మేడమ్ (సినిమా)

వికీపీడియా నుండి
(మేడమ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మేడమ్
Madam (1994 film).jpg
దర్శకత్వంసింగీతం శ్రీనివాసరావు
రచనసింగీతం శ్రీనివాసరావు (కథ, స్క్రీన్ ప్లే), ఎం. వి. ఎస్. ఎస్. బాబూ రావు (మాటలు)
నిర్మాతఎం. చిట్టిబాబు, జి. జ్ఞానం హరీష్, రాజేంద్ర ప్రసాద్ (సమర్పణ)
నటవర్గంరాజేంద్ర ప్రసాద్,
సౌందర్య
ఛాయాగ్రహణంవి. సురేష్
కూర్పుత్రినాథ్
సంగీతంమాధవపెద్ది సురేష్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీలు
1994 జూలై 9 (1994-19-09)
భాషతెలుగు

మేడమ్ 1994 లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో రాజేంద్రప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రలు పోషించారు. రాజేంద్రప్రసాద్ ఇందులో ప్రయోగాత్మకంగా ఓ మహిళ పాత్రలో నటించాడు. ఈ పాత్రకు గాను రాజేంద్రప్రసాద్ 1994 లో నంది ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకున్నాడు.[2]

కథ[మార్చు]

ప్రసాద్ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్. అతని స్నేహితుడు బాబీ. బాబీ కల్పన అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆమె ప్రసాద్ ని ప్రేమిస్తుంది. కానీ ఈ విషయం వీరిద్దరికీ తెలియక కల్పన సోదరుడైన మేజర్ చంద్రకాంత్ దగ్గరకు పెళ్ళి ప్రస్తావన తెస్తారు. బాబీ తన నాన్నమ్మ శారదాదేవికి ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను చూడటానికి వెళతాడు. ఆమె తాను చనిపోయేలోపు మనవడు పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిని చూడాలని చెబుతుంది. వెంటనే ప్రసాద్ కల్పనను తీసుకురావడానికి వెళ్ళి ఆమె తనని ప్రేమిస్తుందనే నిజాన్ని తెలుసుకుంటాడు. కానీ చండశాసనుడైన ఆమె అన్నకు భయపడి తనను ప్రేమిస్తున్నదీ, పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నదీ బాబీ అని చెప్పడు. శారదాదేవి కోసం బాబీని పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిగా సరోజిని అనే మారువేషంలో వెళతాడు ప్రసాద్. కానీ విచిత్రంగా సరోజినిని చూడగానే ఆమె ఆరోగ్యం మెరుగవుతుంది. శారదాదేవి ఆమెను తన పక్కనే ఉంచుకోవాలనుకుంటుంది. సరోజినిని తనకు తెలిసిన కళాశాలలో లెక్చరర్ గా నియమిస్తుంది. ప్రసాద్ అక్కడ సౌందర్య అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. అందుకోసం ప్రసాద్ రెండు పాత్రలు పోషిస్తూ సౌందర్య కూడా తనను ప్రేమించుకునేలా చేసుకుంటాడు.

కొన్ని సంఘటనల తర్వాత సరోజిని ఒక సామాజిక కార్యకర్తగా మారవలిసి వస్తుంది. ఆమె మేడం అనే పేరుతో అందరికీ చిరపరిచితం అవుతుంది. ఒకసారి కల్పన నుంచి తప్పించుకోవడానికి మందాకిని అనే ఆధునిక యువతి వేషంలో ఉండగా వృద్ధ ఫోటోగ్రాఫర్ ఆమెను చూసి ప్రేమలో పడతాడు.

తారాగణం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Madam (1994)". gomolo.com. Archived from the original on 24 June 2016. Retrieved 23 October 2016.
  2. "King of Comedy Heroes". cineoutlook.com. Archived from the original on 27 October 2016. Retrieved 23 October 2016.

బయటి లింకులు[మార్చు]