రేణుకా చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీమతి రేణుకా చౌదరి
రేణుకా చౌదరి


పార్లమెంటు సభ్యులు
పదవీ కాలము
29 జనవరి, 2006 - 2009
తరువాత నామ నాగేశ్వరరావు
నియోజకవర్గము ఖమ్మం

వ్యక్తిగత వివరాలు

జననం (1954-08-13) 1954 ఆగస్టు 13 (వయస్సు: 64  సంవత్సరాలు)
విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి ఎస్.చౌదరి
సంతానము ఇద్దరు కుమార్తెలు
నివాసము హైదరాబాదు
మతం హిందూ
మే1, 2008నాటికి

మూలం: [1]

రేణుకా చౌదరి మాజీ భారత పార్లమెంటు సభ్యురాలు మరియు మాజీ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి..[1]

రాజకీయ జీవితం[మార్చు]

రేణుక బెంగుళూరు లోని కర్ణాటక విశ్వవిద్యాలయం నుండి పారిశ్రామిక మానసికశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పొందింది. ఈమె 1984లో తెలుగుదేశం పార్టీలో చేరి ప్రారంభించింది. ఈమె 1986 నుండి 1998 వరకు రెండు సార్లు రాజ్య సభ సభ్యురాలుగా పని చేసారు. 1998 సంవత్సరంలో ఈమె భారత జాతీయ కాంగ్రెసులో చేరారు. ఈమె 1999 మరియూ 2004 లోక్‌సభ ఎన్నికలలో ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుండి ఎన్నిక అయ్యారు. హెచ్.డి.దేవగౌడ ప్రభుత్వంలొ ఈమె కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా 1997-98 మధ్యకాలంలో పనిచేసారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ముందుగా 2004 సంవత్సరంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా, ఆ తరువాత 2006 నుండి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసారూ.[1] 2009 ఎన్నికలలో ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ప్రత్యర్ది నామా నాగేశ్వరరావు చేతిలొ సుమారు లక్షా యాభైవేల ఓట్లతొ ఓడిపోయారు. [2] ప్రస్తుతం వారు రాజ్యసభ సభ్యులు గా ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Renuka Chowdhury's profile at the Lok Sabha website
  2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009