ఆ నలుగురు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆ నలుగురు
(2004 తెలుగు సినిమా)
TeluguFilmWallpaper AaNaluguru 2004.jpg
దర్శకత్వం చంద్ర సిద్ధార్థ
నిర్మాణం సరిత పట్రా
కథ మదన్
చిత్రానువాదం మదన్, చంద్ర సిద్ధార్థ
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
సుత్తివేలు,
ఆమని,
కోట శ్రీనివాసరావు,
శుభలేఖ సుధాకర్,
రాజా
సంగీతం ఆర్ పి పట్నాయక్
సంభాషణలు మదన్
ఛాయాగ్రహణం సురేంద్ర రెడ్డి
కూర్పు గిరీష్ లోకేశ్
నిర్మాణ సంస్థ ప్రేమ్ మూవీస్
విడుదల తేదీ డిసెంబర్ 9,2004
భాష తెలుగు

ఆ నలుగురు అనేది 2004లో వచ్చిన ఓ తెలుగు సినిమా. మంచి కథా బలంతో నిర్మించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ నటన అపూర్వం. మనం ఎంత బాగా జీవించినా, ఎంత ధనం సంపాదించినా మనకు కావలసింది ఆ నలుగురు మనుషులే అనే మూల సిద్ధాంతం మీద తీసిన నంది ఉత్తమ చిత్రం ఇది.

కథ[మార్చు]

పరుల సేవయే పరమార్థంగా భావించే రఘురాం (రాజేంద్ర ప్రసాద్), అనే పత్రికా సంపాదకుడి కథ ఇది. రఘురాం చనిపోయిన తరువాత అతని ప్రాణాలు తీసుకొని పోవడానికి యమ కింకరులు (చలపతి రావు, రఘు బాబు) రావడంతో కథ ప్రారంభమవుతుంది. తను చనిపోయిన తరువాత తన కోసం కుటుంబ సభ్యులు ఎలా బాధ పడతారో చూడాలని ఆ యమ కింకరులను వేడుకుంటాడు. తన శవం పట్ల అతని కన్న బిడ్డలే చూపిన నిర్లక్ష్యం పట్ల యమకింకరులు అతన్ని హేళన చేస్తారు. కానీ బతికి ఉన్నపుడు ఎంతో మందికి సహాయం చేసిన రఘురాంకు నివాళులు అర్పించేందుకు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చిన జనాన్ని చూసి వారు ఆశ్చర్యపోతారు. అతని దగ్గర సహాయం పొందిన వారు అతని కొడుకులకు కూడా బుద్ది చెపుతారు. అప్పుడు రఘురాంకు తనతో పాటు ఉన్న వారు యమ కింకరులు కారనీ, ప్రశాంతత చెందిన మనస్సుతో చూస్తే వారు దేవదూతలౌతారని తెలుసుకుంటాడు. ఆ దేవ దూతలు రఘురాంను స్వర్గానికి కొనిపోవడంతో కథ ముగుస్తుంది.

అవార్డులు[మార్చు]

  • 2004 - ఉత్తమ చిత్రం - నంది అవార్డు
  • రాజేంద్ర ప్రసాద్ (రఘురామయ్య)- ఉత్తమ నటుడు - నంది అవార్డు
  • కోట శ్రీనివాసరావు (కోటయ్య) - ఉత్తమ Character Actor]]

పాటలు[మార్చు]

  • ఇంకో రోజొచ్చిందండి - బాలు, బాలాజీ - రచన: చైతన్య ప్రసాద్
  • ఒక్కడై రావడం - బాలు - రచన: చైతన్య ప్రసాద్
  • గుండెపై తన్నుతూ - బాలు, ఆర్.పి.పట్నాయక్, ఉష - రచన: చైతన్య ప్రసాద్
  • నలుగురూ మెచ్చిన - బాలు - రచన: చైతన్య ప్రసాద్
  • గుడ్ మార్నింగ్ - వాద్యగానం
  • విష్ యు హేపీ మ్యారీడ్ లైఫ్ - వాద్యగానం

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఆ_నలుగురు&oldid=1451672" నుండి వెలికితీశారు