ఆకాశాన సూర్యుడుండడు సంధ్యవేళకి (పాట)
(ఆకాశాన సూర్యుడుండడు తెల్లవారితే నుండి దారిమార్పు చెందింది)
"ఆకాశాన సూర్యుడుండడు సంధ్యవేళకి" | |
---|---|
రచయిత | వేటూరి సుందరరామమూర్తి |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
సాహిత్యం | వేటూరి సుందరరామమూర్తి |
ప్రచురణ | సుందరకాండ (1992) |
రచింపబడిన ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
భాష | తెలుగు |
గాయకుడు/గాయని | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
రికార్డు చేసినవారు (స్టుడియో) | భాను ఆర్ట్ క్రియెషన్స్ |
చిత్రంలో ప్రదర్శించినవారు | దగ్గుబాటి వెంకటేష్, మీనా, అపర్ణ |
ఆకాశంలో సూర్యుడుండడు సంధ్యవేళకి పాట 1992లో విడుదలైన సుందరకాండ చిత్రంలోని పాట. ఈ పాట రాసినందుకు వేటూరి సుందరరామమూర్తి కి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడాడు.[1]
పాట నేపథ్యం
[మార్చు]కథానాయకుడు దగ్గర విద్య నేర్చుకున్న అమ్మాయి చనిపోయనపుడు, మరణం గురించి కథానాయకుడు పాడే సందర్భం.
పాటలోని సాహిత్యం
[మార్చు]పల్లవి:
ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే
చందమామకి రూపముండదు తెల్లవారితే
ఈ మజిలీ మూడు నాళ్ళే ఈ జీవయాత్రలో
ఒక పూటలొనె రాలు పూవులెన్నో
నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా
ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలె ఇక రోజాలా
కన్నీటి మీద నావసాగనేల IIనవ్వవేII
పురస్కారాలు
[మార్చు]- వేటూరి సుందరరామ్మూర్తి - ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారం, మనస్విని పురస్కారం - 1992.
మూలాలు
[మార్చు]- ↑ సితార, పాటల పల్లకి. "వాగ్దేవి వర పారిజాతాలు...వేటూరి గీతాలు". www.sitara.net. Archived from the original on 22 డిసెంబరు 2020. Retrieved 22 డిసెంబరు 2020.