జస్లీన్ కౌర్ లైంగిక వేధింపుల ఉదంతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సరబ్జీత్ సింఘ్ అనే యువకుడు తనను లైంగికంగా వేధించాడని అతని పై జస్లీన్ కౌర్ అనే యువతి కేసులను వేసినది. ఆ యువతి సాంఘిక మాధ్యమాలలో ఛాయాచిత్రాలను అప్లోడ్ కూడా చేసినది. ఈ ఉదంతంలో సత్యాసత్యాలు కొంత కాలానికి గానీ బయట పడలేదు. నిజానికి సరబ్జీత్ తన మానాన తాను వెళుతూ ఉంటే, మొదటా జస్లీన్ యే అతనిని రెచ్చగొట్టినదని, దీనితో చనువు తీసుకొన్న సరబ్జీత్ యొక్క ఛాయాచిత్రాలను, వీడియోలను జస్లీన్ కౌర్ సాంఘిక మాధ్యమాలలో వక్రీకరించి చూపినదని తేలిటంతో యావత్ భారతదేశం అవాక్కయినది. సాంఘిక మాధ్యమాల దుర్వినియోగానికి జస్లీన్ కౌర్ ఉదంతం ఒక మచ్చు తునకగా నిలిచిపోయినది.

ఇవి కూడా చూడండి

[మార్చు]


మూలాలు

[మార్చు]