లవర్స్ క్లబ్
స్వరూపం
లవర్స్ క్లబ్ | |
---|---|
దర్శకత్వం | ధృవ శంకర్ |
స్క్రీన్ ప్లే | ధృవ శంకర్ |
నిర్మాత | భరత్ అవ్వారి |
తారాగణం | అనీష్ చంద్ర పావని పూర్ణి వైజాగ్ ప్రసాద్ అజయ్ రత్నం |
ఛాయాగ్రహణం | డి.వి.ఎస్.ఎస్. ప్రకాష్ రావు |
కూర్పు | టి.నాగేంద్ర ప్రసాద్ |
సంగీతం | జరవి నిడమర్తి |
నిర్మాణ సంస్థలు | ప్లాన్ బి ఎంటర్‌టైన్‌మెంట్, శ్రేయ ఆర్ట్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 17 నవంబర్ 2017 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
లవర్స్ క్లబ్ 2017లో విడుదలైన తెలుగు సినిమా. ప్రవీణ్ గాలిపల్లి సమర్పణలో ప్లాన్ బి ఎంటర్‌టైన్‌మెంట్, శ్రేయ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై భరత్ అవ్వారి నిర్మించిన ఈ సినిమాకు ధృవ శంకర్ దర్శకత్వం వహించాడు.[1] అనీష్ చంద్ర, పావని, పూర్ణి, వైజాగ్ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 17న విడుదలైంది.
కథ
[మార్చు]రిషి భరద్వాజ్ (అనీష్ చంద్ర) లవర్స్ కోసం ‘లవర్స్ క్లబ్’ ను ఏర్పాటు చేసి వాళ్ళను కలుపుతుంటాడు. అలా అనుకోకుండా ఒకసారి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమార్తె వివాహం చేస్తాడు. తన కుమార్తెకు వేరే కులం వాడితో పెళ్లి చేశాడనే కోపంతో రిషి మీద పగ పెంచుకున్న ఆ అమ్మాయి తండ్రి రిషిపై పగ ఎలా తీర్చుకున్నాడు? తరువాత ఏమైంది అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులు
[మార్చు]- అనీష్ చంద్ర
- పావని
- పూర్ణి
- వైజాగ్ ప్రసాద్
- సిద్ధి
- అజయ్ రత్నం
- ధీరజ్ రత్నం
- చిత్రం బాషా
- ఇందు
- లక్ష్మి
- కళ్యాణ్
- ప్రభంజన్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ప్లాన్ బి ఎంటర్‌టైన్‌మెంట్, శ్రేయ ఆర్ట్ క్రియేషన్స్
- నిర్మాత: భరత్ అవ్వారి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ధృవ శంకర్
- సంగీతం: జరవి నిడమర్తి
- సినిమాటోగ్రఫీ: డి.వి.ఎస్.ఎస్. ప్రకాష్ రావు
- ఆర్ట్ డైరెక్టర్: టి.నాగేంద్ర ప్రసాద్
- ఎడిటింగ్; కిరణ్ రెడ్డి
- ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: మదన్ గంజికుంట, అవ్వారి ధను
- సహ నిర్మాతలు: నవీన్ పుష్పాల, శ్రీ చందన గాలిపల్లి
మూలాలు
[మార్చు]- ↑ Vaartha (9 January 2017). "లవర్స్ కి అండగా నిలబడే యువకుడి కథ!(లవర్స్ క్లబ్)". Archived from the original on 21 November 2021. Retrieved 21 November 2021.
- ↑ iDreamPost (25 November 2017). "లవర్స్ క్లబ్ రివ్యూ" (in ఇంగ్లీష్). Archived from the original on 21 November 2021. Retrieved 21 November 2021.