అంగచూషణ

వికీపీడియా నుండి
(ముఖరతి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అంగం చూషిస్తున్న స్త్రీ
కామసూత్రలో చిత్రించిన ముఖరతి భంగిమ.

ముఖరతి అంగచూషణ[1] అనేది రతిలో భాగం. సంభోగానికి ముందు ఒకరినొకరు ఉత్తేజ పరిచే ప్రక్రియ. ఇందులో స్త్రీ, పురుషుడి జననాంగాన్ని, పురుషుడు, స్త్రీ జననాంగాన్ని నోటితో ప్రేరేపించడం జరుగుతుంది.[2][3][4] స్తీ, ద్వారా జరుపబడే అంగచూషణని ఫెలేషియో[5][6] అని, పురుషుడు జరిపే అంగచూషణని కన్నిలింగస్అని అంటారు. జననేంద్రియాల్ని కాకుండా ఇతర శరీర భాగాల్ని నోటితో లేదా నాలుకతో ప్రేరేపించడాన్ని ముఖరతిగా భావించరు. ఇది రతి ప్రక్రియకు ముందు సహాయకారిగా ఉపయోగిస్తారు. సాధారణమైన రతి భంగిమలు దీనికి సరిపోతాయి. చాలా దేశాల సంస్కృతులలో ముఖరతిని నిషేధించాయి. స్వలింగ సంపర్కులు, కూడా అంగ చూషణకు పాల్పడటం పరిపాటి.

  • గర్భం: స్త్రీలు జరిపే ఫెలేషియో ఒక్కొక్కప్పుడు పురుషుడి వీర్యాన్ని మింగడం జరుగుతుంది. దీని వలన ఆమెకు గర్భం ధరించడం జరుగదు. వీర్యం జీర్ణాశయంలో విచ్ఛిన్నం అయిపోతుంది. జీర్ణవ్యవస్థకు జననేంద్రియ వ్యవస్థకు ఎటువంటి సంబంధం లేదు.
  • సుఖ వ్యాధులు: అయితే ఒకరి ఉండి మరొకరికి కొన్ని సుఖ వ్యాధులు, మానవ పాపిల్లోమా వైరస్, ఎయిడ్స్ వ్యాపిస్తాయి. నోటిలో ఏవైనా పుండ్లు లేదా గాయాలు ఉంటే వీటి వ్యాప్తి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన జననేంద్రియాల పరిశుభ్రత చాలా అవసరం.

అంగ చూషణం లేదా నోటితో చేసే లైంగిక కార్యం సంభోగంలో ఒక భాగం మాత్రమే. స్త్రీ, పురుషుని అంగాన్ని తన నోటిలో చొప్పించుకుని అతన్ని ప్రేరింప చేయడం, లేదా పురుషుడు స్త్రీ యోనిలోకి నోటితో స్త్రీని ప్రేరేపించడం అన్నమాట. ఆంగ్లంలో, నోటిసంభోగానికి (స్తీ నోట్లో అంగాన్ని పెట్టుకుని సుఖించే దాన్ని) ఫెలేషియో, (పురుషుడు నాలుకతో చేసే యోని సంభోగం) కన్నీలింగస్ అని పేర్లు. జననేంద్రియాల్ని కాకుండా ఇతర శరీర భాగాల్ని ప్రేరేపించడాన్ని నోటితో ముద్దులు పెట్టడం లాంటివి చేసినా అవి నోటి సంభోగంగా పరిగణింపబడదు. మామూలుగా, నోటితో చేసే సంభోగం అసలు క్రియకు సహాయకారిగా ఉపయోగ పడుతుంది. దీన్నే ఫోర్ ప్లే అంటారు. ఇందుకు సాధారణమైన రతి భంగిమలు సరిపోతాయి. స్త్రీలు జరిపే ఫెలేషియోలో ఒక్కొక్కప్పుడు పురుషుడి వీర్యాన్ని స్త్రీ, మింగడం జరుగుతుంది. దీని వలన ఆమెకు గర్భం ధరించడానికి తద్వారా పిల్లలు కలగడానికి అవకాశం లేనే లేదు. వీర్యం ఆమె జీర్ణాశయంలో విచ్ఛిన్నం అయిపోతుంది. జీర్ణవ్యవస్థకు జననేంద్రియ వ్యవస్థకు ఎటువంటి సంబంధం లేదు. అయితే, కొన్ని సుఖ వ్యాధులు, మానవ పాపిల్లోమా వైరస్, ఎయిడ్స్ వ్యాపిస్తాయి. నోటిలో ఏవైనా పుండ్లు లేదా గాయాలు ఉంటే వీటి వ్యాప్తి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన జననేంద్రియాల పరిశుభ్రత అంగచూషణకు పాల్పడే జంటకు చాలా అవసరం.

చిత్ర మాలిక

మూలాలు

  1. "fellation". Merriam-Webster. Encyclopædia Britannica, Inc. Archived from the original on 2010-09-20. Retrieved 2013-09-25.
  2. "Oral Sex". BBC Advice. BBC. Archived from the original on 2010-09-20. Retrieved 2013-09-25.
  3. Janell L. Carroll (2009). Sexuality Now: Embracing Diversity. Cengage Learning. pp. 265–267. ISBN 978-0-495-60274-3.
  4. Psychology Applied to Modern Life: Adjustment in the 21st century. Cengage Learning. 2008. p. 422. ISBN 978-0-495-55339-7. {{cite book}}: Cite uses deprecated parameter |authors= (help)
  5. Comprehensive Textbook of Sexual Medicine. Jaypee Brothers Publishers. 2005. p. 106. ISBN 8180614050. {{cite book}}: Cite uses deprecated parameter |authors= (help)[permanent dead link]
  6. Our Sexuality. Cengage Learning. 2010. p. 241. ISBN 0495812943. Fellatio (fuh-LAY-shee-oh) is oral stimulation of the penis and scrotum. {{cite book}}: Cite uses deprecated parameter |authors= (help)

యితర లింకులు

ఆంగ్ల వికీలో భాగం

"https://te.wikipedia.org/w/index.php?title=అంగచూషణ&oldid=3970153" నుండి వెలికితీశారు