సుందరకాండ (1992 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుందరకాండ
దర్శకత్వంకె. రాఘవేంద్రరావు
రచనభాగ్యరాజా (కథ)
తారాగణంవెంకటేష్,
మీనా,
అపర్ణ
ఛాయాగ్రహణంకె. రవీంద్రబాబు
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1992
సినిమా నిడివి
148 ని.
దేశంభారతదేశం
భాషతెలుగు

సుందరకాండ వెంకటేష్ కథానాయకునిగా కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో 1992లో వచ్చిన చిత్రం. ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించాడు.

లెక్చరర్ ను ప్రేమించి ఒక అమ్మాయి కథ ఇది. ఇందులో వెంకటేష్ లెక్చరర్ గా నటించాడు.[1][2]

ఈ చిత్రం తమిళంలో కె. భాగ్యరాజా స్వీయదర్శకత్వంలో నటించిన సుందరకాండం అనే చిత్రానికి పునర్నిర్మాణం. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది.[3] ఈ చిత్రంలో వేటూరి రాసిన ఆకాశాన సూర్యుడుండడు తెల్లవారితే పాటకు నంది పురస్కారం లభించింది.

వెంకటేశ్వర్లు (వెంకటేష్) తను చదువుకున్న కళాశాలకే తెలుగు లెక్చరర్ గా పనిచేయడానికి వస్తాడు. అక్కడ రోజా (అపర్ణ) అనే అల్లరి పిల్ల తన స్నేహ బృందంతో కలిసి ఆట పట్టిస్తుంది. దాంతో వెంకటేశ్వర్లు ఆ అమ్మాయి ఏ పని చేసినా అందులో తప్పులు వెతుకుతుంటాడు. అయినా సరే రోజా మాత్రం అతన్ని ఆటపట్టించడం మానదు. ఒకరోజు అదే కళాశాలలో చాలా రోజుల నుంచీ చదువుతున్న తుకారాం (బ్రహ్మానందం) మరికొంత మంది విద్యార్థులతో కలిసి రోజా రాసినట్టుగా ఒక ప్రేమలేఖ రాసి అది వెంకటేశ్వర్లు బల్లలో దాస్తారు. వెంకటేశ్వర్లు రోజానే తప్పుపట్టి, మందలించి ఆ లేఖను ఆమెకు ఇచ్చేస్తాడు. కానీ రోజా మాత్రం ఆ లేఖను వెంకటేశ్వర్లే రాశాడని అతన్ని ఆరాధించడం మొదలు పెడుతుంది.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించాడు. వేటూరి రాసిన ఆకాశాన సూర్యుడుండడు తెల్లవారితే పాటకు నంది పురస్కారం లభించింది.[4]

  1. ఆకాశాన సూర్యుడుండడు తెల్లవారితే , రచన:వేటూరి , గానం. కె ఎస్ చిత్ర
  2. కోకిలమ్మ కొత్త , రచన వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  3. సుందరాకాండకు సందడే సందడి, రచన: వేటూరి, గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కె ఎస్ చిత్ర
  4. ఉలికి పడకు, రచన:వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  5. ఇంకా ఇంకా, రచన: వేటూరి , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  6. ఆకాశానికి,రచన: వెటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

[మార్చు]
  1. "Venkatesh in 'Sundarakanda' - Tollywood teachers who made a lasting impact on the audience". The Times of India. Retrieved 2020-08-13.
  2. "సినిమాల్లో ఉపాధ్యాయులుగా మెప్పించిన నటులు వీరే..! - Manalokam Telugu". Dailyhunt. Retrieved 2020-08-13.
  3. "వెంకటేష్@34 ఇయర్స్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ.. విక్టరీ హీరో కెరీర్‌‌‌లో టాప్ సినిమాలు." News18 Telugu. 2020-08-14. Retrieved 2020-08-28.
  4. "Nandi Awards - 1992 | Winners & Nominees". awardsandwinners.com. Retrieved 2020-08-28.