వ్యాసం కాదు. నా దృష్టిని మొత్తం కేంద్రీకరించి విస్తరించవవలసినది. (నేను గానీ, ఒక దృష్టి గానీ, కేంద్రీకరించానంటే ఏమౌతుందో మీకు విదితమే!) ఫరవాలేదు. నిదానంగానైనా సరే, వ్యాసం ప్రధానంగానే వ్రాస్తాను. సూచించినందుకు ధన్యవాదాలు. ఇతర వ్యాసాలని మీరు ఎలాగైతే అలంకరించారో, దీనిని కూడా అలాగే (వీలైతే అంతకన్నా బాగా) అలంకరించగలరని విన్నపము. - శశి (చర్చ) 07:48, 14 అక్టోబరు 2015 (UTC)
- శశి గారూ ఈ వ్యాసాన్ని చక్కగా తీర్చిదిద్ది 2016 సంవత్సరం పురుషుల దినోత్సవం నాడు ఈ వారం వ్యాసంగా ప్రచురిద్దాం.--కె.వెంకటరమణ⇒చర్చ 13:54, 14 అక్టోబరు 2015 (UTC)
- కె.వెంకటరమణ గారు, చక్కని ఆలోచన. ఈ సంవత్సరం పురుషుల దినోత్సవానికి ఎలాగూ భర్త పట్ల క్రౌర్యం ప్రతిపాదించబడినది కావున, వచ్చే సంవత్సరం పురుషుల దినోత్సవానికల్లా దీనిని తీర్చిదిద్దుదాం. ధన్యవాదాలు. - శశి (చర్చ) 14:19, 14 అక్టోబరు 2015 (UTC)
- శశి గారూ ఈ వ్యాసాన్ని చక్కగా తీర్చిదిద్ది 2016 సంవత్సరం పురుషుల దినోత్సవం నాడు ఈ వారం వ్యాసంగా ప్రచురిద్దాం.--కె.వెంకటరమణ⇒చర్చ 13:54, 14 అక్టోబరు 2015 (UTC)
థామస్ ఓస్టర్ రచించిన పుస్తకంలోని కోట్ లు
[మార్చు] సహాయం అందించబడింది
ఆంగ్ల వికీ లో ఈ వ్యాసానికి ఒక మూలమైన http://internationalmensday.co/kansas-stream-1991-92/ నుండి కొన్ని కోట్లు చేర్చాను. అయితే నకలు హక్కుల సమస్య గుర్తుకు వచ్చి, ఇవి చేర్చవచ్చునో, లేదోనన్న సందేహం బయలుదేరినది. దయచేసి తెలుపగలరు. చేర్చవచ్చునన్నచో చేరుస్తాను. లేనిచో వ్యాఖ్యలలోని అభిప్రాయాలను మాత్రం వివరిస్తాను. - శశి (చర్చ) 06:39, 22 అక్టోబరు 2015 (UTC)
- శశి గారూ, అన్ని కోట్లను చేర్చనవసరం లేదు. కొన్నింటిని మూలం చేర్చి చేర్చండి. ఆ మూలాన్ని అవసరమైతే యితర లింకులలో చేర్చండి. మిగిలినవి ఎవరైనా చదువుకోనేందుకు ఉపయోగపడుతుంది.--కె.వెంకటరమణ⇒చర్చ 13:30, 24 డిసెంబరు 2015 (UTC)
- శశి గారూ సహాయం అందించబడినదని భావిస్తే సహాయమూసను {{సహాయం చేయబడింది}} తో మార్చండి.--కె.వెంకటరమణ⇒చర్చ 12:57, 25 డిసెంబరు 2015 (UTC)
- ధన్యవాదాలు కేవీఆర్ గారు. - శశి (చర్చ) 14:15, 25 డిసెంబరు 2015 (UTC)