సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రకం భారతదేశానికి చెందిన పురుషుల హక్కుల సంస్థ
స్థాపన 2007
స్థలం Over 50 cities in 20 states[1]
నిర్వాహకులు
జనరల్ సెక్రటరి - రుక్మా చారి;
నాగపూర్ - రాజేష్ వఖారియా;
రంగం పురుషుల హక్కులు, గృహహింస
వెబ్-సైటు

సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ (ఆంగ్లం: Save Indian Family Foundation లేదా SIFF) పురుషుల హక్కుల కోసం పోరాడే భారతదేశానికి చెందిన ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ప్రభుత్వం చేసే అప్రజాస్వామిక సాంఘిక ప్రయోగాల నుండి పురుషులను, వారి కుటుంబాలను SIFF రక్షిస్తుంది.[2]

లక్ష్యం

[మార్చు]

స్త్రీ సాధికారత పేరుతో భారీ ఎత్తున ఉల్లంఘించబడుతోన్న పౌర స్వేచ్ఛ, మానవ హక్కుల గురించి అవగాహన కలిగించటం. పురుషజాతి త్యజించదగినది అనే అభిప్రాయానికి చరమగీతం పాడటానికి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కృషి చేస్తుంది. పురుషులు మృత్యువాత పడటం స్త్రీల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉన్ననూ, లింగ సమానత్వం గురించి మాట్లాడేటప్పుడు ఈ ప్రస్తావన రాదు అని ఎత్తిచూపుతుంది. SIFF గృహహింస, వరకట్న వేధింపు చట్టాల దుర్వినియోగం బారిన పడిన పురుషులకు మద్దతునిస్తుంది. భారతదేశంలోని అన్ని చట్టాలలో లింగ సమానత్వం ఉండేలా చేయాలని SIFF భావిస్తుంది.

కార్యాచరణ

[మార్చు]
  • ఐపీసీ 498ఏ, వరకట్న వేధింపులు/గృహహింస చట్టాల దుర్వినియోగం బారినపడ్డ పురుషులకు, వారి కుటుంబాలకు దిశానిర్దేశం చేస్తుంది.
  • చట్ట/న్యాయ వ్యవస్థ ల ప్రాథమిక సిద్ధాంతాలను తుంగలో త్రొక్కి, రాజీ పేరుతో భారీ పైకాన్ని రాబట్టే పోలీసులు, న్యాయవాదుల బారి నుండి వారిని కాపాడుతుంది.
  • ఈ చట్టాల క్రింద తప్పుడు కేసులను ఎదుర్కొంటున్న పురుషులలో ఆశావహ దృక్పథాన్ని నింపుతూ ఆత్మాహత్యా ప్రయత్నానికి వారిని ఆమడ దూరంలో ఉంచుతుంది.
  • ఈ చట్టాల దుర్వినియోగం వలన బాధపడుతోన్న పురుషుల భావోద్వేగాలను అర్థం చేసుకొని వారికి స్వాంతనను అందిస్తుంది.

పురుషుల సమస్యలే ఎందుకు?

[మార్చు]
  • పురుషుల మనస్తత్వం భిన్నమైనది
  • స్త్రీ సంరక్షణకు అనేక చట్టాలు నిధులు ఇప్పటికే కేటాయించబడ్డాయి. కానీ పురుషుల సంరక్షణను పట్టించుకొనే నాథుడే లేడు
  • అనేక ప్రభుత్వేతర సంస్థలు స్త్రీల సమస్యలపై దృష్టి సారిస్తున్నాయి. కానీ పురుషుల సమస్యలు గాలికి వదిలివేయబడ్డాయి

పురుషులను రక్షించటం అంటే కుటుంబాలను రక్షించటమే

[మార్చు]

భర్త పట్ల క్రౌర్యం అనే చట్టపరమైన తీవ్రవాదం వలన అనేక మంది పురుషులు కేసులలో ఇరుక్కుపోతున్నారు. జైలుపాలు అవుతోన్నారు. వీరి కుటుంబంలోని స్త్రీలు, పిల్లలు దీని వలన బెదిరిపోతున్నారు. పురుషుడు ప్రమాదంలో ఉంటే, ఆ కుటుంబం ప్రమాదంలో ఉన్నట్లే. పురుషులకు సంఘంలో సరైన గౌరవ మర్యాదలు లేనప్పుడు, ఆ కుటుంబం నాశనమైపోతుంది. అమాయక పురుషులను చెరసాలపాలు కాకుండా రక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ సంఘంలో పురుషద్వేషం వేళ్ళూనుకుపోయింది. ఒక పిచ్చికుక్కపై రాళ్ళు విసిరితే గగ్గోలు పెట్టే ఉద్యమాలు, సంఘాలు ఉన్నవి; కానీ తప్పుడు వరకట్న/గృహహింస, మానభంగ వేధింపు కేసులలో ఇరుక్కుపోయిన పురుషులపై ప్రసార మాధ్యమాల విచారణే యదార్థం అనుకొని పురుషుల పుంసత్వాన్ని తొలగించాలి, నట్టనడివీధిలో అందరి ముందు కొట్టి చంపాలి అని ఈ సంఘం భావిస్తోంది. చెదురుముదురుగా ఈ సంఘటనలు జరిగిననూ చట్టపరంగా ఎటువంటి చర్యలూ తీసుకొనబడలేదు.

వైవాహిక దృక్పథం

[మార్చు]

పాశ్చాత్య ప్రభావం పెరిగిపోవటం వలన పట్టణ ప్రాంతాలలో వైవాహిక వ్యవస్థ నీరుగారిపోతున్నది. భారతీయ వివాహ వ్యవస్థను రక్షించటానికి, మత సంస్థలు, మేధావులు తమకు వీలున్న సహాయ సహకారాలను అందించాలి.

కాన్ఫిడేర్

[మార్చు]

పురుషుడు ఎప్పుడూ శక్తిమంతునిగా చిత్రీకరించబడ్డాడు. మరొక వైపు సభ్య సమాజం నుండి పురుషునికి లభించే స్నేహహస్తం అరుదే. ఇటువంటి పురుషుడు తప్పుడు కేసులలో ఇరుక్కొన్నప్పుడు, అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? అతనిలో ఆత్మహత్య ఆలోచనలు కలుగవచ్చును. పురుషులలో ఈ ఆలోచనలను తరిమికొట్టి, వారు నిత్యజీవితాన్ని పున:ప్రారంభించటానికే SIFF కాన్ఫిడేర్ అనే సంస్థను ప్రారంభించింది.

2011 లో ప్రారంభమైన కాన్ఫిడేర్ కార్యాలయంలోకి ఏ పురుషుడైనా తన సమస్యలతో రావచ్చును. తన భావోద్వేగాలను ప్రకటించకొనవచ్చును. నిపుణులు వీరికి సలహాలు సూచనలు అందిస్తారు.

విడాకులు సర్వసాధారణం అయిన నేటి పరిస్థితులలో వైవాహిక సమస్యలను ఎలా అధిగమించాలనే అంశాలపైన కాన్ఫిడేర్ పెళ్ళి చేసుకోబోయే యువకులని చైతన్యపరుస్తూ ఉంటుంది కూడా.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Polanki, Pallavi (17 July 2010). "Men Who Cry". OPEN. Archived from the original on 21 జూలై 2010. Retrieved 28 March 2013.
  2. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ వెబ్ సైటు