భారతదేశంలో పురుషుల హక్కుల ఉద్యమం

వికీపీడియా నుండి
(పురుషుల హక్కులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పురుషులపై గృహహింసకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న బాధితులు

భారతదేశంలో పురుషుల హక్కుల ఉద్యమంభారతదేశంలో వివిధ పురుషుల హక్కుల సంస్థలకు సంబంధించిన ఉద్యమం. స్త్రీలకు మాత్రమే అనుకూలంగా ఉండి, వారికి మాత్రమే లాభదాయకమై, పురుషులకు హానికరంగా ఉండే చట్టాలను ఉపసంహరించాలని, లింగ వివక్షలేని చట్టాలను ప్రవేశపెట్టాలనేవి, ఈ ఉద్యమకారుల ప్రధాన ప్రతిపాదనలు.

ఈ సంఘాల కృషి

[మార్చు]

సుదీర్ఘకాలంగా ఈ సంఘాలు-

  • భార్యాభర్తల మధ్య నెలకొన్న అభిప్రాయభేదాలను పరిష్కరించి, సయోధ్య నెలకొల్పి, వారికి తగు సలహాలు/సూచనలు ఇచ్చి విడాకులను నివారించటానికి
  • భర్తగా పురుషుల హక్కులను/ఆత్మగౌరవాన్ని కాపాడటానికి
  • వరకట్న వేధింపు చట్టాలకు బలి అయిన పురుషులలో మానసిక సంఘర్షణలను పారద్రోలి, వారి ఆత్మహత్యా ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయటానికి
  • అవకాశవాద/స్వార్థపూరిత, స్వప్రయోజనాల కోసం కాపురాలను కూల్చటానికి సిద్ధపడే న్యాయవాదుల చేతుల నుండి బాధిత పురుషులను రక్షించటానికి, వారి న్యాయ పోరాటాలు సరియైన దిశలో పెట్టటానికి, వారికి అవసరమైన చేయూతనివ్వటానికి
  • వరకట్న వేధింపు చట్టాలలోని లొసుగులను సరిదిద్దటానికి
  • ఈ చట్టాలలో సాక్ష్యాధారాలు లేకుండా అరెస్టులు చేయకుండా నిరోధించటానికి (2 జూలై 2014 న ఇది సాకారమైనది)
  • నిరాధార ఆరోపణలతో చట్టాలను దుర్వినియోగం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడేలా చేయటానికి [1]
  • బాలుర/పురుషుల సమస్యల గురించి రాజకీయ నాయకులతో, విద్యా సంస్థలలో చర్చించటానికి[2]
  • అతివాద స్త్రీవాదుల తప్పుడు గణాంకాలను, పక్షపాతంలో కూడిన అభ్యాసాలను, అసత్యాల గురించి సంఘాన్ని జాగృతం చేయటానికి
  • పురుషుల హక్కులు కాపాడటానికి కృషి చేసే చిన్న చిన్న సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందించటానికి
  • భారతదేశపు చట్ట/న్యాయవ్యవస్థల మానవహక్కుల ఉల్లంఘనను తేటతెల్లం చేయటానికి
  • పాశ్చాత్య దేశాలలో భారతదేశం పైనున్న (స్త్రీలకు భద్రత లేమి, వేళ్ళునుకుపోయిన వరకట్న జాడ్యం వంటి) దురభిప్రాయాలను రూపుమాపటానికి

-అవిరామ కృష్తి సల్పుతున్నాయి.[3]

సంఘంలో విస్తారంగా వ్యాపించి ఉన్న పురుష ద్వేషం వలన దెబ్బతిన్న, వేధించబడుతోన్న, అణగారిన పురుషులకు ఊపిరిని ఊదుతూ వారి కోసమే ఈ సంస్థలు మన్నుతూ ఉన్నాయి. ఈ పురుష ద్వేషం వలనే వరుసగా పురుష వ్యతిరేక చట్టాలు రూపొందుతున్నవని, వీటి వలనే భారతదేశం లింగ ఆధారిత నేరపూరిత సంఘంగా మలచబడుతోందని గమనించాయి. పురుషుడి హక్కులపై, పురుషుని కుటుంబం హక్కులపై, తండ్రి యొక్క హక్కులపై, పిల్లల హక్కులపై, మానవ హక్కులపై ఈ సంస్థలు పోరాటం చేస్తున్నాయి.[4]

గౌరవప్రదంగా బ్రతికే పురుషుని వ్యక్తిత్వం పై బురద జల్లటం, అతణ్ణి శారీరకంగా/మానసికంగా వేధించటం, చట్టాలను ఆయుధాలుగా చేసుకొని వారిని బెదిరించటం నాణేనికి ఒక వైపు అయితే, సంతానం ఉన్నచో, పురుషుడిని వారికి దూరం చేయటం మరొక వైపు. సంతానం బాధ్యతలను కోర్టులు భార్యకే అప్పజెప్పటం, చాలా తక్కువ సమయం భర్తకు సంతానంతో గడిపే సమయాన్ని అనుమతించటం, వంటి వాటితో భర్త స్థానంలో ఉన్న పురుషుడు మరింత వేదనకు లోనౌతున్నాడని, తాము ఈ దిశగా కృషి చేస్తున్నామని, భర్తకు కూడా సంతానం పై సమాన హక్కులు ఉన్నాయని, పండుగ-పబ్బాలకు భర్త తన సంతానాన్ని తన ఇంటికి తీసుకువెళ్ళి వారితో సంతోషంగా గడిపే వెసులుబాటు కల్పించేలా తాము శ్రమిస్తున్నామని ఛైల్డ్స్ రైట్స్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంస్థ తెలిపినది.

వివిధ వృత్తులలో నిష్ణాతులైన, భార్యా బాధితులైన వారే ఈ సంఘాలలో సభ్యులు/నిర్వాహకులూ కూడా.

భారతదేశంలో పురుషుల హక్కుల సంఘాలు

[మార్చు]
  • Crime Against Man Cell లేదా Society for Prevention of Cruelty to Husbands, 1988, ఢిల్లీ
  • పీడిత పురుష/పతి పరిషత్తు, కలకత్తా
  • అఖిల భారతీయ పత్ని విరోధి మోర్చా, ఢిల్లీ
  • పురుష హక్క సౌరక్షణ్ సమితి, 1996, పూణే
  • సంగబాల్య, 2003, కర్ణాటక
  • ఇందియా కుడుంబ పాదుగాప్పు ఇయాకం, చెన్నై
  • Men's Rights Association
  • Men's Rights India
  • Save India Family Foundation, Bangalore
  • Childs Rights and Family Welfare, Mumbai
  • Confidare India, Bangalore
  • CRISP (Children's Rights Initiative for Shared Parenting)
  • DCW (Delhi Counsel for Women)
  • AIMRAW (Association for International Men's Rights Activism and Welfare)
  • AVFM-India (A Voice for Men - India)
  • INSAAF (Indian Social Awareness and Activism Forum)
  • Karnataka Rajya Purusha Samrakshana Samithi
  • AIMPF (All India Mother-in-Law Protection Forum)
  • MASHAAL (Mothers And Sisters of Husbands Against Abuse of Law)

పురుషుల హక్కులు

[మార్చు]

పురుషునిగా

[మార్చు]
  • సాంఘిక/మానసిక/శారీరక ఆరోగ్యం కలిగి ఉండటం

భర్తగా

[మార్చు]
  • భార్యచే ఎటువంటి గృహ హింసకూ లోను కాకుండటం

తండ్రిగా

[మార్చు]
  • సంతానంతో సంతోషంగా కావలసినంత సమయం గడపటం

చరిత్ర

[మార్చు]

ఢిల్లీకి చెందిన, అత్యున్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా పనిచేస్తున్న సుప్రీ రాం ప్రకాష్ చుగ్, 1988 లోనే తన సంస్థ Society for Prevention of Cruelty to Husbands ను స్థాపించారు. ఈ సంస్థ స్థాపనకు ముఖ్య కారణం "భార్యచే హింసించబడుతున్న లేదా బెదిరించబడుతున్న భర్తను రక్షించటానికి చట్టాలు లేవు. వరకట్న నిరోధక చట్టాలు స్త్రీ పక్షపాతంగానే ఉన్నాయి. నిరంతరం అనుమానించే/మానసికంగా బాధించే భార్య నుండి భర్త తనను తాను ఎలా రక్షించుకొవాలి?"

వరకట్న నిరోధక చట్టాలు స్త్రీ హక్కులను కాపాడుతాయి, కానీ దురదృష్టవశాత్తూ బెదిరించాలనుకొనే, లేక రాజీ రూపంలో అధిక మొత్తాన్ని వసూలు చేసుకొనవచ్చుననే భార్య యొక్క అమాయక భర్తను ఇవి బలిగొంటాయని, వైవాహిక సామరస్యాన్ని ఇవి చెడగొడతాయని చుగ్ అభిప్రాయపడ్డారు.

తన తమ్ముడి భార్య తమ కుటుంబ సభ్యులందరిపై నిరాధార వరకట్న వేధింపు వ్యాజ్యాలు వేయటంతో అరుణ్ మూర్తి, ఢిల్లీలో తన ఉద్యోగం సైతం వదిలివేసి, ఒక హెల్ప్ లైన్ తో సంగబాల్యను బెంగుళూరు నగరంలో స్థాపించారు.

అనేక కుటుంబ హక్కుల చట్టాల పరిరక్షక సంస్థలను కలుపుకొంటూ 9 మార్చి 2005 న Save Indian Family ఏర్పడినది.

సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ కు చెందిన స్వరూప్ సర్కార్ గృహ హింస చట్టానికి సంబంధించి ఈ విధంగా వ్యాఖ్యానించారు.

"This is nothing but terrorist activity by women's organisations. I do not know how many Bhagat Singhs, Jatin Desais and Netajis will be born to stop this legal terrorism."
"(ఇది కేవలం మహిళా సంక్షేమ సంస్థల తీవ్రవాద చర్య తప్పితే మరేమీ కాదు. ఈ చట్టపరమైన తీవ్రవాదాన్ని రూపుమాపటానికి ఎంత మంది భగత్ సింఘ్ లు, జతిన్ దేశాయ్ లు, నేతాజీలు పుట్టుకురావాలో నాకు తెలియదు.)"

[6]

"So Indian men, get up and be prepared to go to jail."
"(భారతీయ పురుషులారా, మేల్కొండి, కటకటాలపాలవటానికి సిద్ధం కండి.)"

దీనికి మద్దతు తెల్పుతూ సచిత్ దలాల్ అనే వ్యక్తికి రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి, పార్లమెంటు సభ్యులకు ఇతర ఉద్యమకారులకు "వివాహ వ్యవస్థ ఇక శిలువవేయబడినట్లే" నన్న సందేశాన్ని పంపారు. ఆయన మాటల్లో

"Finally the women of India have successfully crucified the sacred institution of marriage. When IPC 498 A (anti-dowry law) was not enough to satisfy the modern sadists (women), they introduced the domestic violence bill in order to loot the husband and the family legally."
"(చివరకు భారతీయ స్త్రీజాతి వివాహ వ్యవస్థకు విజయవంతంగా శిలువ వేయగలిగినది. భారతీయ శిక్షాస్మృతి లోని 498 ఏ (వరకట్న వ్యతిరేక) చట్టంతో సంతృప్తి పొందని ఈ ఆధునిక శాడిస్ట్లులు భర్తను/కుటుంబాలను చట్టపరంగా లూటీ చేయటానికి గృహ హింస బిల్లును తేనేతెచ్చారు.)"

"It gives ridiculous rights to women to loot their husbands and in-laws. Women call it gender equality. Some women are bold enough to blurt out that now it is the men's turn to suffer."
"(ఈ చట్టం స్త్రీలకు భర్త/అత్తమామలను లూటీ చేసే హాస్యాస్పదమైన హక్కులను ఇస్తోంది. స్త్రీలు దీనిని లింగ సమానత్వమని అంటున్నారు. కొందరు స్త్రీలైతే సగర్వంగా ఇక బాధించబడటం పురుషులు వంతు అని ఆగ్రహాన్ని వెళ్ళగక్కుతోన్నారు.)"

ఈ చట్టాన్ని తేవటంలో కీలక పాత్ర పోషించిన మహిళలను సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ వంటి సంస్థలు "ఆధునిక సూర్పనఖలు"గా సంబోధించినవి. ఈ చట్టాన్ని వ్యతిరేకించే వర్గాలు, వీటి వలన స్త్రీకి మరింత హాని జరుగబోతోందని, ఇవి విడాకులు సంఖ్యను పెంపొందించబోతున్నవని, వీటి వలన భవిష్యత్తులో స్త్రీ జాతి నడిరోడ్డుకు ఈడ్చబడుతుందని ఆ నాడే అంచనా వేశాయి. స్త్రీల చెప్పుచేతలలో నడిచే పురుషులను "అవివేకులు"గా సంబోధించినవి.

26 ఆగస్టున సేవ్ ఇండియా ఫ్యామిలీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చట్టపరమైన తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించింది.[7] స్త్రీవాదం పురుషులను బలిపశువులు చేసేంత పురోగతి సాధించినదది తేటతెల్లం చేసినది. సంసారంలోని చిన్న చిన్న పొరపొచ్చాలను కూడా గృహ హింస చట్టంలోనే బంధించబడుతోన్నవని, ఇది భారతీయ వివాహ వ్యవస్థను దెబ్బ తీస్తోన్నదని, అప్పటి స్త్రీ-శిశు సంక్షేమ మంత్రి రేణుకా చౌదరిని, నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ ఛెయిర్ పర్సన్ గిరిజా వ్యాస్ ను, అత్యున్నత న్యాయస్థాన న్యాయవాది ఇందిరా జై సింఘ్ ను దుయ్యబట్టినది. ఫలితంగా విడాకులు తీసుకొన్న తల్లి పంచన పెరిగే సంతానం పెరిగిపోతోందని, తండ్రిలోని సంఘానికి ఈ పరిణామాలు దారి తీస్తోన్నాయని ఈ సంస్థ ప్రతినిధులు హెచ్చరించారు.

ఇతర సంఘాలు ఈ చట్టాలు భర్త/అత్తమామలు/ఆడపడుచులు అనే కొత్త బాధితులను సృష్టించినవని, క్రొత్త సాంఘిక రుగ్మతకు నాంది పలికినవని తెలిపాయి. వివాహిత మృతులలో పురుషుల-స్త్రీల నిష్పత్తి 64:36 లో ఉన్నదని తెలిపినవి.

సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ నవంబరు 19, అంతర్జాతీయ పురుషుల దినోత్సవంగా జరపాలని ప్రకటించింది.[8] అనుకొన్న ప్రకారం జంతర్ మంతర్ వద్ద ఈ దినోత్సవాన్ని జరిపినది. భారతదేశంలో మొట్టమొదటి సారిగా పురుషుల దినోత్సవం జరుపబడ్డది. ఈ సందర్భంగా స్త్రీ హక్కుల పోరాటాలు చేసేవారు రహస్యంగా మాంసాన్ని భుజించే జంతు హక్కులు పరిరక్షకులు వంటి వారని గేలి చేసినది. భారతదేశంలో పోలియోను నిర్మూలించినట్లు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వుమెన్, ప్రతి ఇంటినుండి భర్తలను తరిమికొట్టే రోజు త్వరలోనే రానున్నదని తెలిపినది. శతాబ్దాలుగా భారతీయ సంఘం స్త్రీల పట్ల ప్రదర్శించిన వివక్ష వాస్తవమేనని, కానీ ఈ చారిత్రక అసమానతలను సరి చేయటానికి చట్టపరమైన చర్యలు చేపట్టటం మాత్రం తప్పిదమని పురుష హక్కుల సంఘాలు తెలిపినవి.[9] సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ కు చెందిన స్వరూప్ సర్కార్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.

"Women protection laws assume that women are always honest and truthful. Therefore proof and evidence is not required. So honest men are being jailed. Men are committing suicide. It has become an instrument not of equality but terror."
("స్త్రీ సంరక్షక చట్టాలు స్త్రీలు ఎల్లవేళలా నిజాయితీపరులుగానే ఉంటారని అనుకొంటున్నవి. అందుకే వీటికి సాక్ష్యాధారాలు అవసరం లేదు. ఫలితంగా నిజాయితీపరులైన పురుషులు చెరసాలపాలవుతున్నారు. పురుషులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సమానత్వానికి పరికరంగా ఉండవలసిన చట్టం, బెదిరింపుకు పరికరంగా మారిపోయినది.")

సేవ్ ఇండియా ఫ్యామిలీ సంస్థ ప్రతినిధులు ఒకానొక సమావేశంలో భర్త స్థానంలో ఉన్న పురుషులు, అత్త/ఆడపడుచు స్థానంలో ఉన్న స్త్రీలు 498ఏ చట్టంలో బలిపశువులౌతున్నా, స్త్రీ-శిశు సంక్షేమ మంత్రి చోద్యం చూస్తున్నారని వారు స్త్రీ అభివృద్ధి మంత్రా లేక భార్య అభివృద్ధి మంత్రా అనేది అర్థం కావటం లేదని తెలిపారు.[10]

ప్రస్తుత వరకట్న వేధింపు చట్టాలు పురుషులకు హానికరంగా ఉన్నవని, వీటిని మార్చవలసిన అవసరం ఉన్నదని పురుషవాదుల నుండి కుప్పలు తెప్పలుగా వస్తోన్న ఫిర్యాదుల దృష్ట్యా కేంద్రం ఈ చట్టంలో మార్పులకు అంగీకరించింది. అయితే మొదట అంగీకరించినా తర్వాత మాట మార్చింది. దీంతో పురుషవాదుల ఆగ్రహం కట్టలు తెంచుకొన్నది.[11]

హాస్యానికై కిట్ప్లై తాము రూపొందించిన వాణిజ్య ప్రకటనలో శోభనం నాడు కిర్రుమంచాన్ని వేసినందుకు వధువు వరుణ్ణి చెంపదెబ్బ కొట్టటం సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ విమర్శించింది.[12] కారణాలను ఈ విధంగా పేర్కొన్నది:

  • ఇది గృహహింసను పెంపొందించే విధంగా ఉన్నది
  • కిట్ప్లైకు ఇది హాస్యాస్పదం కావచ్చు, కానీ పురుషులకు కాదు, కాబట్టి
  • ఏ రకమైన గృహహింసనూ ప్రోత్సహించరాదు, భర్త పై కూడా, కాబట్టి
  • ఇది పురుషులను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా బాధిస్తుంది కాబట్టి
  • ఇదే ప్రకటనలో పాత్రల స్థానాన్ని మార్చి దానిని కిట్ప్లై ప్రసారం చేస్తే అది ఒక విప్లవాన్నే సృష్టిస్తుంది కాబట్టి
  • భర్తను చెంపదెబ్బ కొట్టటంలో తప్పేమీ లేదు, అనే సందేశాన్ని ఈ ప్రకటన పంపుతుంది కాబట్టి
  • ఇటువంటి ప్రకటనల వలనే, భర్త స్థానంలో ఉన్న పురుషులు, ఆత్మహత్యలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి

ఈ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు -

"There is a big hue and cry if a wife is hurt by her husband, but a blind eye is turned when there’s a public display of a wife hitting her husband. Any sort of violence between the spouses is considered illegal and termed as domestic violence or gender violence across the world. Depicting violence on national TV is unacceptable.
(భర్త చే భార్య హింసించబడ్డదని తెలిస్తే లబోదిబోమని కొట్టుకొనే వారు, అదే భార్య చే భర్త హింసించబడినట్లు కంటికెదురుగా కనబడుతున్నా చూసీ చూడనట్లు వెళ్ళిపోతారు. జీవిత భాగస్వాముల మధ్య ఏ రకమైన హింస అయినా గృహ హింస గానే ప్రపంచవ్యాప్తంగా పరిగణించబడుతోంది. యావద్దేశం వీక్షించే టీవీ లో హింస ఆమోదయోగ్యం కాదు.)"

- అని తెలిపారు.

కొన్ని స్త్రీ సంఘాలు కూడా ఈ వాదనను సమర్థించాయి.

ఇలాగే పాండ్స్, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ ప్రకటనలు కూడా వివాదాస్పదమయ్యాయి. చెన్నయ్ కు చెందిన ఇందియా కుడుంబ పాదుగాప్పు ఇయాకం కు చెందిన సురేష్ రాం -

"The Ponds ad terms husbands as wife beaters and the ICICI ad portrays verbal and economical abuse against men.
(పాండ్స్ ప్రకటన భర్తలనందరినీ భార్యను కొట్టేవారిగా, ఐసీఐసీఐ ప్రకటన పురుషు దూషణను, పురుషులను ఆర్థికపరంగా దుర్వినియోగపరిచే విధానాన్ని ప్రోత్సహించే విధంగా ఉన్నవి.)"

- అని తెలిపారు.

భార్య మృతి చెందినచో భర్త, అతని కుటుంబ సభ్యులు న్యాయస్థానాలచే సుదీర్ఘంగా కోర్టులచే విచారించబడుతున్నారని, దీని వలన స్త్రీ జాతికి ఎటువంటి ఉపయోగమూ లేదని, సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.[13] 98 శాతం వివాహిత పురుషులు భార్య/వారి కుటుంబ సభ్యులచే గృహ హింసకు గురవుతున్నారని, ఆర్థికంగా నష్టపోతున్నారని, అయిననూ వీరిని రక్షించేందుకు ఎటువంటి చట్టాలూ లేవని తెలిపినది.

"దయచేసి నన్ను నా భార్య నుండి ఎవరైనా రక్షించండి"

[మార్చు]

ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకులు సుభాష్ ఘై వద్ద అసిస్టెంట్ దర్శకులుగా పనిచేసిన పురుషోత్తం మహాజన్ రెండు వాదాలను తీసుకు వచ్చారు.[14] అవి-

"Despite all evidence, law enforcing agencies invariably take the woman’s side. The law is biased against men.)
(ఎన్ని సాక్ష్యాధారాలున్నా, చట్ట వ్యవస్థ స్త్రీ పక్షపాతిగా, పురుష ద్వేషిగానే ఉండిపోతోంది.)"

,

"I want to ask, aren’t the man’s mother and sisters women too. They also get harassed when a woman slaps a false dowry complaint against her husband. We want the courts to suo motu prosecute those who lodge false dowry complaints.
(పురుషుని తల్లి, అక్కచెల్లెళ్ళు మాత్రం స్త్రీలు కాదా అని నేను ప్రశ్నించదలచుకొన్నాను. ఒక భార్య తన భర్తపై నిరాధార వరకట్న వేధింపుల అభాండాలు వేసినపుడు వీటితో వారు కూడా వేధింపబడతారు. ఇలా నిరాధార ఆరోపణలు చేసేవారిని కోర్టులు సు మోటో గా శిక్షించాలి.)"

తన భార్య తొమ్మిదేళ్ళ తమ బిడ్డ ముందే తనను మానసికంగా/శారీరకంగా వేధించటం 30 నిముషాల నిడివి కల వీడియో తీసిన మహాజన్ ఈ ప్రశ్నలను లేవనెత్తారు. "నా భార్య నన్ను హింసిస్తోందని చెబితే ఎవరూ నమ్మేవారు కారు. దీంతో నా సమీపులు సాక్ష్యాధారాలు సేకరించమని హితవు చెప్పగా, నేను రహస్య కెమెరాను ఒక దానిని నా ఇంట్లో అమర్చాను. ఈ వీడియో ఆ కెమెరా తో తీయబడినదే. తర్వాత ఆమె నా పై వరకట్న వేధింపు చట్టాలను ప్రయోగించినది. ఆ సమయంలో ఈ వీడియోలను నేను పోలీసులకు చూపినా వారు ఆమె పై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు" అని మహాజన్ తెలిపాడు.

దీనిపై పసార మాధ్యమాలు ప్రతిస్పందన కోసం ఆమెను ప్రసార మధ్యమాలు సంప్రదించటానికి ప్రయత్నించగా, ఆమె ఆచూకీ తెలియలేదు. తర్వాత ఎన్నడే గానీ, ఈ ఆరోపణలు తప్పు అని ఆమె ఎవరికీ తెలుపలేదు.

పొరుగుదేశాల పురుషులనీ వదలని వేధింపు చట్టాల దుర్వినియోగం

[మార్చు]

హైదరాబాద్ కు చెందిన ఆయేషా సిద్దిఖీ, పాకిస్తాన్ కు చెందిన క్రికట్ క్రీడాకారుడు షోయెబ్ మాలిక్ పై IPC సెక్షను 498ఏను ప్రయోగించింది. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ దీనిని తీవ్రంగా ఖండించింది. ఒక వివాహాన్ని బలవంతంగా ఒక పురుషునిపై రుద్దలేమని, నిజంగా ఆయేషాతో గనుక షోయెబ్ కు వివాహమై ఉంటే సంబంధించిన ఫోటోలను ఆయేషా చూపాలని డిమాండ్ చేసినది. 498ఏ చట్టం ఎత్తివేసినంత మాత్రాన స్త్రీలకు హానికారకం కాదని, వారు వరకట్న నిరోధక చట్టం క్రింద తమ వాదనలను వినిపించవచ్చని అభిప్రాయపడినది.[15]

"Whether the claims by Ayesha Siddiqui are false or true, that is up to a family court or civil court to decide and give a judgement. So far as Shoaib Malik is concerned, section 498A against him has to be dropped immediately and his passport returned to him."[16]
"(ఆయేషా సిద్ధిఖీ చేసిన ఆరోపణలు నిజాలా, అబద్ధాలా అనేది ఫ్యామిలీ లేదా సివిల్ కోర్టు తేల్చవలసిన విషయం. షోయేబ్ మాలిక్ వరకూ, అతని పై ఉన్న 498ఏ కేసు తక్షణమే ఎత్తివేయాలి, అతని పాస్ పోర్టు అతనికి వెంటనే తిరిగి ఇచ్చివేయాలి.)"

మనీషా పొద్దార్/ప్రీతి గుప్తాల వ్యాజ్య/ప్రతివ్యాజ్యాలు

[మార్చు]

కేవలం భర్త, అతని తోబుట్టువులకు అసౌకర్యం కలిగించాలనే దురుద్దేశ్యంతోనే ఆధారాలు లేని వ్యాజ్యం వేసిన మనీషా పొద్దార్ పై ఆమె ఆడపడుచు ప్రీతి గుప్తా వేసిన ప్రతివ్యాజ్యంలో అత్యున్నత న్యాయస్థానం 13 ఆగష్టు 2010 న అందరికీ బెయిళ్ళు మంజూరు చేసినది.[17]

పురుష హక్కుల సంఘాలు ఈ చట్టాల దుర్వినియోగం ఏకరువు పెట్టటం వల్ల ప్రభుత్వం న్యాయనిపుణులను వీటిపై విచారణ నిర్వహించి వీటి సంస్కరణలకు తగు సూచనలు చేయమని కోరినది.[18]

జొమాటో వాణిజ్య ప్రకటనలలో సరైన భోజన సదుపాయాలను తగ్గింపు ధరలకే ఏర్పాటు చేయనందుకు బాయ్ ఫ్రెండ్/భర్తను గర్ల్ ఫ్రెండ్/భార్య చెంపదెబ్బ కొట్టటం పై సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ మండిపడినది. దీనిపై అడ్వర్టైజింగ్ స్టాండార్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) కి ఫిర్యాదు చేసినది. పురుషజాతిని కించపరచే ఇటువంటి ప్రకటనను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసినది. గృహ హింస కారణంగానే పురుషుల ఆత్మహత్యలు స్త్రీలకంటే రెట్టింపు సంఖ్యలోనే ఉన్నవని ప్రశ్నించింది.[19]

సినీనటుడు అమీర్ ఖాన్ తను వ్యాఖ్యాతగా వ్యవహరించే సత్యమేవ జయతే అనే టీవీ కార్యక్రమంలో పురుషులపై ద్వేషాన్ని రేపే విధంగా ప్రవర్తించటం అసమంజసమని, దీనికి ప్రతిస్పందనగా అప్పటి అమీర్ చిత్రమైన తలాష్ ను వ్యతిరేకిస్తున్నామని సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సత్యమేవ జయతేకు సరైన గణాంకాలను పంపిననూ, వాటిని ఖాతరు చేయక, అర్థసత్యాలను ప్రచారం చేస్తోన్నదని, స్త్రీ పక్షపాతిగా వ్యవహరిస్తోన్నదని అందుకే తాము అమీర్ చిత్రాన్ని చూడబోమని స్పష్టం చేశారు. ప్రముఖులకు సాంఘిక బాధ్యత ఉంటుందని, వారు ఏం మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడలని, లేనిచో ఇవి తప్పుడు సంకేతాలు పంపుతాయని హెచ్చరించారు.[20]

గృహిణులకు భర్త జీతంలో భాగమివ్వాలి అనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అప్పటి కేంద్ర స్త్రీ-శిశు సంక్షేమ మంత్రికి సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ లేఖను పంపినది.[21] ఈ ప్రతిపాదన ఏకపక్షంగా ఉన్నదని, దీనిలో ప్రధాని జోక్యం కలుగజేసుకోవాలని తెలిపినది. భర్త జీతం అంతా భార్యదే అయినపుడు, భార్యకు జీతంలో వాటా ఇవ్వటం ఏమిటని సంస్థ సభ్యులు స్వరూప్ సర్కార్ ప్రశ్నించారు.

INSAAF భార్యచే భర్తపై ఏ విధంగా గృహ హింస జరుగుతోందో వర్గీకరించింది.[22]

  • శారీరక గృహ హింస
  • భావోద్వేగ గృహహింస
  • దూషణ
  • చట్టపరమైన గృహహింస
  • ఆర్థిక గృహహింస
  • లైంగిక గృహహింస

వైవాహిక అత్యాచారం చట్టాన్ని పురుషుల హక్కుల పరిరక్షక సంఘాలు వ్యతిరేకించాయి. ఇప్పటికే వివిధ చట్టాలచే బాధితులైన భారతీయ పురుషులపై ఈ క్రొత్త చట్టం మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు ఉన్నదని, దీని అమలులో జాగ్రత్తలు గనుక వహించకుంటే పురుషులను అకారణంగా కటకటాల వెనక్కు నెట్టివేసే మరొక ఆయుధం స్త్రీల చేతికి ఇచ్చినట్లేనని, ఇది సామాజిక రుగ్మతలకు దారి తీస్తుందని దుయ్యబట్టారు.[23]

లక్నోకు చెందిన నేషనల్ కోయాలిషన్ ఆఫ్ మెన్ రెండు సరికొత్త డిమాండులతో ముందుకు వచ్చింది. అవి

  1. జాతీయ స్థాయిలో స్త్రీ హక్కుల పరిరక్షణా సంస్థ అయిన నేషనల్ కమిషన్ ఆఫ్ వుమెన్ (NCW) కు సమాంతరంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మెన్ ను నెలకొల్పాలని
  2. ఇతర రాజకీయ పార్టీలేవి పురుషుల పక్షం తీసుకోక పోయినచో, వారే ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోవాలని

స్త్రీ అనుకూల చట్టాలతో స్త్రీలకు అవసరానికి మించిన ప్రాముఖ్యత పెరిగిపోయినదని, ఇది ఇలానే కొనసాగితే రానున్న 10-15 ఏళ్ళలో స్త్రీలే సంఘాన్ని శాసిస్తారని, ఇది ఎంతమాత్రం శుభపరిణామం కాదని, అధికారమైనా, హక్కులైనా రెండు జాతుల మధ్య సమతూకం ఉండాలని లక్నోకు చెందిన స్త్రీలే అభిప్రాయపడటం గమనార్హం.[24]

శ్వేతా కిరణ్ అనే వివాహిత తన భర్త అర్నేష్ కుమార్, అతని తల్లిపై వేసిన వ్యాజ్యంలో క్రింది కోర్టు, హై కోర్టులు వారికి బెయిల్ ను నిరాకరించినవి. దీనితో అర్నేష్ కుమార్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2 జూలై 2014న సుప్రీం కోర్టు ఇరువురికీ బెయిళ్ళు మంజూరు చేసినది. ఏడు సంవత్సారాలు, లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడేంత పెద్ద నేరం చేసిన వారినే అదుపులోకి తీసుకోవాలని, వరకట్న వేధింపు చట్టాలలో అత్యధికంగా పడేది మూడేళ్ళ జైలు శిక్ష మాత్రమే అని, కావున ఇప్పటి నుండి ఈ కేసులలో సాక్ష్యాధారాలు లేకుండా (భర్తతో సహా) ఎవరినీ అదుపులోకి తీసుకొనరాదని సుప్రీం కోర్టు ఆదేశాలను జారీ చేసినది.[25]

సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ కు చెందిన అమిత్ లఖానీ

"We noticed that many of these men have suicidal tendencies. Many NRI husbands who faced similar situations are also contacting us."
("ఇటువంటి పురుషులలో ఆత్మహత్యా ధోరణులు ఉన్నట్లు గమనించాం. ఇటువంతి పరిస్థితులనే ఎదుర్కొన్న చాలా మంది ఎన్ ఆర్ ఐ భర్తలు కూడా మమ్మల్ని సంప్రదిస్తున్నారు.")

[26]

CRISP తన నివేదికలో పురుషులలో ఆత్మహత్యలు చట్టాల దుర్వినియోగం వల్లనే అని తెలిపినది. పురుషుడు ఎటువంటి గృహ హింస ఎదుర్కొన్నా, వారిని రక్షించే చట్టాలే కరువయ్యాయని తెలిపినది.[27]

ఆగస్టు

[మార్చు]

చట్ట/న్యాయ వ్యవస్థలు స్త్రీలు అసత్యాలు పలుకరనే అభిప్రాయం కలిగి ఉంటాయని, ఈ అభిప్రాయమే బాధిత పురుషులకు గొడ్డలిపెట్టు అయినదని సేవ్ ఇండియా ఫ్యామిలీ స్థాపకుడు స్వరూప్ సర్కార్ ఆగస్టు నెలలో నాగ్‌పూర్లో జరిగిన సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఇదే సమావేశంలో వాస్తవ్ ఫౌండేషన్ కార్యకర్త భారతదేశపు చట్టం స్త్రీలనే బాధితులుగా పురుషులే బాధించేవారిగా పరిగణించబడటం వల్లనే ఈ సమస్య వచ్చిపడినదని, సర్వేలలో కూడా ఈ అభిప్రాయం సమాజంలో కూడా పాతుకుపోయినట్లు తెలిపినవని, వరకట్న వేధింపు చట్టం, గృహ హింస చట్టం, మాన భంగ చట్టం ఈ దేశంలో అత్యధికంగా దుర్వినియోగం అవ్వబడే చట్టాలని తెలిపారు. CRISP కు చెందిన కుమార్ జాగీర్దార్, తండ్రికన్నా కూడా తల్లే బిడ్డకు ఉత్తమ సంరక్షకురాలిగా చట్టాలు భావిస్తున్నవని, ఒక శిశువు యొక్క స్థూలాభివృద్ధికి తల్లిదండ్రులిరువురూ అవసరమనే వాస్తవాన్ని చట్టాలు విస్మరిస్తున్నవని, ఈ దేశపు ఆదాయపు పన్నులో 82% పురుషుల నుండే వస్తోన్నా, వారి సమస్యలు మాత్రం ఎవరికీ పట్టలేదని వ్యాఖ్యానించారు.

ఈ సంస్థలన్నీ కొన్ని సమస్యలను విశదీకరించినవి

  • కుటుంబ కలహాలే కారణంగా జరుగుతున్న ఆత్మహత్యలలో స్త్రీల కన్నా పురుషులే ఎక్కువగా ఉన్నారు.
  • స్త్రీ-శిశు సంక్షేమ శాఖ 53% శాతం బాలులు అత్యాచారాలకు గురి అవుతున్నట్లు తేల్చినా ప్రతి ఒక్కళ్ళూ బాలికల/స్త్రీలపై జరిగే అత్యాచారాలనే ప్రస్తావిస్తారు గానీ, బాలుర విషయంలో మాత్రం మిన్నకుంటారు.
  • తప్పుడు నేరారోపణలతో వరకట్న, గృహహింస, లైంగిక వేధింఫు చట్టాల దుర్వినియోగం
  • విడిపోయి భరణం కడుతున్నా కూడా భర్తకు సంతానంతో గడిపే సమయం పరిమితంగా ఉండటం
  • పురుషుల సమస్యలను పట్టించుకొనే నాథుడే లేకపోవటం

చట్టాలను దుర్వినియోగం చేసే వారిని శిక్షించాలని, నిరాధార కేసులలో ఇరుక్కుని నిర్దోషులుగా బయటపడినవారికి పునరావాసం కలిపించాలని, శిశు సంక్షేమ ఆభివృద్ధిని స్త్రీ-శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ నుండి వేరు చేయాలని అభిప్రాయపడినవి.[28]

2015 దీమాపూర్ సామూహిక హత్య, రోహ్‌తక్ సోదరీమణుల వీడియో వివాదం, జస్లీన్ కౌర్ ఉదంతాలు జరిగిన తర్వాత పురుష హక్కుల సంఘాలు "అసలు భారతీయ పురుషుడికి వీధుల్లో రక్షణ ఉన్నదా?" అనే ప్రశ్నను లేవనెత్తినవి. ఇటువంటి పరిస్థితులలో పురుషులు స్త్రీలకు ఏ విధంగానూ సహాయపడదలచుకోలేరు అని తెలిపినది. మన సంఘంలో స్త్రీలకు గౌరవమివ్వటం పురుషులకు మాత్రమే నేర్పుతామని, అదే స్త్రీలకు పురుషులకు గౌరవమివ్వటం నేర్పమని ఈ ధోరణి మారాలని సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ కు చెందిన జ్యోతీ తివారీ తెలిపారు. ఇటువంటి విషయాలలో ప్రసార మాధ్యమాల పాత్రను విస్మరించలేమని, వాస్తవాలను తెలుసుకోకుండానే గోరంతలను కొండంతలుగా చూపటం, పురుషులందరినీ ఒకే గాటికి కట్టివేయటం వంటి వాటితో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నదని అదే సంస్థకు చెందిన సుజిత్ దేశ్ పాండే అభిప్రాయపడ్డారు.[29]

సెప్టెంబరు

[మార్చు]

పురుషుల హక్కులను కాపాడేందుకు స్త్రీలు సైతం కదం తొక్కటం అందరినీ విస్మయానికి గురి చేసినది. పురుషుల సమస్యల నుండి పురుషులను విముక్తులు చేస్తేగానీ, స్త్రీలు తమ సమస్యల నుండి విముక్తులు కాలేరని తెలిపారు. పురుషుల లైంగికతను సంఘం చాలా తప్పుగ అర్థం చేసుకొన్నదని, పురుష లైంగికతను ఎగతాళి చేయటం, పురుష లైంగికతకు నేరపు రంగును పులమటం మరిన్ని సమస్యలకు దారి తీస్తాయని స్పష్టం చేశారు. పురుష లైంగికత గురించి పురుషుల కంటే కూడా, పురుషుల హక్కుల కొరకు పోరాడే స్త్రీలే ఎక్కువగా అర్థం చేసుకొన్నారు.[30]

జస్లీన్ కౌర్ వీడియో వివాదం పై వార్తా ఛానెళ్ళు అన్నీ ముద్దాయి సరవ్ జీత్ సింగ్ కు శాపనార్థాలు పెడుతోండగా, లఘు చిత్ర రూపకర్త అయిన దీపికా భరద్వాజ్ అనే స్త్రీ మాత్రం రెండు వైపులా వినకుండా కేవలం ఒక స్త్రీ పురుషుడిపై చేసే లైంగిక వేధింపుల ఆధారంగానే అతను ఆమెను లైంగికంగా వేధించాడనే నిర్ధారణకు రావటం అసమంజసమని అవే వార్తా ఛానెళ్ళలో తెలిపారు. జస్లీన్ కౌర్ విషయంలో జరిగినది కేవలం ఒక వాదులాట మాత్రమేననీ, వాదులాటకూ, వేధింపుకూ తేడా ఉండేది మనం గమనించాలన్నారు. స్త్రీవాదులచే నిష్కర్షగా విమర్శింపబడుతోన్ననూ, పురుషుల హక్కుల కోసం పోరాడే ఈ స్త్రీలు మాత్రం వారెంచుకొన్న మార్గాన్ని వీడలేదు. వీరికి సన్నిహితులైన పురుషులు తప్పుడు వరకట్న వేధింపు వ్యాజ్యాలలో, తప్పుడు మానభంగ వ్యాజ్యాలలో స్త్రీల చేతే ఇరికించబడటం కళ్ళారా చూసిన వీరు, ఈ మార్గాన్ని ఎంచుకొన్నారు. ఈ చట్టాల దుర్వినియోగం పురుషులకే కాక, అత్త/ఆడపడుచు స్థానాలలో ఉన్న స్త్రీలకు కూడా శాపం కావటంతో ఈ మహిళలు ఈ చట్టాల దుర్వినియోగం ఆగాలని కోరుకొంటున్నారు.

రోహ్‌తక్ సోదరీమణుల వీడియో వివాదంలో సైతం సత్యాసత్యాల నిగ్గు తేల్చటానికి దీపికా స్వయంగా రోహ్‌తక్ బయలుదేరి అక్కడి ప్రత్యక్ష సాక్షులను విచారించి, ప్రసార మాధ్యమాలలో జరిగిన ప్రచారం వాస్తవాధారితం కాదని తెలుపటానికి తాను విచారించిన వారి వీడియోలు తీసి అంతర్జాలంలో పోస్టు చేసినది. తర్వాత ఈ సోదరీమణులకు పురుషులకు దేహశుద్ధి చేయటం పరిపాటి అని తేలినది. మెల్లగా ఈ ఉదంతాలలో నిజాలు బయటపడ్డాయి. తన స్వంత మాటలలో,

"Look, I totally get it that women suffer a lot in the country. There is a lot of sexism everywhere and women face a really raw deal. But what I want to show is that you can't correct that wrong by perpetuating another wrong. You can't have laws that are misused against men.
(చూడండి, ఈ దేశంలో ని సమస్యలతో స్త్రీలెలా సతమతమౌతారో నాకు పూర్తిగా అవగాహన ఉన్నది. సర్వత్రా లైంగికత వ్యాపించి ఉండటంతో, స్త్రీలు నిజంగానే అసౌకర్యాలకు గురౌతారు. కానీ నేను చూపించదలచుకొన్నదల్లా ఏంటంటే, ఒక తప్పును సరి చేయటానికి, మనం మరొక తప్పిదాన్ని చేయలేం. పురుషులపై చట్టాలక దుర్వినియోగానికి ఒడిగట్టలేం.)"

స్త్రీవాదులు చేసే వాదనకు భిన్నంగా, లైంగిక వేధింపుల/గృహ హింస వ్యాజ్యాలలో బాధితులుగా చెప్పుకొనే స్త్రీలు వారు తమ వ్యాజ్యాలను వెనక్కు తీసుకోకపోవటానికి కారణం స్త్రీల పై ద్వేషం కాదని, ఇవి ధనవ్యామోహంతో బనాయించబడ్డ కేసులని పురుషుల హక్కుల కోసం పోరాడే స్త్రీలు తెలుపుతారు. పురుషులే ఎక్కువ ఆత్మహత్యలకు పాల్పడుతోన్న, పురుషులపైనే ఎక్కువగా హింస జరుపబడుతోన్న ప్రస్తుత తరుణంలో దృష్టి కేంద్రీకరించవలసినది స్త్రీ/స్త్రీ లైంగికత/స్త్రీ హక్కుల పైన కాదని, పురుషులు/పురుషుల లైంగికత/పురుషుల హక్కుల పైనేనని వీరు తెలిపారు. సహాయనిధులలో సైతం ఎక్కువ భాగం స్త్రీ సంక్షేమ సంస్థలకే కేటాయించబడుతోందని తెలిపారు.

అమెరికా సంయుక్త రాష్ట్రాలు అమలు చేయబోయే మహిళలపై హింసకు అంతర్జాతీయ చట్టం (The International Violence Against Women Act) ను నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా పురుషులను కూడగట్టుకొని వాషింగ్టన్, డి.సి. లోని ఆ దేశపు కాంగ్రెస్ తో చర్చించటానికి ఉమా కిరణం బయలుదేరినది. ఈ చట్టం ప్రకారం బాధితులు రక్షించబడి, నేరస్థులు శిక్షించబడతారు. పాశ్చాత్య విలువలను భారతదేశం పైన రుద్దవద్దని, పురుషబాధితులను కూడా గుర్తించాలని ఉమా అభిప్రాయపడ్డారు. లైంగికత పై సాంఘిక అవగాహన కుంటుపడి ఉన్నదని, పురుష లైంగికత సంకుచితంగా అర్థం చేసుకొనబడి ఉన్నదని, పురుష లైంగికతను నిత్యం ఎగతాళి చేయబడటం, దానికి నేరపు రంగును పులమాలని చూడటం వంటి వలన సమస్యను మరింత జటిలం చేస్తున్నాయన్నారు. వారి మాటలలో,

"We need to be sensitive towards men and their needs as well.
(పురుషులను, వారి అవసరాలను కూడా మనం గుర్తించవలసిన ఆవశ్యకత ఉన్నది.)"

"Sexual arousal is easily discernible in men, whereas it is not obvious in women. As a result, men constantly face allegations of being obsessed with sex.
(పురుషులలో లైంగిక ప్రేరేపణ స్పష్టంగా గోచరిస్తుంది, కానీ అదే ప్రేరేపణ స్త్రీలలో అంత స్పష్టంగా కనబడదు. ఫలితంగా, పురుషుల ధ్యాస ఎల్లప్పుడూ శృంగారం చుట్టూనే కేంద్రీకృతం అయి ఉంటుందనే అపప్రదను వారు నిత్యం ఎదుర్కొనవలసి వస్తోన్నది.)"

"It is also believed that men always indulge in sex voluntarily, whereas women are thought to take part in sex either to fulfil the sexual or emotional needs of men or because they are forced to do so by men against their will.
(శృంగారంలో ఐచ్చికంగా పాల్గొనేది ఎప్పుడూ పురుషులేనని, స్త్రీలు కేవలం పురుషుల లైంగిక/భోవోద్వేగ అవసరాలను తీర్చటానికి లేదా కేవలం వారి ఇష్టానికి వ్యతిరేకంగా పురుషులచే బలవంతం చేయబడతారనే తప్పుడు అభిప్రాయం కూడా కలదు.)"

"Today, male sexuality is ridiculed, insulted, misunderstood, undermined, disregarded, criminalised and everything but respected.
(ఈ రోజున పురుష లైంగికత గేలి చేయబడుతోన్నది, అవమానింపబడుతోన్నది, అపార్థం చేసుకొనబడుతోన్నది, అణగద్రొక్కబడుతోన్నది, నిరాకరించబడుతోన్నది, నేరపూరితం చేయబడుతోన్నది; గౌరవించటం తప్పితే మిగతావన్నీ చేయబడుతోన్నది.)"

"NGOs for women are richly funded. But these NGOs represent just a minuscule section of women, mostly wives. What about mothers and sisters? "
"స్త్రీ హక్కులను సంరక్షించే సంస్థలకు సహాయ నిధులు పుష్కలంగా ఉన్నాయి. కానీ సంస్థలు కేవలం భార్య స్థానంలో ఉన్న స్త్రీలకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తాయి. మరి తల్లుల, తోబుట్టువుల స్థానంలో ఉన్న మహిళల పరిస్థితి ఏంటి?)"

సేవ్ ఇండియా ఫ్యామిలీ, ఢిల్లీకి చెందిన బర్ఖా త్రెహాన్ పార్లమెంటు సభ్యులను, రాజకీయవేత్తలను కలసి పురుషుల హక్కుల గురించి చర్చిస్తూ ఉంటారు. సమస్యలు అందరికీ ఉంటాయని, అందరూ లాభపడేలా వీటి పరిష్కారం ఉండాలని అభిప్రాయపడే ఆమె మాటలలో

"Right now, the entire discourse is about women and the issues they suffer from. But unless you also bring men into the fold, see to their needs as well, how will you address the issues of women?"
"(ప్రస్తుతం ఉపన్యాసాలన్నీ స్త్రీలు/వారి సమస్యల గురించే సాగుతోన్నాయి. కానీ పురుషుల సమస్యలను కూడా పరిగణించకపోతే, వారి అవసరాలను చూడకపోతే, స్త్రీల సమస్యలను ఎలా పరిష్కరించగలరు?)"

అక్టోబరు

[మార్చు]

ఢిల్లీ కౌన్సిల్ ఆఫ్ వుమెన్ (DCW) కు చాలా మంది పురుషుల నుండి తమ భార్య తమను మానసిక, శారీరక, ఆర్థిక, లైంగిక, ఆస్తి, విడాకు వేధింపులు పెడుతోందని ఇబ్బడి ముబ్బడిగా ఫిర్యాదులు చేశారు. వాస్తవానికి ఈ సంస్థ కేవలం స్త్రీల హక్కులను కాపాడటానికి స్థాపించబడిననూ, ఫిర్యాదులు సంఖ్య ఎక్కువగానే ఉండటంతో, ఈ ఫిర్యాదులు వాస్తవదూరం కాకపోవటంతో చేసేది లేక పురుషుల హక్కులపై కూడా ఈ సంస్థ దృష్టి సారించవలసి వచ్చింది. సౌమ్యమైన విషయం అయితే దంపతులను వారి తల్లిదండ్రులతో చర్చించి, కౌన్సిలింగ్ నిర్వహించి ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ (DLSA) మధ్యవర్తిత్వానికి పంపినది. కేసు కఠినమైనది అయితే స్థానిక పోలీస్ స్టేషనులో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయించింది.[31]

కాన్ఫిడేర్ సంస్థ ప్రతినిధి జ్యోతీ తివారీ, ఒకానొక ఇంటర్వ్యూలో ఇలా తెలిపారు.[32]

  • ఈ సంఘం పితృప్రాముఖ్యం ఉన్నది కాదు, మాతృప్రాముఖ్యం ఉన్నదే
  • నా వరకు నేను ఏ పురుషునిచే బాధింపబడలేదు, ఇంకా చెప్పాలంటే స్త్రీల చేతే బాగా ఎక్కువగా బాధింపబడ్డాను
  • నా సోదరుని పై/మా పై అతని భార్య వేసిన తప్పుడు కేసులను భరించలేక తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదే నన్ను పురుషపక్షపాతిగా మార్చినది
  • పురుషుల హక్కులని పురుషుల కంటే కూడా స్త్రీలే బాగా అర్థం చేసుకొనగలుగుతారు. కొందరు అతివాద స్త్రీవాదులు అర్థం చేసుకొన్నా, నాకు మద్దతు తెలుపటానికి వెనుకాడతారు. అయినా నేను వెళ్తున్నది సరియైన మార్గం అని నాకు తెలుసు. మిగతా వారెమనుకొన్నా, నాకు సరియైనది అనిపించినదే నేను చేస్తాను
  • నేను సంప్రదించే రాజకీయ నాయకులు కూడా దీనిని సరైన స్పృహలో తీసుకొంటారు. పురుషులకు జరిగే అన్యాయాలు వారికి కూడా తెలుసునని చెబుతారు. కానీ తాము అధిష్టానం చెప్పుచేతలలో ఉండవలసిన అవసరం ఉన్నదని, కావున తాము ఈ విషయంలో ఎక్కువ చొరవ తీసుకొనలేమని, తెలుపుతారు. సమస్యంతా ఇక్కడే.
  • పురుషులు తరచూ బాధలకు, దోపిడీకి గురౌతుంటారు. వారి విధినిర్వహణ గురించి ఆరా తీసేవారే గానీ, వారి బాధలను, వేదనను ఆలకించేవారే లేరు. ఇంత కఠినమైన సంఘంలో పురుషుల హక్కులను పొందటమంటే కొండను ఢీ కొట్టటమే. ఈ సంఘంలో పురుషులకు న్యాయమనేదే లేదు. వారి క్షోభను కాస్త తగ్గించినా, ఎంతోకొంత సాధించామనే మేము భావిస్తాము
  • వేధించబడిన పురుషులకు మేము స్వాంతను, మనోనిబ్బరాన్ని అందిస్తాము. సిగ్గుపడకుండా గళం ఎత్తమని కోరతాము. కష్టమైనా సరే పోరాడమని ప్రేరణనని అందిస్తాము. వారికై వారు నిలదొక్కుకునేలా చేస్తాము
  • పురుషుల హక్కుల ఉద్యమం యొక్క ప్రాథమిక లక్ష్యం, పురుషులను రక్షక, పాలక పాత్రల నుండు విముక్తుణ్ణి చేయటం. స్వతంత్రమైన ఐచ్చిక జీవితం వారు గడిపేలా చూడటం.

కారణాలు

[మార్చు]

పురుషులపై హింస

[మార్చు]

పురుషులపై హింసకు వివిధ కారణాలు ఉండవచ్చును. పురుషులపై హింస అనగా పురుషుడి పై (స్త్రీలు/పురుషులు/ఇతరులు) జరిపే హింసాత్మక ఆగడాలు. ఇవి కేవలం శారీరకమో, కేవలం మానసికమో, లేదా రెండు విధాలుగానో అయ్యి ఉండవచ్చును. పురుషుడు హింసించేవాడే గానీ, హింసకు లోనవడనే అభిప్రాయం ప్రతి సంఘంలోనూ సర్వసాధారణంగా ఉంది. పురుషులపై లైంగిక దాడులు ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క విధంగా పరిగణించబడుతున్ననూ, ఈ సమస్యను అంతర్జాతీయ న్యాయవిధానం సైతం గుర్తించటం లేదు. అంతర్జాతీయంగా పురుషులపై ఉన్న దురభిప్రాయం ఒకవైపు అయితే, దేశ-కాలమాన పరిస్థితుల ప్రకారం, భారతదేశంలో ఈ హింస పైకి కనబడకుండా చాప క్రింద నీరు అన్న చందాన నిగూఢమై ఉంది. 1970వ సంవత్సరంలో తెలుగునాట తల్లా? పెళ్ళామా? అనే పేరుతో చిత్రం విడుదల అయినది అంటే, ఈ ఇరువురి స్త్రీ పాత్రల నడుమ ప్రతి పురుషుడూ ఎలా నలిగిపోతాడన్న విషయం ప్రస్ఫుటంగా తెలిసిపోతుంది. వీరి విషయంలో ఏ మాత్రం సమతూకం తప్పినా పురుషుడే నిందలపాలు అవుతాడు. జీవితాంతం కష్టసుఖాలలో పాలుపంచుకొనే భార్యకు వైపు మొగ్గుచూపితే భార్యాలోలుడని, ఎన్నో కష్టాలు పడి తనని పెద్ద చేసిన తల్లి వైపు మొగ్గు చూపితే అమ్మకూచి అని ముద్ర వేయటానికి ఈ సంఘం కాచుకు కూర్చొని ఉంటుంది.

భర్త పట్ల క్రౌర్యం

[మార్చు]

భర్త పట్ల క్రౌర్యం ప్రధానంగా రెండు కారణాల వలన జరుగుతుంది.

  1. ఇష్టం లేని వివాహాన్ని బలవంతంగా తల్లిదండ్రులు తమ కుమార్తెకు చేయటం/చేయాలనే ప్రయత్నం చేయటం. ఉదా: నిషా శర్మ వరకట్న వేధింపు వ్యాజ్యం. ఇక్కడ గమనించవలసిన విషయం, సయోధ్య లేనిది తల్లిదండ్రుల-కుమార్తె మధ్యన. కానీ దీనివలన వీరికెవరికీ ఎటువంటి నష్టం లేదు. (తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్ళి చేస్తున్నారని కుమార్తె గానీ, తము చూపించిన సంబంధం తమ కుమార్తె చేసుకోవటం లేదని తల్లిదండ్రులు గానీ పోలీసులను ఆశ్రయించరు. ఒక అమాయక యువకుడి జీవితాన్ని నాశనం చేయటానికి అందరూ కలసి ముందడుగు వేస్తారు. అలాగే తర్వాత ఈ వివాహం తప్పించటానికి అన్నెం పున్నెం ఎరుగని వరుడిపై (కట్నం కోరాడనో, అసభ్యంగా ప్రవర్తించాడనో, వైవాహిక బలాత్కారం చేస్తున్నాడనో, వరకట్న వేధింపులకు పాల్పడుతోన్నాడనో, సంతానం కలగట్లేదు అని దెప్పిపొడుస్తున్నాడనో, హత్యా ప్రయత్నం చేశాడనో, లేదా నేరుగా హత్యే చేశాడనో) పోలీసులకు ఫిర్యాదు చేసే సమయంలో తల్లిదండ్రుల-కుమార్తెలు ఒకరికొకరు బహుచక్కగా సహకరించుకొంటారు.
  2. తమ మాట పెడచెవిన పెట్టి కుమార్తె వారికి ఇష్టం లేని యువకుడిని వివాహమాడితే ప్రతీకారేచ్ఛతో రగిలిపోయే తల్లిదండ్రులు. ఉదా: సుహైబ్ ఇల్యాసీ.

ఇవే కాక ఇతర చిన్న విషయాలు కూడా భార్య భర్తతో క్రూరంగా వ్యవహరించే కొన్ని సందర్భాలు

  1. భర్త తమ తాహతుకు తగ్గట్లు సరియైన ఉద్యోగం చేయలేకపోతున్నందుకు. విలాసవంతమైన జీవితాన్ని ఇవ్వలేకపోతున్నందుకు
  2. భర్త తన తల్లిదండ్రుల బాగోగులు చూస్కుంటున్నందుకు
  3. మానసిక రుగ్మతలు గల తమ కుమార్తెను ఎలాగోలా, ఎవరికో ఒకరికి కట్టబెట్టేసి తమ బాధ్యతను తీర్చేసుకోవాలనుకొనే తల్లిదండ్రుల వలన
  4. తమ దురలవాట్ల, వివాహేతర సంబంధాల గురించి భర్తకు తెలిసిపోయినదని తెలుసుకొన్న భార్య, అవి తాను బయటపెట్టకుండా ఉండాలని ఆశించే భార్య వలన

ఒక వైపు భర్తను భార్యే నానా విధాలుగా హింసించటం, మరో వైపు స్త్రీ సంక్షేమ సంస్థలలో తమ భర్త తమని హింసిస్తున్నాడని ఫిర్యాదు చేయటం లేదా స్త్రీ సంక్షేమ చట్టాలను దుర్వినియోగం చేయటం వంటి ఆకృత్యాలతో భారతదేశంలో పురుషులు అడకత్తెరలో పోకచెక్క వలె నలిగిపోతున్నారు. ఇది ఇలా ఉంటే ఇటువంటి భార్య నుండి విడాకులు కోరుకొన్నా తప్పే. భర్త విడాకులకు దరఖాస్తు చేసుకొన్నచో ఆత్మహత్యకు పాల్పడతామని లేదంటే వరకట్న వేధింపు చట్టాలను వారి పై ప్రయోగిస్తామని "అబల" నారులు బెదిరించటం పరిపాటి అయిపోయింది. తమని భరించే బలిపశువు ఒకడు ఉండాలి, సంఘంలో తన "వివాహిత" స్థానానికి ఏ మాత్రం స్థానభ్రంశం కలుగకూడదు. పైగా, భర్త అనే వాడు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదిస్తే, అది తన కుటుంబానికి కాకుండా, భార్య యొక్క తల్లిదండ్రులకు వెచ్చించాలి. తన నుండి భర్త విడిపోకూడదు, తాను హింసించటానికి ఒక ఆటవస్తువు తన వద్దనే ఉండాలి అనే భావనలో ఉండే స్త్రీలు వలన ఈ క్రౌర్యం నానాటికీ పెరిగిపోతున్నది.[33]

సభ్య సమాజ వైఖరి

[మార్చు]

సమాజంలో ఉండే అపోహలు

[మార్చు]

నల్లనివన్నీ నీళ్ళు కావు, తెల్లనివన్నీ పాలు కావు అన్నది గుర్తించాలని, స్త్రీలందరూ సౌశీల్యురాళ్ళే కారనీ, పురుషులందరూ క్రూరులే కారనీ, మంచి చెడులు అంతటా ఉన్నాయనేది గ్రహించాలని, సంగ్యబాల్యను స్థాపించిన అరుణ్ మూర్తి తెలిపారు.[34] మన సమాజంలో సర్వసాధారణమైన అపోహలు-

  • పురుషులు బలవంతులు
  • హింసకు పాల్పడేది ఎప్పుడూ పురుషులే
  • పురుషుడికి ఏ బాధా, బాదరబందీలు ఉండవలసిన అవసరం లేదు.
  • పురుషుడికి సహనం ఉండదు
  • పురుషుడి స్వేచ్ఛకు హద్దులు లేవు. (కాబట్టి పురుషులందరికీ విచ్ఛలవిడితనం ఉంటుంది.)
  • పురుషులు ఎప్పుడూ శృంగారానికి అర్రులు చాస్తూ ఉంటారు. (కాబట్టి వారిపై లైంగికంగా దాడి చేసినా, దాని వలన వారికి శారీరకంగా/మానసికంగా ఎటువంటి నష్టం లేదు)
  • పురుషులు తమ పై దాడి జరిగినట్లు బయటికి చెప్పుకొంటే, వారిని బలహీనులుగా సంఘం పరిగణిస్తుంది.
  • స్త్రీ కన్నీళ్ళకు పురుషుడే కారణం
  • స్త్రీ అబల
  • హింసను అనుభవించేది ఎప్పుడూ స్త్రీలే [35]
  • స్త్రీ సహనశీలి
  • సంఘం కోసం స్త్రీ తన భావోద్వేగాలను అదుపు చేసుకొంటుంది. కావున ఆమె వైపు నుండే ఆలోచించాలి

క్రౌర్యాన్ని అనుభవించే పురుషుడి వేదనను, సభ్య సమాజం ఎప్పుడూ తేలికగానే పరిగణిస్తోంది. భర్త పడే వేదనను కూడా హాస్యాస్పదంగానే పరిగణిస్తోంది. ఒక పురుషుడు/భర్త హింసకు గురైనట్లు ఇరుగు పొరుగు వారిని తెలిసినా వారి నుండి అతనికి ఎటువంటి సహాయసహకారాలు అతనికి అందని దుస్థితి నెలకొని ఉంది.

మారుతున్న ధోరణులు

[మార్చు]

మన సంఘం ఆలస్యంగానైనా నిద్ర మేల్కొంటోందని, హింసకు పాల్పడే పురుషులు అయ్యే ఆస్కారం ఎంత ఉందో, స్త్రీ అయ్యే ఆస్కారం కూడా అంతే ఉన్నదని మన ప్రజానీకానికి మెల్లగా అర్థం అవుతోందని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.

ప్రసార మాధ్యమాల వైఖరి

[మార్చు]

పురుషులపై హింస ప్రసార మాధ్యమాల దృష్టికి బహు అరుదుగా వస్తుందని, అడపా దడపా ఇలాంటి సంఘటనలు బయటికి పొక్కినా, స్త్రీలపై హింస ఎంత తీవ్రమైనదిగా పరిగణిస్తారో, పురుషులపై హింసను అంత తీవ్రంగా పరిగణించబదని స్వయానా ద టెలిగ్రాఫ్ అనే పత్రిక ఒప్పుకొన్నది.[36] ఒకవేళ పురుషులపై హింసకు పాల్పడేది స్త్రీయే ఐనా, ఆ స్త్రీకి సంఘంలో చాలా పేరు ప్రతిష్ఠలు ఉంటే తప్పితే అది ఒక సంచలనం కాదు కాబట్టి, ప్రసార మాధ్యమాలు వీటిపై చర్చించటానికి పెద్దగా ఆసక్తి చూపవు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. చట్టాలను దుర్వినియోగం చేసేవారు శిక్షించబడేలా ఉద్యమించటం కూడా మా సంస్థ లక్ష్యాలలో ఒకటి (రెడిఫ్ న్యూస్ - 26 డిసెంబరు 2003)
  2. "భారతీయ పురుషుల హక్కుల ఉద్యమానికి అంతర్జాతీయ హోద (మేరీన్యూస్ - 27 అక్టోబర్ 2015)". Archived from the original on 2015-10-04. Retrieved 2015-10-27.
  3. 498 ఏ కు సమాంతరంగా 498 బీ చట్టం తేవాలని ప్రతిపాదించిన పూణే కు చెందిన పురుష హక్క సౌరక్షణ్ సమితి (డి ఎన్ ఏ - 20 నవంబార్ 2012)
  4. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ వెబ్ సైటు
  5. సంస్థ స్థాపన యొక్క నేపథ్యాన్ని తెలిపిన రాం ప్రకాష్ చుగ్ (ఇండియన్ ఎక్స్ప్రెస్ - 11 నవంబరు 2005)
  6. చట్టపరమైన తీవ్రవాదాన్ని రూపుమాపటానికి ఎంతమంది సంఘసంస్కర్తలు పుట్టాలో అని వ్యాఖ్యానించిన సేవ్ ఇండియా ఫ్యామిలీ (టెలిగ్రాఫ్ ఇండియా - 27 అక్టోబరు 2006)
  7. చట్టపరమైన తీవ్రవాదానికి వ్యతిరేకంగా సేవ్ ఇండియా ఫ్యామిలీ ప్రదర్శన (ఔట్లుక్ ఇండియా 7 డిసెంబరు 2007)
  8. నవంబరు 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవం (ద హిందూ - 17 నవంబరు 2007)
  9. లింగ వివక్షకు సమాధానం చట్టాలు కాదన్న పురుష హక్కులు సంఘాలు (ద గార్డియన్ - 13 డిసెంబరు 2007)
  10. 498ఏ చట్టం లో బలైన స్త్రీలను స్త్రీ-సంక్షేమ మంత్రి కాపాడలేకపోయారని విమర్శించిన సేవ్ ఇండియా ఫ్యామిలీ ప్రతినిధులు
  11. పురుషులకు హానికారకంగా ఉన్న చట్టాలను సవరించాలన్న అభిప్రాయాన్ని ఆమోదించిన కేంద్రం (ద టెలిగ్రాఫ్ - 7 జూలై 2008)
  12. పురుషద్వేషాన్ని పెంపొందించే వ్యాపార ప్రకటనలను ఖండించిన భారతదేశ పురుష హక్కుల సంఘాలు (డి ఎన్ ఏ - 16 సెప్టెంబర్ 2008)
  13. సుదీర్ఘమైన విచారణలతో స్త్రీ జాతికి ఉపయోగం లేదు (ద హిందూ - 5 సెప్టెంబరు 2009)
  14. నన్ను నా భార్య నుండి రక్షించండి! (ముంబై మిర్రర్ - 6 జనవరి 2010)
  15. వివాహం జరిగినట్లయితే ఆయేషా ఫోటోలను చూపాలన్న సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ (ఇండియన్ ఎక్స్ప్రెస్ - 06 ఏప్రిల్ 2010)
  16. షోయెబ్ మాలిక్ పై 498ఏ ఎత్తివేయాలన్న సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ (ఔట్ లుక్ ఇండియా - 05 ఏప్రిల్ 2010)
  17. Preeti Gupta & Anr vs State Of Jharkhand & Anr on 13 August, 2010
  18. ప్రభుత్వానికి చట్టం యొక్క దుర్వినియోగం గురించి విన్నవించుకొన్న పురుషుల హక్కుల సంఘాలు (ఇండిపెండెంట్ కో యుకే - 2 మార్చి 2011)
  19. జొమాటో ప్రకటనపై మండిపడ్డ సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్
  20. సత్యమేవ జయతే లో అమీర్ ఖాన్ ప్రవర్తనను తప్పుబట్టిన సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ (టైమ్స్ ఆఫ్ ఇండియా - 2 డిసెంబరు 2012)
  21. గృహిణులకు భర్త జీతంలో భాగమివ్వాలి అనే ప్రతిపాదనను వ్యతిరేకించిన సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ (రెడిఫ్ న్యూస్ - 10 సెప్టెంబరు 2012)
  22. భర్తపై గృహహింసను వర్గీకరించిన INSAAF (రెడిఫ్ న్యూస్ - 12 అక్టోబరు 2012)
  23. వైవాహిక అత్యాచార చట్టాన్ని వ్యతిరేకించిన పురుషుల హక్కుల సంఘాలు (ఫస్ట్ పోస్ట్ - 6 ఫిబ్రవరి 2013)
  24. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మెన్ ఏర్పాటు చేయాలి (టైమ్స్ ఆఫ్ ఇండియా - 10 ఆగష్టు 2014)
  25. Arnesh Kumar vs State Of Bihar & Anr on 2 July, 2014 Bench: Chandramauli Kr. Prasad, Pinaki Chandra Ghose
  26. ఈ చట్టాలు పురుషులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయని తెలిపిన సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ (డెయిలీ మెయిల్ - 6 జూలై 2014)
  27. చట్టాల దుర్వినియోగం వలనే పురుషుల ఆత్మహత్యలు (ఎన్ డీ టీ వీ - 03 జూలై 2014)
  28. 2015 లో జరిగిన పురుషహక్కుల సంరక్షక సంస్థల సమావేశం (టైమ్స్ ఆఫ్ ఇండియా - 17 ఆగస్టు 2015)
  29. నేటి భారతంలో పురుషునికి రక్షణ కరువైనది (టైమ్స్ ఆఫ్ ఇండియా - 31 ఆగష్టు 2015)
  30. పురుషుల హక్కుల కోసం కదం తొక్కిన స్రీ జాతి హఫింగ్ పోస్ట్ - 26 సెప్టెంబరు 2019)
  31. "ఢిల్లీ కౌన్సిల్ ఆఫ్ వుమెన్ ను ఆశ్రయించిన భార్యాబాధితులు (యాహూ న్యూస్ - 26 అక్టోబరు 2015)". Archived from the original on 2016-03-05. Retrieved 2015-10-27.
  32. "పురుషవాది అయిన స్త్రీ (మేరీ న్యూస్ - 28 అక్టోబరు 2015)". Archived from the original on 2015-09-20. Retrieved 2015-10-28.
  33. పంజరంలో బంధించబడ్డ చిలకలుగా భారతదేశంలో భర్తలు (గల్ఫ్ ఇండియా న్యూస్ - 16 నవంబరు 2006)
  34. మంచి చెడులు అంతటా ఉన్నాయనేది గ్రహించాలి (డెక్కన్ హెరాల్డ్ - 15 మే 2009)
  35. బాధితులెప్పుడూ స్త్రీలే, చట్టాలను వీరు దుర్వినియోగం చేయలేరు అనుకోవటం పొరబాటు (టైమ్స్ ఆఫ్ ఇండియా - 17 ఆగష్టు 2010)
  36. స్త్రీలపై హింసను ఎంత తీవ్రంగా పరిగణిస్తాయో, ప్రసార మాధ్యమాలు పురుషులపై హింసను అంత తీవ్రంగా పరిగణించవు (ద టెలిగ్రాఫ్ - 13 డిసెంబరు 2005)