Jump to content

చర్చ:ప్రకటన

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

వ్యాసానికి ప్రకటనలు వర్గం మూస తగిలించారు. ఆ వర్గం ఇంకా మొదలుపెట్టలేదు. "ప్రకటనలు" అని ఒక వర్గం అవసరమా?? ఈ వర్గం కింద ఎన్ని వ్యాసాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రకటనల గురించి సమగ్రమైన సమాచారాన్ని, ఈ వ్యాసంలోనే పొందుపరచవచ్చు. ఇంకా ఈ వర్గంకింద ఇతర వ్యాసాలు తయారు చేయవలసిన అవసరం ఉన్నదా అన్న అంశం సభ్యులు అలోచించి ఆ తరువాత, "ప్రకటనలు" అన్న ప్రత్యేక వర్గం తయారు చెయ్యవచ్చు అని నా అభిప్రాయం.--S I V A 14:48, 25 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి ఆలోచన, వర్గం తొలగించవచ్చు. అహ్మద్ నిసార్ 15:07, 25 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసాలను చేరుకోవడానికి వర్గం చాలా ఉపయోగకారి. ప్రతి వ్యాసానికి ఖచ్చితంగా వర్గాలుండాలి. కనీసం ఒక్క వర్గం కూడా లేని వ్యాసాన్ని చేరుకోవడానికి ఎవరికైనా ఇబ్బందే (పైగా తెవికీలో సెర్చ్ కూడా సరిగా పనిచేయదు). ఒక్క వ్యాసమే ఉందని వర్గం సృష్టించకుండా ఉండలేము కాని తెగిన వర్గాలు కాకుండా వ్యాసం పేజీ నుండి మొదటి పేజీకి దారులు ఉన్నప్పుడే ఆ వర్గానికి సార్థకత ఏర్పడుతుంది. సమయం ఉన్నప్పుడు నేను సరిచేస్తాను. -- C.Chandra Kanth Rao-చర్చ 20:27, 25 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసంలో సమాచారం చాలా వరకు ఊహతో వ్రాసారనిపిస్తోంది. ఒక్క ఆధారం కూడా లేదు మరియు శాస్త్రీయత లేదు. దీన్ని కూడా వికీకరించాల్సి ఉంది. ప్రకటన అనేది వస్తూత్పత్తికి సంబంధించినది. కాబట్టి దీన్ని ఆర్థికశాస్త్రం వర్గంలోని ఉత్పత్తి ఉపవర్గంలో చేరిస్తే సరిపోతుంది. -- C.Chandra Kanth Rao-చర్చ 20:31, 25 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రకటనలు అన్న విషయం మీద అధారాలు కావాలంటే ఎటువంటి ఆధారాలు ఇవ్వాలి. ఇటువంటి వ్యాసాలు వ్రాసేటప్పుడు ఎక్కువగా మన పరిశీలన ద్వారా మనం తెలుసుకున్న విషయాలు వ్రాయటం జరుగుతుంది. దొరికెతే అసలు ప్రకటనలు ఎప్పుడు మొదలయ్యాయి, తెలుగులో మొట్టమొదటి ప్రకటన ఎప్పుడు,ఎవరు, ఎందుకు ప్రచురించారు వంటి విషయాల గురించి వ్రాసినప్పుడు ఆధారాలు పొందుపరచమని అడగటం న్యాయం. ఇక వర్గం గురించి. ఒక వర్గం ఏర్పరిచినంత మాత్రాన ఏమీ అయిపోదు. కాని వర్గపరంగా ఉన్న వ్యాసాలు అంటే వర్గాల జాబితా మొదటి పేజీ నుండి లింక్ ఉండి ఉంటే (నేను చూడక, ఇప్పటికే ఉంటే క్షంతవ్యుణ్ణి) చూడదలుచుకున్న వారి తమకు కావలిసిన వర్గానికి చెందిన వ్యాసం వెతుక్కోవటానికి సౌకర్యంగా ఉంటుంది. నాకు మటుకు ఇంతవరకు తెలుగు వికీలో "వెతుకు" ఆప్షన్ చక్కగా పని చేస్తున్నది, అప్పుడూ కష్టపడలేదు.--S I V A 02:47, 26 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
"వ్యాసం అనేది ఊహాజనితం కాదు ఇందులోని అనేక ముఖ్యమైన పాయింట్లు ప్రముఖ గ్రంథాల నుండి గ్రహించడమైనవి" అని తెలియజేసేవే ఆధారాలు/మూలాలు. ఆయా ముఖ్య వాక్యాల చివరన <ref> </ref> పెట్టి అందులో మూలానికి సంబంధించిన గ్రంథం పేరు, రచయిత, పేజీ సంఖ్య వ్రాయవచ్చు. వ్యాసంలో ఆధారాలు ఒక్క గ్రంథం నుండే కాకుండా పలు గ్రంథాలనుండి ఉండటం జరగాలి. లేకుంటే ఒకే గ్రంథం నుండి కాపీ చేసినట్లవుతుంది. ఆధారం తెలుపుతున్నాము కదాని పేరాలకు పేరాలు కూడా కాపీచేయడం తగదు. అది కాపీ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. మూలాలు లేని వ్యాసాలకు విశ్వసనీయత ఉండదు. కాబట్టి సమాచారానికి తగిన మూలాలు చూపించడం, కాపీ హక్కులు కల రచనలను అనుమతి లేకుండా సమర్పించకపోవడం అనేవి వికీ మౌళిక సుత్రాలు. -- C.Chandra Kanth Rao-చర్చ 09:43, 26 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
చాలా ధన్యవాదములు చంద్రకాంతరావుగారూ! తెలియని విషయాలు చాలా తెలియచేసారు. ఒక్క విషయం తెలియ చేయగలరు. అదేమిటంటే, ప్రకటన అన్న విషయం మీద వ్యాసం వ్రాసేప్పుడు ఇప్పటివరకు వ్రాసిన దానిలో ఏది ఊహాజనితం? ఏవి కాపి చేసినవి? తరువాత, ఎవరన్నా ఎక్కడన్నా ఈ విషయం గురించి ఇప్పటికే వ్రాసి ఉంటే అవి ఉదహరిస్తూ తప్ప మనం ఇక్కడ వికీపీడియాలో వ్యాసాలు వ్రాయకూడదా? ఒక విషయం గురించి స్థూలంగా అలోచించి నిర్వచించి ఆ విషయం మీద వ్యాసం వికీపీడియాలో వ్రాయలేమా?--S I V A 10:33, 14 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
శివ గారూ! మీరు ప్రకటన వ్యాసంలో ఏది ఊహాజనితం, ఏది కాపీ అని అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. వ్యాసం చదివితే ఊహాజనితంగా అనిపించి చర్చా పేజీలో తెలియజేశాను అంతేకాని ప్రతి వాక్యానికి అది ఊహాజనితం లేదా ఫలానా చోటు నుండి కాపీ చేయడం జరిగింది అని చెప్పడం ఎవరికైనా అసాధ్యమే. అయిననూ దానికి రచయితే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇక మీరడిగిన మరో ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే వికీలో ఏ వ్యాసమైననూ ఎక్కడో ఒకచోట వ్రాసి ఉన్నవాటినే చేర్చాలి అంతేకాని మన ఆలోచనా ప్రకారం కాని, ఊహాజనితంగా కాని వ్రాయడానికి అవకాశం అస్సలు లేదు. వికీలో రచనలు చేసేవారికి అర్హత ఏది, వారు అకతాయి వారైతే ఆ వ్యాసం ప్రామాణికమౌతుందా? అని వికీ వ్యవస్థాపకుడు జిమ్మేవేల్స్ ను అడిగితే "అకతాయి కుర్రాడా, హార్వర్డ్ ప్రొఫెసరా అనేది ముఖ్యం కాదు, ఇక్కడ రచనలు చేసేవారు సొంతంగా వ్రాయరు, ఎక్కడో ఒకచోటు ఉన్న సమాచారం మాత్రమే చేరుస్తారు" అని సమాధానం ఇవ్వడం మనం ఆలోచించాల్సిందే. -- C.Chandra Kanth Rao-చర్చ 17:34, 21 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]