ప్రకటన

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కోకా-కోలా 1890 లోని ఒక వ్యాపార ప్రకటన.

ప్రకటన : అనగా ఒక సంస్థ లేదా ప్రభుత్వము, అధికారికంగా ప్రజలవద్దకు చేర్చే సమాచారం. ఏ సంస్థ అయినా ప్రజలకు తెలియజేయవలసిన విషయాన్ని కొన్ని మాధ్యమాల ద్వారా ప్రజలవద్దకు తీసుకుపోయే ప్రక్రియ ప్రకటనా ప్రక్రియ. ప్రకటన ముఖ్య ఉద్దేశ్యం, విషయ పరిజ్ఞానాన్ని ప్రజలకు తెలియజెప్పడం. పూర్వపుకాలంలో ప్రభుత్వపరమైన, లేదా అధికారిక పరమైన విషయాలను, ప్రజలకు తెలియజేసేందుకు "దండోరా" వేయించేవారు. ఇదొక ప్రకటనా మాధ్యమం. ప్రకటనని ఆంగ్లంలో Advertisement/Notification అని అంటారు. మనం తరచూ వార్తాపత్రికల్లోనూ లేక టీవిలోను ఈ ప్రకటనలను చూస్తూవుంటాము.

ప్రకటనలలో రకాలు[మార్చు]

ప్రకటనలను మూడు రకాలుగా విభజించ వచ్చును. 1) వ్యాపార ప్రకటనలు 2) ప్రభుత్వ ప్రకటనలు మరియు 3) ఇతర ప్రకటనలు

వ్యాపార ప్రకటనలు[మార్చు]

వీటి యొక్క ముఖ్య ఉద్దేశం వినియోగదారులను ఆకట్టుకోవడం. వ్యాపార ప్రకటనలను ప్రసారం చేయుటకు మీడియా ఎంతో సహకరిస్తుంది. ఉదాహరణ: సబ్బులు, చాక్లెట్లు ప్రకటనల వంటివి.

ప్రభుత్వ ప్రకటనలు[మార్చు]

ప్రజలకు కావలసిన సమాచారమును అందించుటకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఉదాహరణ:పల్స్ పోలియో ప్రకటన.


ఇతర ప్రకటనలు[మార్చు]

ఇటు వ్యాపార వర్గం నుండి గాని, అటు ప్రభుత్వం నుండి కాని కాకుండా స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ప్రచురించే ప్రకటనలను ఈ వర్గం కిందకు చేర్చవచ్చు. ఎవరైనా పెద్ద మనిషి విదేశయానానికి వెళ్తున్నప్పుడుగాని, తిరిగి వస్తున్నాప్పుడుగాని, లేదా షష్టిపూర్తి, జన్మ దినం వేడుకలకు గాని వ్యక్తిగత ప్రకటనలు వెలువడటం మనం చూస్తుంటాము. అలాగే స్వచ్ఛంద సంస్థలు, రక్త దానం గురించి, కన్ను దానం గురించి, కంటి బాంకు గురించి, సమాజంలోని సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగాను ప్రకటనలు ఇస్తూ ఉంటాయి.

వ్యక్తిగత ప్రకటనలు

స్వచ్ఛంద సంస్థల ప్రకటనలు

న్యాయస్థానాల ప్రకటనలు న్యాయ స్థానాలు ప్రభుత్వంలో విభాగాలైనప్పటికికీ, వీరు ఇచ్చే ప్రకటనలు ప్రభుత్వ ప్రకటనల కిందికి రావు. వివాదంలో ఉన్న ఆస్తుల గురించి, ఆస్తుల అమ్మకం, వేలం గురించి, తెరిగొచ్చిన కోర్టు సమన్ల గురించిన ప్రకటనలు, న్యాయస్థానాలు వార్తా పత్రికలలో ప్రకటిస్తాయి.

బ్యాంకుల ప్రకటనలు న్యాయ స్థానాల లాగానే, బాంకులు కూడా కొన్ని ప్రకటనలు ఇస్తూ ఉంటాయి. తమకు తనఖా పెట్టబడి, ఋణం తీర్చని కారణాన, తాము స్వాధీన పరుచుకున్న ఆస్తుల గురించి, కనపడకుండా పోయిన ఋణగ్రస్తుల గురించి, న్యాయస్తానంలో వ్యాజ్యం వెయ్యబొయ్యే ముందు, ఇంకా అనేక ఇటువంటి సందర్భాలలో ప్రకటనలు ఇస్తూ ఉంటాయి. బాంకులు తమ ఋణ లావాదేవీలు, వాటిలో వచ్చే వివాదాలు/వ్యాజ్యాల గురించిన ప్రకటనలు ఇతర ప్రకటనలకింద వస్తాయి. మరి అదే బాంకులు, వారి డిపాజిట్ పథకాలు, వారి ఋణ పథకాలగురించి ప్రకటనలు ఇస్తే అవి వ్యాపార ప్రకటనలు అవుతాయి.

== ప్రకటనల వల్ల లాభాలు ప్రకటన వల్ల ఛల

ప్రకటనల వల్ల దుష్ఫలితాలు[మార్చు]

ప్రకటనా కాలుష్యం[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

'ప్రకటన' పేరుగల కొన్ని విషయాలు :

  • బైబిల్ లోని చివరి గ్రంధం పేరు ప్రకటన. అంత్యదినాల్లో ఏమేమి జరుగుతాయో దైవదూతలు మానవాళికి చేసిన ప్రకటనలు ఈ గ్రంధంలో ఉన్నాయి.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రకటన&oldid=1534868" నుండి వెలికితీశారు