వైజాగ్ ప్రసాద్
వైజాగ్ ప్రసాద్ | |
---|---|
జననం | కొర్లాం పార్వతీ వరప్రసాదరావు[1] గోపాలపట్నం, విశాఖపట్నం |
మరణం | అక్టోబర్ 21, 2018 |
వృత్తి | రంగస్థల, టీవి, సినీ నటుడు |
జీవిత భాగస్వామి | విద్యావతి |
పిల్లలు | రత్నప్రభ, రత్నకుమార్ |
వైజాగ్ ప్రసాద్ (కొర్లాం పార్వతీ వరప్రసాదరావు; మరణం: అక్టోబర్ 21, 2018) రంగస్థల, టీవి, సినీ నటుడు. ఎక్కువగా సహాయక పాత్రలు పోషిస్తుంటాడు. రంగస్థలం నుంచి వెండితెరకు వచ్చాడు. తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమాలో ఆయన పోషించిన కథానాయకుడి తండ్రి పాత్ర సినిమాలో పలు అవకాశాలను తెచ్చి పెట్టింది. 170కి పైగా సినిమాల్లో నటించాడు.
జీవితం
[మార్చు]ఈయన అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. విశాఖపట్నం లోని గోపాలపట్నం ఆయన స్వస్థలం. వైజాగ్ నుంచి వచ్చాడు కాబట్టి ఆయన పేరు వైజాగ్ ప్రసాద్ గా స్థిరపడిపోయింది. తండ్రి ఉపాధ్యాయుడు. తల్లిదండ్రులకు ముగ్గురు అమ్మాయిల తర్వాత నాలుగో సంతానంగా జన్మించాడీయన. ఈయనకు ఒక చెల్లెలు కూడా ఉంది. ఊహ తెలియక ముందే తల్లి కన్నుమూసింది. మేనమామ దగ్గరుండి ఎస్. ఎస్. ఎల్. సి దాకా చదువుకున్నాడు. చదువుకునే రోజుల్నుంచే నాటకాల్లో నటించేవాడు. నాటకాల పిచ్చితో అగ్రికల్చర్ బి. ఎస్. సి లో సీటు, ఎం. బి. బి. ఎస్ సీటు పోగొట్టుకున్నాడు. తర్వాత బి. ఎ. చదివాడు.
కుటుంబం
[మార్చు]ఆయన భార్య విద్యావతి. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. రత్నప్రభ, రత్నకుమార్. ఇద్దరూ కంప్యూటర్ ఇంజనీర్లు. అమ్మాయి అమెరికాలో నివాసం ఉండగా అబ్బాయి లండన్ లో ఉంటున్నాడు.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]1963లో నాటక రంగంలోకి ప్రవేశించిన ప్రసాద్ సుమారు 700 నాటికల్లో నటించాడు.
- అప్పు పత్రం
- భలే పెళ్లి
- భజంత్రీలు
- కాల ధర్మం
- ఆకలి రాజ్యం
- హెచ్చరిక
- వేట కుక్కలు
- కాలకూటం
- ఋత్విక్
- గరీబీ హఠావో
నటించిన చిత్రాలు
[మార్చు]వైజాగ్ ప్రసాద్ దాదాపు 170కి పైగా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. 1983 లో వచ్చిన బాబాయ్ అబ్బాయ్ నటుడిగా ఆయన మొదటి సినిమా. నువ్వు నేను చిత్రంలో ఆయన పోషించిన ధనవంతుడైన కథానాయకుడి తండ్రి పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది.[3] జై చిరంజీవ సినిమాలో కథానాయిక భూమిక తండ్రిగా చెప్పుకోదగ్గ పాత్రను పోషించాడు.
ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
- బాబాయ్ అబ్బాయ్ (1985)
- ప్రతిఘటన (1986)
- నీరాజనం (1989)
- సుందరకాండ (1992)
- ఛాంపియన్ (1992)
- ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరి (2002)
- నువ్వు నేను (2001)
- జెమిని (2002)
- నినుచూడక నేనుండలేను (2002)
- నీతోడు కావాలి (2002)
- మళ్ళీ మళ్ళీ చూడాలి (2002)
- శివరామరాజు (2002)
- అల్లరి రాముడు (2002)
- అనగనగా ఓ కుర్రాడు (2003)
- అప్పుడప్పుడు (2003)
- జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)
- జూనియర్స్ (2003)
- కేడి నెం.1 (2004)
- ఐతే ఏంటి (2004)
- గుడుంబా శంకర్ (2004)
- గౌరీ (2004)
- పెదబాబు (2004)
- అతనొక్కడే (2005)
- అలెక్స్ (2005)
- అల్లరి బుల్లోడు (2005)
- పొలిటికల్ రౌడీ (2005)
- భద్ర (2005)
- జై చిరంజీవ (2006)
- షాక్ (2006)
- ఫిట్టింగ్ మాస్టర్ (2009)
- హీరో (2008)
- బంగారు బాబు (2009)
- శుభప్రదం (2010)
- అత్తారింటికి దారేది (2013)
- మసాలా (2013)
- పిల్లా నువ్వు లేని జీవితం (2014)
- లెజెండ్ (2014)
- లయన్ (2015)
- పాకశాల (2016)
- రాణి గారి బంగళా (2016)
- లవర్స్ క్లబ్ (2017)
- ఇది మా ప్రేమకథ (2017)
- ఆఫీసర్ (2018)
- ఇది మా ప్రేమ కథ
మరణం
[మార్చు]గత కొతంకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రసాద్ హైదరాబాదులోని తన నివాసంలో 2018, అక్టోబర్ 21న ఉదయం 3 గంటలకు గుండెపోటుతో మరణించారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ పి, మధుసూదనాచారి. "సరదా కాస్త వ్యసనమైపోయింది". ఈనాడు.నెట్. ఈనాడు. Retrieved 31 October 2017.[permanent dead link]
- ↑ "మాస్టార్స్.కామ్ లో వైజాగ్ ప్రసాద్ ఫ్రొఫైలు". maastars.com. Archived from the original on 9 జూన్ 2017. Retrieved 31 October 2017.
- ↑ "వైజాగ్ ప్రసాద్". thetelugufilmnagar.com. Retrieved 31 October 2017.[permanent dead link]
- ↑ సాక్షి, హైదరాబాదు (21 October 2017). "ప్రముఖ నటుడు వైజాగ్ ప్రసాద్ కన్నుమూత". Archived from the original on 22 అక్టోబరు 2018. Retrieved 22 October 2017.