కామసూత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వాత్సాయనుని కామసూత్రాలు (సంస్కృతం: कामसूत्र) అని పిలువబడే ఈ గ్రంథము మానవుల (సంభోగం)గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. ప్రాచీన భారతదేశములో ఈ గ్రంథము సంస్కృత సాహిత్యములో శృంగారానికి సంబంధిన రచనలలో ప్రామాణిక గ్రంథమని భావిస్తారు. దీన్ని మల్లనాగ వాత్సాయనుడు రచించాడని భావిస్తారు. గ్రంథంలోని కొంతభాగం మానవ లైంగిక ప్రవర్తన గురించి చెప్పబడింది.[1] గ్రంథములోని చాలా భాగం గద్యములోనే రచించబడగా, పలు చోట్ల అనుష్టుభ పద్యాలు కూడా ఉన్నాయి. కామము అనగా కోరిక. లైంగిక వాంఛ కూడా కామమే. సూత్రము అనగా నియమము.

సాధారణంగా కామశాస్త్రమనే గ్రంథాల సమహారంలో కామసూత్ర అత్యంత ప్రాచుర్యం పొందిన గ్రంథం.[2]

క్రీ.పూ 400-200 సంవత్సరాల మధ్యలో కామసూత్ర రచించబడి ఉండవచ్చునని చరిత్రకారుల అభిప్రాయము. చరిత్రకారుడు జాన్ కీయే కామసూత్ర ఒక సంకలనమని, ఇది ప్రస్తుతమున్న స్థితిలో సా.శ. రెండవ శతాబ్దములో సేకరించబడినదని చెప్పాడు.[3]

విషయ సంగ్రహం

[మార్చు]

కామసూత్ర పీఠికలో వాత్సాయనుడు అతని కంటే పూర్వపు గ్రంథకర్తల యొక్క రచనలు తన రచనకి ఎలా ఉపయోగపడ్డాయో ప్రస్తావిస్తాడు. తన రచనలోని ఏడు భాగాలు దత్తకుడు, సువర్ణనభుడు, ఘోతకముఖుడు, గోనర్దియుడు, గోనికపుత్రుడు, చారాయణుడు,, కుచుమారుని రచనల యొక్క సంగ్రహాలని తెలుపుతాడు. వాత్సాయనుని కామసూత్రాలు 1250 పద్యాలతో, 36 విభాగాలు, 7 భాగాలుగా వ్రాయబడ్డాయి.[4] బర్టన్,[5]

1. పరిచయం (సం
సాధారణం) - మొదటి విభాగంలో పుస్తక విషయము, అమరిక గురించి క్లుప్తంగా వివరించబడింది. పరిచయభాగములోని ఇతర విభాగాలు జీవిత గమ్యాలు ప్రాముఖ్యత, విజ్ఞాన సముపార్జన, సజ్జనులు, ఉన్నత కుటుంబాలనుండి వచ్చిన నాగరీకుల నడవడిక, విటునికి సహాయపడే మధ్యవర్తుల గురించిన విషయాలను చర్చించబడ్డాయి (5 విభాగాలు).
2. శృంగార కలయిక (సం
సంప్రయోగికం నామ ద్వితీయ అధికరణం ) - విభాగాలు కామోద్దీపనం, ఆలింగనాలలో రకాలు, నిమురుట , చుంబనములు, నఖక్షతాలు, దంతక్షతాలు, రతి భంగిమలు, తాడనాలు, అనుబంధిత శీత్కారాలు, అధిక లైంగిక శక్తి గల స్త్రీల గురించి, ఉపరతి , ముఖ రతి, రతికేళి యొక్క అంత్యారంభాల గురించి వివరిస్తాడు. దీనిలో 64 రకాల కామ క్రీడలు వివరించాడు (10 విభాగాలు).
కామసూత్రములో వివరించబడిన ఒక రతి భంగిమకు చిత్రరూపము. కామసూత్ర రెండవ భాగములో వివిధ రతిభంగిమలు వివరించబడినవి కానీ ఎటువంటి రేఖాచిత్రాలు లేవు.
3. భార్యను పొందే విధానం (సం
కన్యా సంప్రయుక్తకం) - విభాగాలు వివాహంలో రకాలు, స్త్రీ ని ప్రశాంతంగా ఉండేట్లు చేయటం, స్త్రీ ని పొందు విధానం, ఒంటరిగా గడపటం, వైవాహిక సంగమం (5 విభాగాలు).
4. భార్యాధికరణం (సం
భార్యాధికారికం): ఒక్కతే భార్య , ముఖ్యమైన ఇతర భార్యల ప్రవర్తన (2 విభాగాలు).
5. ఇతరుల భార్యల గురించి
ఈ విభాగాలలో స్త్రీ, పురుషుల ప్రవర్తన, పరిచయం పెంచుకోవటానికి మార్గాలు , పద్ధతులు, మనోభావాలని పరీక్షించటం, రాయబారాలు నెరపే విధానం, రాజభోగాలు, గర్భాశయము యొక్క నడత (6 విభాగాలు).
6. వేశ్యాధికరణం (సం
పారదారికం ): ఈ విభాగం విటుల ఎంపిక, స్థిరమైన విటుని కొరకు వెతకటం, డబ్బు సంపాదించటానికి మార్గాలు, పాత ప్రేమికునితో తిరిగి స్నేహం చిగురింపజేయటం, అనుకోకుండా కలిగే లాభనష్టాలు మొదలైన వాటిపై వేశ్యలకు సూచనలు ఇస్తున్నది (6 విభాగాలు).
7. ఇతరులను ఆకర్షించడం గురించి (సం
ఔపనిషాధికం): ఈ భాగంలో శారీరక ఆకర్షణను మెరుగుపరచుకోవటం, వశీకరణం, లైంగిక బలహీనతలను అధిగమించడం వంటి విషయాలు చర్చించాడు (2 విభాగాలు).

ఆనందం , ఆధ్యాత్మికత

[మార్చు]

భారతీయ సాంప్రదాయం ప్రకారం మానవులకు పురుషార్ధాలనే నాలుగు ప్రాథమిక ధర్మాలున్నాయి,[6][7] ఇవే పురుషార్ధాలు:[8]

1). ధర్మ: Virtuous living. 2). అర్థ: Material prosperity. 3). కామ: Aesthetic and erotic pleasure.[9][10] 4). మోక్ష: Liberation.

జీవన్మరణ చక్రం నుంచి విముక్తినే మోక్షమంటారు. జీవన్మరణ చక్రం నుంచి విముక్తిని కోరుకొనే వారు మోక్షమే ప్రధాన పురుషార్థంగా భావిస్తే, ధర్మార్థకామాలు జననానికి మరణానికి మధ్య జరిగే నిత్య జీవితపు పురుషార్థాలు. కామసూత్రం (బర్టన్ అనువాదం) లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:

కామానికంటే అర్థము, అర్థానికంటే ధర్మము ఉన్నతమయిన జీవితలక్ష్యాలు. కానీ, ప్రజల నిత్యజీవిత అవసరాలను తీర్చే శక్తి అర్థానికే ఉంది కనుక, దేశాలను పరిపాలించే రాజులు మాత్రం అర్థాన్నే ప్రధాన పురుషార్థంగా స్వీకరించాలి. పడుపు వృత్తియే జీవనాధారముగా కల స్త్రీలకు కామమే ప్రధాన పురుషార్థము. వీరిరువురి విషయంలొ పయిన చెప్పిన నియమము వర్తించదు.(Kama Sutra 1.2.14)[11]

మానవ జీవితంలో అన్నిటికంటే ఉన్నతమయిన లక్ష్యం "ధర్మం". తరువాత భద్రత (ఆర్థిక, సామాజిక) నిండిన జీవితం ఆశయకరం. సుఖభరితమయిన జీవితము అన్నిటికంటే చివర కోరదగినది. జీవిత లక్ష్యాల గురించి సంశయము కలిగినప్పుడు, తికమక కలిగినప్పుడు, అధమ లక్ష్యాలను త్యజించి ఉన్నతలక్ష్యాలను ఎంచుకోవాలి. అర్థసాధనకయి ధర్మాన్ని, కామసాధనకయి అర్థసాధనను, త్యజించరాదు. అయితే, ఈ నియమానికి కోన్ని ఆక్షేపాలు (exceptions) ఉన్నాయి.

వాత్సాయనుని ప్రకారం, అర్థసాధనకు కావలసిన విద్యను బాల్యంలోనే అభ్యసించాలి. యవ్వనదశ కామసాధనకు అనువుగా ఉంటుంది. వార్ధక్యదశ దగ్గరయ్యేకొద్దీ మానవుడు ధర్మసాధనపై దృష్టిని నిలిపి, మోక్షమునకై ప్రయత్నించాలి. [12]

కామసూత్ర గ్రంథాన్ని తాంత్రిక శృంగారానికి సంబంధించిన గ్రంథంగా అనుకోవటం పొరపాటు. హిందూ తంత్రములో శృంగారము ఒక భాగమైనప్పటికీ, తంత్రక్రియకు సంబంధించిన శృంగార కర్మలు కామసూత్ర గ్రంథంలో లేవు.

అనువాదాలు

[మార్చు]

కామసూత్ర ఆంగ్ల అనువాదాలలో అన్నింటికన్న ప్రసిద్ధిచెందినది ప్రముఖ యాత్రికుడు, రచయిత సర్ రిచర్డ్ ఫ్రాన్సిస్ బర్టన్ 1883లో రచించింది.[13] దీనిని విక్టోరియా, ఆల్బర్టు మ్యూసియం భారతిశాఖని చూచే శ్రీ.డబ్ల్యు.జి.ఆర్చర్ ఈ ప్రతిని సరిచూచారు.ప్రసిద్ధ ప్రచురణసంస్థ అయిన అలెన్,అన్‌విన్ కంపెనీ ప్రకటించారు.ఆర్చరు కామసూత్రాలను గురుంచి బి.బి.సి.లో 1963 లో ఉపన్యసించారు. అందులో కొన్ని విషయాలు:

"నా ఉద్యోగంలో చివరి ఆరేండ్లు మాత్రం హైందవులను గూర్చి కొంచెము హెచ్చుగా తెలుసుకో గలిగేనని చెప్పాలి.అప్పుడు నేను, దుర్గమమైన అరణ్య ప్రాంతము- సంతాల్ పరగణ (బెంగాల్ రాష్ట్రము) కు డెప్యూటి కమీషనరుగా ఉండేవాణ్ణి.అక్కడ అరణ్యమైనా, మనోహార రస భావాలు కల్పించే పరిసరాలున్నాయి.సంతాలీలు, ఆటవిక ప్రాంతాలే నివాసంగా చేసుకొని స్వేచ్ఛగా, ఉల్లాసంగా జీవితం గడుపుతారు. సంతాలీ సంఘంలో వర్ణవ్యవస్థ ఉన్న హిందూ కుటుంబములవలె నియమాలు, నిబంధనలు ఏమీ లేవు. అంతకుముందు నావంటి పాశ్చాత్యునికి ఇంటిలో ఆతిధ్య మియ్యకుండా బహిష్కరించిన నాగరికతగల గొప్ప హైందవ కుటుంబాలకు-అందరును, జాతి మత విచక్షణ లేకుండా ఆప్యాయంగా ఆదరించి సర్వ విధాల సంతోషపెట్టే సంతాలీలకు బ్రహ్మాండమైన భేదం కనబడ్డది. సంతాలీలు ఒక గ్రామంలో ఉంటారు.ఆ గ్రామ రచ్చ సావిడీలో వీధి మధ్య కూర్చుండి తమ తమ వ్యవహారాలన్నీ పరిష్కారము చేసుకొంటారు.ఇందులో విశేషమేమంటే, తక్కిన హైందవ సంఘంలాగా స్త్రీలు రాకూడదనే నియమెంతమాత్రమూ లేదు. సంతాలీలలో వారు కూడా పురుషులతో కలిసి తగాయిదాలు పరిష్కరించుకుంటారు. వాదప్రతివాదాలు చేసేటప్పుడు పురుషుల కెంత హక్కు, అధికారమూ ఉన్నదో స్త్రీలకు అట్టి అవకాశాలున్నాయి. అన్ని కాలాలలోనూ, అన్ని ఘట్టాలలోను సంతాలీ స్త్రీలు, పురుషులు కలిసి మెలసి ఉండి, సరసమైన జీవితం గడపాలనే వాత్స్యాయన కామసూత్ర నిర్ణయాలకు ఉదాహరణ ప్రాయ మైనది, ఈ సంతాలీల జీవితం అని హ్రహించేను.

వాత్స్యాయన కామసూత్రాలు - హైందవ అలెగ్జాండ్రా క్వార్కెటు అని చెప్పడం సరిపోతుంది.డ్యూరెల్ ప్రతిపాత్ర-జస్టిన్, మెలిస్సా, డార్లీ, పర్సివార్లను, నెస్సిం, క్లియ, స్కోబి, బాలతజర్ మొదలైనవారి కందరకును వేర్వేరుగా కాముకులున్నారు. ప్రతిపాత్రకు ఒక ప్రత్యేక ధృక్పధం, కామ సిద్ధాంతం, శృంగార భావాలు ఉన్నాయి. వాత్స్యాయనంలో కూడా సరిగ్గా ఇదే పద్ధతి- ప్రతి యువతికి, తాము వలచిన ప్రియుడు ప్రత్యేకంగా ఉన్నట్లు కనిపించే కాముకుల విభాగం ఉంది. అక్కడ నాగరికుడు ఉన్నాడు. స్త్రీల కోసం తిరిగే యువకులున్నారు.పడుచు పెండ్లాన్ని కట్టుకొని బాధపడుతూన్న ముసలి మొగుళ్ళు ఉన్నారు.అప్పుడే యవ్వనం తొంగిచూస్తున్న బాలికలూ ఉన్నారు.ఈతదంగం అంతా- పెళ్ళి అయిన స్త్రీలు.

నాపుస్తక ప్రచురణ కర్తల్లు, కామసూత్రాలు, రామాయణ భారతము వంటి ప్రాచీన కావ్య గౌరవం గల గ్రంథములను సా.శ.1883లో దానిని ప్రయివేటుగా ముద్రించారు.కాని, ఆకాపీ లన్నింటిని ప్రభుత్వము వారు ప్రచారంలోనికి రాకుండా అణగద్రోక్కేరు.ఈ పరిస్థితులన్నీ గమనించి రేవర్ అన్‌విన్ ప్రచురుణ సంస్థ వారు దీనిని పునర్ముద్రణ చేయడానికి పూనికున్నారు.

భర్త సౌఖ్యంలేని ఇల్లాలు, వయస్సు చెల్లిన కుటుంబిని, ఉన్నతస్థాయిలో ఉండే వేశ్య గురుంచి ప్రస్తావన ఇందులో విపులీకరించి ప్రస్తావన జరిగింది.ప్రాధిమికంగా ఇంద్రియ జన్యమైన సౌఖ్యమే ఇందులో ప్రస్తారించబడింది. కాని ఇదే ప్రధానంకాదు, జీవితోద్దేశమునూ కాదు.రెండవదిఅయిన వైవాహికజీవిత ప్రేమయే విశిష్టమైనది.ఏ రెండు ఉద్దేశాలు, ఇంతకంటే భిన్నంగా కనబడవు.కాని వాత్స్యాయనుడు ఈ రెండు పద్ధతులకు అంగీకారముద్ర ఇచ్చేడు.కాని ఇదే చాల ముఖ్యమైన మూలవిషయం. అతడు జీవుతము, స్త్రీ పురుషత్వములు వీని అమేయ వివిధశక్తి సమ్మేళనాన్ని గుర్తించాడు.ఒకరికి నచ్చిన పురుషుడు మరొక స్త్రీకి నచ్చకపోవచ్చును.సంఘంలో ఉండే ఈవైవిధ్య భావాలన్ని సమన్వయం చేసింది కామసూత్రాలే. ఇది ఒక కెమేరా వంటిది.ఒక్కసారి ఛాయాచిత్రం తీయడమే కాక ఆధృక్కోణం కూడా మారుస్తూ ఉంటుంది.ఇక్కడ కెమేరా ఒకటే అయినా ఛాయాచిత్రాలు ఏకాకారంగా ఉంటాయి.కామసూత్రాలలో రహస్యం ఇదే-ఒక స్త్రీయే ఇద్దరు ముగ్గురుతో ఉన్నా సాంఘిక వ్యవస్థకు, సామజిక స్థితికి భంగం కలుగదు. వాత్స్యాయనుడు పాదరసం వంటి బుద్ధి కలవాడు.స్త్రీల హృదయాలు దేవుడికైనా తెలియవంటారు.వారి వాస్తవికభావాలన్ని కనిపెట్టడం మానవుల తరం కాదు.అయితే వాత్స్యాయనుడుకి స్త్రీ స్వభావం అంతా కరతాలమకం. ఒక స్త్రీకి తగిన భర్త యెవరంటె, ఆమెను సంపూర్ణంగా కామాలాపంలో వశపరచుకున్నవాడే అని అతని సిద్ధాంతం.అన్నీ మెలుకువలు సంపూర్ణంగా తెలిసిన కామశాస్త్రోపాధ్యాడు, స్త్రీకి తగిన భర్త. భార్య మూకీభావము వహింపక చలాకీగా ఉండవలెనని అతని మరియొక అభిప్రాయము.64 కళలలో ప్రవీణత లేకపోయినా కొన్నింటియందైనా ప్రవీణత ఉంటే, ఆమె జీవితము రసవత్తరంగా, ఆనందంగా ఉంటుంది."

ఇటీవలి కాలంలో, 1980లో ఇంద్రా సిన్హా కామసూత్రను ఆంగ్లంలోకి అనువదించారు. దాదాపు 1990 నుండి కామసూత్రలోని వివిధ రతిభంగిమలు వివరించబడిన అధ్యాయమొక్కటే స్వతంత్ర గ్రంథంగా ఇంటర్నెట్లో చెలామణీ thus way start టం ప్రారంభించింది. ఇవాళ పరిస్థితి, ఆ అధ్యాయమెక్కటే మొత్తం కామసూత్ర అని అనుకునే స్థాయికి చేరుకుంది[14]

అలాయిన్ డానియలౌ 1994లో సంపూర్ణ కామసూత్ర రచించాడు. దీనిలో వాత్సాయనుడు వ్రాసిన మూల గ్రంథానికి ఆధునిక వివరణలు ఉన్నాయి.

అన్నింటికన్నా తాజాగా 2002లో చికాగో విశ్వవిద్యాలయంలోని మత చరిత్ర ఆచార్యురాలు వెండీ డోనిగర్, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని ప్రపంచ మతాల కేంద్రంలోని భారతీయ మానసిక విశ్లేషకుడు సుధీర్ కక్కర్ కలిసి అనేక కోణాల నుండి ఈ గ్రంథాన్ని విశ్లేషించారు..[13]

నోట్సు

[మార్చు]
 1. Common misconceptions about Kama Sutra. Archived 2007-09-29 at the Wayback Machine సాధారణంగా భావించినట్టుగా కామసూత్ర శృంగార కరదీపిక కాదు, అలాగే పవిత్రమైన మతసంబంధ గ్రంథమూ కాదు. ఖచ్చితంగా తాంత్రిక గ్రంథము అంతకంటే కాదు. గ్రంథం యొక్క ప్రారంభ చర్చలో చెప్పినట్టు ప్రాచీన హిందూ జీవనంలో ముఖ్యమైన విధులైనటువంటి ధర్మార్ధకామాల్లో కామాన్ని సరైన , సముచితమైన స్థానం (కాంటెక్స్ట్) లో చూపించటమే వాత్సాయనిని ఉద్దేశ్యము. ధర్మ (ఉన్నత జీవితము) జీవితం యొక్క అత్యున్నత లక్ష్యం, ఆ తరువాత స్థానంలో అర్ధ (ధనార్జన), ఆ తరువాత చివరి స్థానములో కామము వస్తుంది.” —Indra Sinha.
 2. For Kama Sutra as the most notable of the kāma śāstra literature see: Flood (1996), p. 65.
 3. For the Kama Sutra as a compilation, and dating to second century CE, see: Keay, pp. 81, 103.
 4. translation[permanent dead link] by Burton
 5. Date checked: 29 March 2007 Burton వంటి అనువాదకులు కూడా ఇదే మూలపద్ధతిని అనుసరించారు:
 6. For the Dharma Śāstras as discussing the "four main goals of life" (dharma, artha, kāma, and moksha) see: Hopkins, p. 78.
 7. For dharma, artha, and kama as "brahmanic householder values" see: Flood (1996), p. 17.
 8. For definition of the term पुरुष-अर्थ (puruṣa-artha) as "any of the four principal objects of human life, i.e. धर्म, अर्थ, काम, and मोक्ष" see: Apte, p. 626, middle column, compound #1.
 9. For kāma as one of the four goals of life (kāmārtha) see: Flood (1996), p. 65.
 10. For definition of kāma as "erotic and aesthetic pleasure" see: Flood (1996), p. 17.
 11. Quotation from the translation by Richard Burton taken from [1]. Text accessed 3 April 2007.
 12. Book I, Chapter ii, Lines 2-4 Vatsyayana Kamasutram Electronic Sanskrit edition: Titus Texts, University of Frankfurt bālye vidyāgrahaṇādīn artʰān, kāmaṃ ca yauvane, stʰāvire dʰarmaṃ mokṣaṃ ca
 13. 13.0 13.1 Avari (2007), p. 171.
 14. Sinha, p. 33.

మూలాలు

[మార్చు]
 • Apte, Vaman Shivram (1965). The Practical Sanskrit Dictionary. Delhi: Motilal Banarsidass Publishers. ISBN 81-208-0567-4. (fourth revised & enlarged edition).
 • Avari, Burjor (2007). India: The Ancient Past. London: Routledge. ISBN 978-0-415-35616-9.
 • Daniélou, Alain (1993), Inner Traditions, ISBN 0-89281-525-6.

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
Original and translations
"https://te.wikipedia.org/w/index.php?title=కామసూత్ర&oldid=4177123" నుండి వెలికితీశారు