మూస చర్చ:పురుషులపై హింస
పితృసమానులైన వాడుకరి:JVRKPRASAD గారూ, చక్కని మూస ప్రారంభించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు/అభినందనలు. దీనికి కొంత వరకు నా వ్యాసం భర్తపై క్రూరత్వం ఉపయోగపడవచ్చును. ఒక మారు పరిశీలించగలరు. నా వ్యక్తిగత జీవితానుభావాలు, మా నాన్నగారు డి. సూపరింటెండెంటు ఆఫ్ పోలీసు గా పదవీవిరమణ చేయటం, చట్టం పై ఆయన వద్దనున్న సమాచారం, ఇంటర్నెట్ పై ఈ వ్యాసానికి సంబంధిత సమాచారం, మూలాలు క్రోడీకరించి, వాటిని వికీకరించి ఈ వ్యాసం వ్రాశాను. ఆంగ్ల వికీ ఆధారంగా పురుషవాదం వ్రాశాను గానీ, అది ఇంకా అసంపూర్ణంగా నే ఉన్నదని, భారతదేశానికి తగిన ప్రాంతీయత అందులో ఉన్నదని నేననుకోవటం లేదు. ఇక పురుషుల హక్కులు వ్యాసం అయితే లేనే లేదు! సంబంధిత వ్యాసాల అభివృద్ధి, క్రొత్త వ్యాసాల సృష్టి మనందరి బాధ్యత. ఆసక్తి ఉన్న వాడుకరి:Kvr.lohith వంటి ఇతర వాడుకరులు కూడా దీనికి తోడ్పడవచ్చు. కలసి కట్టుగా ఈ అభివృద్ధికి తోడ్పడదాం. - శశి (చర్చ) 12:09, 29 ఏప్రిల్ 2015 (UTC)
సహాయం అందించబడింది
ఈ మూసలో మరిన్ని వ్యాసాలు చేర్చవచ్చునా?
ఉదా:
శశి (చర్చ) 09:21, 2 ఏప్రిల్ 2016 (UTC)
- శశి గారూ ఆంగ్లంలో బానిసత్వం గురించిన మూస ఉదాహరణగా తీసుకుందాం. (రెంటికీ సారూప్యత ఉందని కాదు, కేవలం ఉదాహరణ కోసం) అందులో వివిధ విభాగాల్లో వ్యతిరేకత, నిరోధం అన్న విభాగమూ ఉంది. దానిలో భాగంగా బానిసత్వ నిర్మూలన కోసం జరిగిన ప్రయత్నాలు ఉన్నాయి. ఐతే సంబంధిత సంస్థలు లేవు. అలానే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం, పితృ దినోత్సవం ఈ మూసలో వ్యతిరేక ఉద్యమం అనో, మరోటో కుదిరే పేరు పెట్టి చేర్చవచ్చని, కానీ సంస్థల పేర్లు చేర్చడం అంతగా ఆమోదయోగ్యం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఓ పెద్ద సమస్య/ఉద్యమానికి మనం ఆ సంస్థలే ప్రతినిధులని చెప్పేసినట్టు అవుతుందని ఓ సాటి వికీపీడియన్ గా నా అనుకోలు. --పవన్ సంతోష్ (చర్చ) 05:15, 5 ఏప్రిల్ 2016 (UTC)
- శశి గారూ {{సహాయం కావాలి}} మూసను తోలగించవచ్చేమో పరిశీలించండి. --కె.వెంకటరమణ⇒చర్చ 01:23, 21 ఏప్రిల్ 2016 (UTC)