సెక్స్ మ్యూజియం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
న్యూయార్క్ లోని సెక్స్ మ్యూజియం.

సెక్స్ మ్యూజియం (sex museum) లైంగిక కళకు సంబంధించిన వస్తువులను ప్రదర్శించే మ్యూజియం. ఇవి ఐరోపా ఖండంలో 1960-70 దశకంలో విస్తృతంగా ఏర్పాటుచేయబడ్డాయి. భారతదేశంలో మొట్టమొదటి సెక్స్ మ్యూజియం 2002 సంవత్సరం ముంబైలో ఏర్పాటుచేయబడింది.

సంగ్రహాలయాలు

ఆసియా

"Beppu Hihōkan", a sex museum next to the Shiraike-Jigoku in the Kannawa Spa, Beppu, Ōita, Japan.
 • చైనాలో మొట్టమొదటి సెక్స్ మ్యూజియం 1999 లో షాంఘై పట్టణ నడిమధ్యలో ప్రారంభించబడింది. దీనిని 2001 సంవత్సరంలో నగర సివార్లకు మార్చబడినది. దీనిని ప్రాచీన చైనీస్ సెక్స్ కల్చర్ మ్యూజియం అని కూడా పిలుస్తారు. వ్యవస్థాపక సెక్సాలజిస్ట్ డా. ల్యూ డాలిన్ స్మారకంగా డాలిన్ కల్చరల్ ఎగ్జిబిషన్ అని కూడా పిలుస్తారు. మరళ 2004 లో టాంగ్ లీ ప్రాంతానికి మార్చబడి చైనా సెక్స్ మ్యూజియం అని ప్రసిద్ధిచెందినది. ఇందులో సుమారు మూడువేలకు పైగా సెక్స్ కళాఖండాలు భద్రపరచబడ్డాయి.[1][2]
 • భారతదేశంలోని మొట్టమొదటి సెక్స్ మ్యూజియం ముంబై లో 2002 సంవత్సరంలో తెరువబడినది.[3]
 • దక్షిణ కొరియాలో మొట్టమొదటి సెక్స్ మ్యూజియం, ఆసియా ఎరోస్ మ్యూజియం, సియోల్ నగరంలో 2003 లో ప్రారంభించబడినది. ఇది కొద్దికాలంలోనే మూతపడింది.[4]
 • దక్షిణ కొరియాలోని జేజు ద్వీపంలో లవ్ ల్యాండ్ పార్క్ 2004 లో తెరవబడినది. ఇది బయలు ప్రదేశంలో సెక్స్ కు సంబంధించిన శిల్పాలు ప్రదర్శన మీద ఆధారంగా స్థాపించారు. ఇక్కడ ఇలాంటివి వివిధ రతి భంగిమలలోనున్న 140 శిల్పాలు ఉన్నాయి.
 • జపాన్లో చాలా సెక్స్ మ్యూజియంలున్నాయి. వీటిని హిహోకన్ ("Hihokan లేదా House of Hidden Treasures)" అని పిలుస్తారు.[5][6][7][8][9]

మూలాలు

 1. "Travel Channel - Error". Archived from the original on 2005-11-18. Retrieved 2015-04-09.
 2. "China Sex Museum". Archived from the original on 2005-08-18. Retrieved 2015-04-09.
 3. Chadha, Monica (November 26, 2002). "India's first sex museum". BBC News. Retrieved May 23, 2010.
 4. Gluck, Caroline (May 24, 2003). "Sex museum opens in Seoul". BBC News. Retrieved May 23, 2010.
 5. 熱海秘宝館
 6. 鬼怒川秘宝殿
 7. 鳥羽SF未来館
 8. 元祖国際秘宝館
 9. 別府秘宝館