Jump to content

పెళ్ళాం పిచ్చోడు

వికీపీడియా నుండి
పెళ్ళాం పిచ్చోడు
దర్శకత్వంజొన్నవిత్తుల
రచనజొన్నవిత్తుల
నిర్మాతరాంపల్లి రామభద్రశాస్త్రి, బొగ్గారం వెంకటశ్రీనివాస్
తారాగణంరాజేంద్ర ప్రసాద్, సృజన
ఛాయాగ్రహణంటి. సురేంద్ర రెడ్డి
కూర్పుకె.రమేష్
సంగీతంరాజేంద్ర ప్రసాద్
నిర్మాణ
సంస్థ
శ్రీ గాయత్రి సినిమా
భాషతెలుగు

పెళ్ళాం పిచ్చోడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో 2005లో విడుదలైన తెలుగు హాస్యచిత్రం. ఇందులో రాజేంద్ర ప్రసాద్, రిచా, సృజన ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని రాంపల్లి రామభద్రశాస్త్రి, బొగ్గారం వెంకటశ్రీనివాస్ కలిసి శ్రీ గాయత్రి సినిమా పతాకంపై నిర్మించారు. ఈ చిత్రానికి కథానాయకుడు రాజేంద్రప్రసాద్ సంగీతాన్నందించడం విశేషం.[1]

కథానాయకుడు శ్రీనివాస్ ఓ చిట్ ఫండ్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. మాధవి అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఓ స్నేహితుడి సహకారంతో అబద్ధాలు చెప్పి ఆమెని నమ్మించి పెళ్ళి చేసుకుంటాడు. ఆమెను సంతోష పెట్టడానికి ఏ పని చేయడానికైనా వెనుకాడడు. పెళ్ళాంతో సహా కొత్త ఇంటికి మారతాడు. అక్కడ ముగ్గురు చుట్టుపక్కల వారు వీళ్ళని చూసి అసూయపడతారు. శీను పనిచేసేది కంపెనీలో గుమాస్తాగా అయినా భార్యకు తాను ఏజెంసీ నడుపుతున్నట్లు చెబుతుంటాడు. ఆమెకు విషయం తెలిసేలోగా అతను ఉద్యోగం మానేసి సొంత ఏజెన్సీ నడపాలని అనుకుంటూ ఉంటాడు. ఈ లోపుగా పీకల్లోరు అప్పుల్లో కూరుకుపోతాడు. దీంతో వారి వివాహ బంధం బీటలు వారుతుంది. ఈ లోపున శ్రీను చిన్ననాటి స్నేహితురాలు కనిపించి అతన్ని సమస్యల నుంచి బయటపడేసి అతను స్వంతంగా వ్యాపారం ప్రారంభించి తన కాళ్ళమీదతాను నిలబడేలా చేస్తుంది. దాంతో భార్యాభర్తల మధ్య మరింత అగాధం ఏర్పడుతుంది. చివరికి వారి జీవితం ఎలా చక్కబడిందన్నని మిగతా కథాంశం.

తారాగణం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Pellam Pichodu Telugu Full Movie | Rajendra Prasad, Richa, Srujana | #TeluguMovies - YouTube". www.youtube.com. Retrieved 2021-01-18.