తోలుబొమ్మలాట (2019 సినిమా)
తోలుబొమ్మలాట | |
---|---|
దర్శకత్వం | విశ్వనాథ్ మాగంటి |
రచన | విశ్వనాథ్ మాగంటి (కథ/స్ర్కీన్ ప్లే/మాటలు) |
నిర్మాత | మాగంటి దుర్గా ప్రసాద్ |
తారాగణం | రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిశోర్ విశ్వంత్ దుద్దుంపూడి హర్షితా చౌదరి |
ఛాయాగ్రహణం | సతీష్ ముత్యాల |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వర రావు |
సంగీతం | సురేష్ బొబ్బిలి |
నిర్మాణ సంస్థ | సుమ దుర్గా క్రియేషన్స్[1] |
విడుదల తేదీ | 22 నవంబరు 2019 |
సినిమా నిడివి | 140 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తోలుబొమ్మలాట, 2019 నవంబరు 22న విడుదలైన తెలుగు సినిమా. సుమ దుర్గా క్రియేషన్స్[2] బ్యానరులో మాగంటి దుర్గా ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి విశ్వనాథ్ మాగంటి దర్శకత్వం వహించాడు.[3] ఇందులో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, విశ్వంత్ దుద్దుంపూడి, హర్షితా చౌదరి ప్రధాన పాత్రల్లో నటించగా,[4][5] సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చాడు.[6][7][8]
కథా నేపథ్యం
[మార్చు]సోమరాజు/సోడాల రాజు (రాజేంద్ర ప్రసాద్)కు ఒక గ్రామంలో ఎంతో గౌరవం ఉంటుంది. అతను గ్రామస్తులతో కలిసి తన సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు. అతని కుమారుడు మురళి (దేవి ప్రసాద్), కుమార్తె జానకి (కల్పన) అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి చూసి వెలుతుంటారు. మనవడు రుషి (విశ్వం దుద్దంపూడి), మనవరాలు వర్ష (హర్షిత) ప్రేమ విషయం గురించి సోమరాజుకు చెప్పి, పెళ్ళి చేసే బాధ్యతను అతనికి అప్పగిస్తారు. సోమరాజు తన పిల్లలను ఒప్పిస్తాడు. అనుకోకుండా, ఆస్తి కోసం పెద్దల మధ్య జరిగిన గొడవలో సోమరాజు చనిపోతాడు. సోమరాజు ఆత్మ 12వ రోజు వేడుక పూర్తయ్యే వరకు వారి చుట్టూ తిరుగుతూ, తన కుటుంబ సభ్యుల నిజ స్వరూపాన్ని చూసి నిరాశకు లోనవుతుంది. ఆ సమయంలో, సోమరాజు తన దూరపు బంధువు సంతోష్ (వెన్నెల కిషోర్) కలుస్తాడు. సంతోష్ కు ఆత్మలతో మాట్లాడే శక్తి ఉంటుంది. తన సహకారంతో, సోమరాజు పథకం చేస్తాడు. దాని ద్వారా కుటుంబంలో ఉన్న అసమ్మతిని, రిషి-వర్ష మధ్య విభేదాలను తొలగిస్తాడు. 12వ రోజు తరువాత సోమరాజు ఆత్మ వెళ్ళిపోతుంది.
నటవర్గం
[మార్చు]- రాజేంద్ర ప్రసాద్ (సోమరాజు/సోడాల రాజు)
- వెన్నెల కిశోర్ (సంతోష్)
- విశ్వంత్ దుడ్డుంపూడి (రుషి)
- హర్షిత చౌదరి (వర్ష)
- చలపతిరావు (రంగ)
- ప్రసాద్ బాబు (సోమరాజు స్నేహితుడు)
- నారాయణరావు (చంద్రం)
- తాగుబోతు రమేష్ (ఆత్మారాం)
- ధన్రాజ్ (కొత్తెం)
- దేవీ ప్రసాద్ (సోమరాజు కుమారుడు మురళి)
- నారా శ్రీనివాస్ (సోమరాజు అల్లుడు)
- పూజా రామచంద్రన్ (భావన)
- సంగీత (సోమరాజు సోదరి)
- కల్పన (సోమరాజు కుమార్తె జానకి)
- శిరీష సౌగంధ్ (సోమరాజు అల్లుడు)
పాటలు
[మార్చు]Untitled | |
---|---|
ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చగా, పాటలను చైతన్య ప్రసాద్ రాశాడు. ఆదిత్యా మ్యూజిక్ కంపెనీ ద్వారా సంగీతం విడుదల చేయబడింది.[9]
సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "గొప్పదిరా మనిషి పుట్టుక" | విజయ్ యేసుదాస్ | 4:19 |
2. | "మనసా మనసా (మేల్ వర్షన్)" | సిద్ శ్రీరామ్ | 3:14 |
3. | "ఆకాశమా" | హేమచంద్ర | 3:58 |
4. | "మనసా మనసా (ఫిమేల్ వర్షన్)" | చిన్మయి | 3:13 |
5. | "నీతో పోటి పడుతూ" | యాజిన్ నిజార్ | 2:56 |
6. | "మనసారా మనసారా (డ్యూయెట్)" | సిద్ శ్రీరామ్, చిన్మయి | 3:12 |
7. | "ఎన్నెన్నో అందాలు" | అనురాగ్ కులకర్ణి | 3:54 |
మొత్తం నిడివి: | 19:50 |
మూలాలు
[మార్చు]- ↑ Chowdhary, Y Sunita (22 November 2019). "Tholu Bommalata' movie review: Heart-warming and entertaining". The Hindu. Retrieved 17 February 2021.
- ↑ "Tholu Bommalata – Old School Emotions". 123 telugu.com. Retrieved 17 February 2021.
- ↑ "Tholu Bommalata (Director)". indiaglitz. Retrieved 17 February 2021.
- ↑ "Tholu Bommalata (Overview)". Filmibeat. Retrieved 17 February 2021.
- ↑ "Tholu Bommalata Review – A Very Sincere But Boring Attempt". Mirchi9.com. Retrieved 17 February 2021.
- ↑ "Tholu Bommalata (Music)". Tollywood.Net. Archived from the original on 22 డిసెంబర్ 2019. Retrieved 17 February 2021.
{{cite web}}
: Check date values in:|archive-date=
(help) - ↑ "తోలుబొమ్మలాట మూవీ రివ్యూ". The Times of India. Retrieved 17 February 2021.
- ↑ "'తోలుబొమ్మలాట' మూవీ రివ్యూ". Sakshi.com. Retrieved 17 February 2021.
- ↑ "Tholu Bommalata (Songs)". gaana.com. Retrieved 17 February 2021.
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- Articles using infobox templates with no data rows
- Album articles lacking alt text for covers
- Pages using infobox album with empty type parameter
- Pages using infobox album with unknown parameters
- 2019 తెలుగు సినిమాలు
- రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలు
- చలపతి రావు నటించిన సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు