Jump to content

దోపిడీ

వికీపీడియా నుండి

దోపిడీ అనగా ప్రజలను భయపెట్టి వారి వద్ద నున్న ధనము, విలువైన వస్తువులు దోచుకోవడము. శిక్షాస్మృతి ప్రకారము ఒక వ్యక్తిని నయానో భయానో బెదిరించి అతని వద్ద నున్న సంపదను స్వాధీన పరుచుకోవడాన్ని దోపిడీ గా నిర్వచించారు.

నేపధ్యము

[మార్చు]

దోపిడీకి ప్రేరణ సమాజం లోని తారతమ్యాలే.ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే ఈ దోపిడీలు శతాబ్దాల కాలం నుండి జరుగుతున్నాయి. అప్పటిలో బలవంతమైన ధనికవర్గం ప్రజలు పేదల రక్తం పీల్చి వారి వద్ద నున్న సంపదను, శ్రమను దోపిడీ చేసేవారు. అసహాయులైన పేదలు వారి చర్యలను ప్రతిఘటించలేక పోయేవారు. ఈ సంఘర్షణలే బలవంతంగా నైనా తమ హక్కును సాధించాలని వారిని పురిగొల్పాయి. ఇదే క్రమంగా దోపిడీకి పురిగొల్పాయి.

దోపిడీ రకాలు

[మార్చు]
  • దారి దోపిడీ : రహదారుల పక్కన పొంచిఉండి చేసే దోపిడీలు. కొన్ని సార్లు ఇవి ముందస్తు ప్రణాళిక ప్రకారము కూడా జరుగుతాయి. పూర్వం ఇవి ఎక్కువగా అరణ్య మార్గములలో, నిర్మానుష్య ప్రాంతాలలో జరిగేవి. ప్రస్తుతము జనసమర్ధ ప్రాంతాలలో, రక్షకభట కార్యాలయాలకు కూతవేటు దూరంలో కూడా జరుగుతున్నాయి.
  • గృహ దోపిడీలు :నివాస గృహాలలో చొరబడి చేసే దోపిడీలు. దోపిడీ దొంగలు ఎక్కువగా ధనిక ప్రజల గృహాలను ముందుగా గుర్తించి తర్వాత అక్కడ రెక్కీ నిర్వహించి, పధకం ప్రకారం దోపిడీకి పాల్పడతారు. కొన్ని సందర్భాలలో ప్రజలను తీవ్రంగా హింసించడమో లేదా చంపడమో చేస్తారు.
Rōnin robbing a merchant's house in Japan around 1860.[1]
Marauders attacking a group of travellers, by Jacques Courtois

బయటి లంకెలు

[మార్చు]
  • Allen, Michael. (2005). Textbook on Criminal Law. Oxford: Oxford University Press. ISBN 0-19-927918-7.
  • Criminal Law Revision Committee. 8th Report. Theft and Related Offences. Cmnd. 2977
  • Griew, Edward. Theft Acts 1968 & 1978. London: Sweet & Maxwell. ISBN 0-421-19960-1
  • Ormerod, David. (2005). Smith and Hogan Criminal Law, London: LexisNexis. ISBN 0-406-97730-5
  • Smith, J. C. (1997). Law of Theft. London: LexisNexis. ISBN 0-406-89545-7

మూలాలు

[మార్చు]
  1. "Project Gutenberg". Gutenberg.org. 2004-07-29. Retrieved 2012-12-29.
"https://te.wikipedia.org/w/index.php?title=దోపిడీ&oldid=4268696" నుండి వెలికితీశారు