మానభంగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Konstantin Makovsky - The Bulgarian martyresses.jpg

మానభంగం లేదా అత్యాచారం లేదా లైంగిక దాడి (Rape) అనగా ఒక వ్యక్తి యొక్క మానానికి భంగం కలిగించడం. చట్టపరంగా ఒక వ్యక్తి యొక్క అనుమతి (Consent) లేకుండా సంభోగం జరుపడాన్ని మానభంగంగా పరిగణిస్తారు. ఇదొక రాక్షసరతి విధానం. ఇది చాలా కౄరమైన సాంఘిక నేరంగా పరిగణిస్తారు.

మానభంగం ఎక్కువగా స్త్రీలపై పురుషులు జరిపే ప్రక్రియ. అయితే ఇవి చాలా దేశాలలో వివిధ కారణాల వలన చాలా తక్కువగా రక్షకభటుల దృష్టికి వస్తాయి. ఇంకా కొద్ది మందికి మాత్రమే నేరస్థులుగా శిక్షలు విధించబడతాయి.[1] మానభంగానికి పాల్పడిన వ్యక్తి సాధారణంగా పరిచయం ఉన్నవారే చేస్తారని అమెరికా పరిశోధనల మూలంగా తెలిసింది. చాలా తక్కువగా అంటే 2 % సందర్భాలలో మాత్రమే కొత్త వ్యక్తులతో జరిగింది.[2]

కారణాలు

  • పిల్లలపట్ల తల్లిదండ్రుల శిక్షణ, పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం.
  • ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి, దేశభక్తి లేకపోవడం.
  • చిన్నతనంలో అబ్బాయిలు వేధింపబడటం.
  • నిందితుడి మానసిక పరిస్థితి.
  • పాశ్చాత్య సంస్కృతి పోకడ, ఆర్థిక స్వేచ్ఛ వల్ల స్త్రీ పురుషుల్లో పెరిగిపోయిన విచ్చలవిడితనం.
  • సినిమాల్లో అశ్లీల దృశ్యాలు.
  • అమ్మాయిలు ఆధునిక టైట్ జీన్స్, స్లీవ్ లెస్, షార్టు స్కర్టులు, హాఫ్ ప్యాంట్లు వంటి దుస్తులు ధరించడం.

రకాలు

మానభంగాన్ని జరిగిన సందర్భాన్ని బట్టి, వ్యక్తి లక్షణాలను బట్టి విభజిస్తారు.[3]

  • డేటింగ్ మానభంగం (Date Rape) :
  • సామూహిక మానభంగం (Gang Rape) :
  • వైవాహిక మానభంగం (Marital Rape) :
  • జైలు మానభంగం (Prison Rape) :
  • యుద్ధ మానభంగం (War Rape) :

భారతదేశంలో మానభంగం కేసులు

పరిష్కార మార్గాలు

  • తల్లిదండ్రులు తమ మగపిల్లలను ఆడపిల్లలను గౌరవించే విధంగా పెంచాలి.
  • ఆడపిల్లల వస్త్రధారణ సంస్కృతి ప్రతిబంబించేలా ఉండాలి. టైట్ ప్యాంట్లు, స్లీవ్లెస్ టాప్స్, షార్ట్ స్కర్టులు బయటకు వెల్లేటప్పుడు ధరించడానికి తల్లిదండ్రులు ప్రోత్సాహించకుండా ఉండాలి.
  • పిల్లలకు పాశ్చాత్య సంస్కృతి హద్దు మీరి అలవాటు కాకుండా చూసుకోవాలి.
  • మానభంగానికి దీర్ఘకాల జైలు శిక్ష అమలులోకి రావాలి.
  • పిల్లల పై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎల్లప్పుడు ఉండాలి.
  • పిల్లలోని లోక జాజ్ఞనంతోపాటూ అధ్యాత్మికత కూడా పెంపొందించాలి.
  • సినిమాల్లోని అత్యాచార సంఘటనలు పిల్లలు చూడకుండా జాగ్రత్తపడాలి.

ఇంకా చదవండి

మూలాలు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=మానభంగం&oldid=2883121" నుండి వెలికితీశారు