పురుషులపై గృహ హింస

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పురుషులపై గృహ హింస (ఆంగ్లం: Domestic violence against men) వైవాహిక బంధాలలో, సహ జీవనంలో, ప్రేమ వ్యవహారాలలో, కుటుంబాలలో పురుషులు లేదా బాలుర పై జరిగే గృహ హింస. స్త్రీలపై గృహ హింస వలె పురుషులపై గృహ హింస కూడా నేరముగా పరిగణించబడిననూ ఈ చట్టాలలో, వాటి అమలులో, వాటికి పడే శిక్షలలో తేడాలు ఉన్నాయి.

స్త్రీలు తమపై జరిగే గృహహింసను అధికారులకు ఫిర్యాదు చేయమనే ప్రోత్సాహం వారికి బహిరంగంగానే లభిస్తుంది. కానీ పురుషుల విషయంలో ఈ ప్రోత్సాహం కొరవడుతుంది. పైగా మగతనం లేని వాడు/నపుంసకుడు వంటి ఆరోపణలు ఎదుర్కొనవలసివస్తుందనే భయంతో చాలా మంది పురుషులు కూడా వారిపై జరిగే గృహహింసను బయటికి చెప్పలేకపోతారు. కుటుంబ, వైవాహిక, ప్రేమ బంధాలలో స్త్రీలపై జరిగే గృహ హింసనే గృహ హింసగా పరిగణించటం, పురుషులపై జరిగే గృహ హింసను గుర్తించటంలో వివక్షల వలన కూడా పురుషులు ఇటువంటి విషయాలలో మిన్నకుండి పోతూ ఉన్నారు.

ఇవి కూడా చూడండి[మార్చు]