Jump to content

సంస్థాగత నిర్మాణం

వికీపీడియా నుండి
సంస్థాగత నిర్మాణం లో ఒక భాగం

సంస్థాగత నిర్మాణం (ఆంగ్లం: Organizational Structure) సంస్థాగత లక్ష్యాలను సాధించటానికి పనుల కేటాయింపు, సమన్వయం, పర్యవేక్షణ వంటి కార్యకలాపాలు ఏ విధంగా నిర్దేశించబడతాయో సూచిస్తుంది. సంస్థను, సంస్థాగత వాతావరణాన్ని ఉద్యోగులు ఏ కోణంలో చూస్తారో కూడా సంస్థాగత నిర్మాణమే చెబుతుంది.

సంస్థాగత లక్ష్యాలను బట్టి సంస్థాగత నిర్మాణాన్ని రకరకాలుగా నిర్మించవచ్చును. సంస్థ ఎలా పని చేస్తుందన్నది, సంస్థ యొక్క నిర్మాణమే తెలుపుతుంది. ఒక సంస్థలోని వివిధ అంశాలైన ఒక శాఖకు, ఒక విభాగానికి, ఒక సమూహానికి, ఒక ఉద్యోగికి; విధులను, ధర్మాలను, ప్రక్రియలను కేటాయిస్తుంది.

సంస్థాగత నిర్మాణం, సంస్థాగత క్రియలపై రెండు విధాలుగా ప్రభావం చూపుతుంది. అవి

  • కార్యకలాపాల ప్రామాణిక విధానాలకు, రోజువారీ విధులకు పునాదులు వేయటం
  • ఏ నిర్ణయాత్మక పద్ద్థతులలో ఏ ఉద్యోగికి ఎంత ప్రమేయం ఉన్నదో, ఈ ప్రమేయం సంస్థాగత కార్యకలాపాలు ఏ రూపం దాల్చేలా చేస్తుందో నిర్దేశిస్తుంది

చరిత్ర

[మార్చు]

పురాతన కాలంలో వేటగాళ్ళ, బోయల నుండి రాచరిక, పారిశ్రామిక నిర్మాణాల వరకూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంస్థాగత నిర్మాణం నిగూఢమై ఉన్నది.

లారెన్స్ బి మోర్ సూచించినట్లు, టేయ్లర్, ఫయోల్, వెబర్ ల ప్రకారం-

"సమర్థత దృష్ట్యా, ప్రాభావ దృష్ట్యా నిర్మాణం నిర్వివాదాస్పదంగా ప్రాముఖ్యతను సంతరించుకొన్నది. ఏ రకమైన నిర్మాణం కావాలన్ననూ, ఉద్యోగులు దానిని నిర్మించగలరు. సంస్థాగత నిర్మాణం ఒక ఎంపికగా మాత్రమే పరిగణించబడేది. 1930లో ప్రతిపాదించిన మానవ సంబంధాల సిద్ధాంతం ప్రకారం సంస్థాగత నిర్మాణం మనవ సృష్టేనని ఏకీభవించబడినది. అంతేగాక, సంస్థాగత నిర్మాణం ఎల్లప్పుడూ అవసారలు, జ్ఞానము, ఉద్యోగుల అభిప్రాయాలకు అధిక ప్రాముఖ్యతను ఇస్తూ, వీలైనపుడు తదనుగుణంగా నిర్మాణాన్ని మారుస్తూ ఉండాలనే అభిప్రాయం ఉండేది."

అయితే 1960 లో సంస్థాగత నిర్మాణం మానవ సృష్టి కంటే కూడా ఒక బహిర్గత ప్రక్రియనే అనే, ఒక పర్యవసానమేననే క్రొత్త దృక్పథం పుట్టుకు వచ్చినది.

21వ శతాబ్దపు నిర్వాహక పరిశోధకులు మరల, సంస్థాగత నిర్మాణం వ్యూహాలను వ్యక్తపరచటం పై, నిర్వాహక వర్గపు ప్రవర్తనపై, ఉద్యోగుల అధికార పంపిణీ పరిధులపై ఆధారపడి ఉన్నదని, వీటి వాతావరణము, పర్యవసానాలచే ప్రభావితం అయ్యి ఉన్నదనీ ప్రతిపాదిస్తున్నారు.

మూలాలు

[మార్చు]