Jump to content

స్త్రీవాద వ్యతిరేకత

వికీపీడియా నుండి
మానవ హక్కులని కాపాడండి! స్త్రీవాదాన్ని ఆపండి!అని రూపొందించబడిన పోస్టరు

స్త్రీవాద వ్యతిరేకత (ఆంగ్లం: Antifeminism) అనగా ప్రపంచవ్యాప్తంగా స్త్రీవాదం పట్ల నెలకొన్న వ్యతిరేకత. వివిధ సమయాలలో వివిధ సంస్కృతులలో ఇది వివిధ రూపాలని సంతరించుకొన్నది. 18వ శతాబ్దపు అంతం, 19వ శతాబ్దపు ప్రారంభంలో స్త్రీ ఎన్నికలలో పాలుపంచుకోవటాన్ని నిరసించటం ఒక ఉదాహరణ కాగా, 20వ శతాబ్దంలో సమాన హక్కుల సవరణలని వ్యతిరేకించటం మరొక ఉదాహరణ. స్త్రీ హక్కుల పై సర్వసాధారణంగా నెలకొని ఉన్న విరోధ భావము దీనికి ఒక కారణం కాగా, పురుషాధిక్య ప్రపంచం, సంఘంలో స్త్రీ నిత్యం ఎదుర్కొనే ప్రతికూలతలు అసంబద్ధమైనవని, అతిశయోక్తిగా చెప్పబడుతున్నవని లేదా స్త్రీవాద ఉద్యమం పురుష ద్వేషాన్ని ప్రోత్సహిస్తుందని, పురుష జాతికి హాని తలపెడుతుందని లేదా పురుష జాతిని అణచివేస్తుందనే భావనలు నెలకొని ఉండటం మరొక కారణం.

పితా: రక్షతి కౌమారే
పతి రక్షతి యౌవనే
పుత్రో రక్షతి వార్ధక్యే
న స్త్రీ స్వాతంత్రమర్హతి
భావము: కౌమార దశ వరకు తండ్రి చే రక్షింపబడాలి, యౌవనంలో పతి చే రక్షింపబడాలి, వార్ధక్యంలో పుత్రులచే రక్షింపబడాలే కానీ; స్త్రీ స్వాతంత్రానికి అర్హురాలు కాదు

మనుస్మృతి

నిర్వచనం

[మార్చు]

స్త్రీవాద సామాజిక శాస్త్రవేత్త ఐన మైఖేల్ ఫ్లడ్ స్త్రీవాద వ్యతిరేక భావజాలం, తాను స్త్రీవాద సాధారణ సిద్ధాంతాలుగా పరిగణించే ఈ క్రింది మూడింటిలో కనీసం ఒక్కదానిని తిరస్కరిస్తుంది.

  1. స్త్రీ పురుషుల మధ్య సాంఘిక సర్దుబాట్లు సహజమైనవీ కావు, దైవనిర్ణయాలు కావు
  2. స్త్రీ పురుషుల మధ్య సాంఘిక సర్దుబాట్లు పురుషులకే అనుకూలంగా ఉన్నాయి
  3. ఈ సర్దుబాట్లని న్యాయబద్ధ సర్దుబాట్లుగా, సమాన సర్దుబాట్లుగా చేయటానికి, వీటిని స్థూలంగా మార్చివేయటానికి సమష్టి చర్యలు చేపట్టగలమని, చేపట్టాలని

పురుషుజాతి పై అధ్యాయనాలని చేసే మైఖేల్ కిమ్మెల్ స్త్రీవాద వ్యతిరేకతను "స్త్రీ సమాన హక్కుల వ్యతిరేకత"గా పేర్కొన్నాడు. స్త్రీవాద వ్యతిరేకులు -

  • స్త్రీలు బహిరంగ ప్రదేశాలకు రావటం
  • వారి వ్యక్తిగత స్వేచ్ఛని వారు పునర్నిర్వచించటం
  • వారి శరీర నియంత్రణ పై వారు హక్కులు కలిగి ఉండటం
  • వారి హక్కులను

- వ్యతిరేకిస్తారని తెలిపాడు.

మతపరమైన, సాంస్కృతిక కట్టుబాట్ల ఆధారంగా స్త్రీవాద వ్యతిరేకత వాదన నెలకొని ఉన్నదని, పుంసత్వం కలుషితం కాకుండా/దురాక్రమణకు గురి కాకుండా ఉండే కారణం వలనే స్త్రీవాద వ్యతిరేకతను తాము ముందుకు తీసుకెళుతున్నట్లు స్త్రీవాద వ్యతిరేక ప్రతిపాదితులు తెలుపుతారని మైఖేల్ కిమ్మెల్ తెలిపాడు. స్త్రీవాద వ్యతిరేకులు "సాంప్రదాయిక లింగభేదం సహజమైనది అని తప్పదని, బహుశా దైవమే ఈ విధంగా మంజూరు చేసినదేమో"నని అభిప్రాయపడతారని తెలిపాడు.

కెనడా కి చెందిన సామాజిక శాస్త్రవేత్తలు మెలిసా బ్లేయిస్, ఫ్రాన్సిస్ డుపయస్-డేరిలు స్త్రీవాద వ్యతిరేక ఆలోచన ప్రాథమికంగా పురుషవాదం యొక్క అతివాద రూపమని తెలిపారు. వీరి ప్రకారం స్త్రీవాద వ్యతిరేకత లో "సంఘంలో స్త్రీ పాత్రకి అధిక ప్రాముఖ్యతని ఇవ్వటంమే పురుషుల సంక్షోభానికి కారణమైనది" అనే భావన ఉంది. అయితే వీరే "సాంఘిక కోణంలో, సాంఘిక ఉద్యమాల కోణంలో, స్త్రీజాతి పై అధ్యయనాల కోణంలో స్త్రీవాద వ్యతిరేకత పై జరిగిన పరిశోధనలు చాలా తక్కువ" అని తెలిపారు. అంటే స్త్రీవాద వ్యతిరేకత యొక్క పరిపూర్ణ భావజాలాన్ని అర్థం చేసుకోవటం అనేది ఇంకా అసంపూర్ణంగానే మిగిలిపోయింది.

వ్యాఖ్యలు

[మార్చు]

స్త్రీ సంరక్షణ చట్టాల దుర్వినియోగానికి బలి అయిన రాజ్ పరా -

I am in favor of female empowerment, but I don't beleive that privileges of men should be taken away. Empowerment should be through job, education, employment opportunity and certain laws should be made gender neutral. We want people to understand that not all men are criminal. The prejudice against men should be cleared.
(నేను స్త్రీ సాధికారతకు సమర్థించేవాడినే, కానీ ఈ సాధికారత పురుషులకు ఉన్న సౌకర్యాలను హరించివేయాలి అనటాన్ని మాత్రం నమ్మను. సాధికారత ఉద్యోగం, విద్యాభ్యాసం, సమాన ఉద్యోగ హక్కులలో ఉండాలి. కొన్ని చట్టాలను లింగ వివక్ష లేనివిగా చేయాలి. పురుషులందరూ నేరస్థులు కారు అన్నది ప్రజలు అర్థం చేసుకోవటం మాకు కావాలి. పురుషులపై ఉన్న దురభిప్రాయాలు తొలగిపోవాలి.)

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలుగా పేర్కొనవలసిన లంకెలు

[మార్చు]