ఎటాక్ (2016 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎటాక్
ఎటాక్ సినిమా పోస్టర్
దర్శకత్వంరామ్ గోపాల్ వర్మ
రచనరామ్ గోపాల్ వర్మ
స్క్రీన్ ప్లేరామ్ గోపాల్ వర్మ
కథసమీర్ చంద్ర
నిర్మాతసి. కళ్యాణ్
తారాగణంమంచు మనోజ్ కుమార్
జగపతిబాబు
సురభి
ప్రకాష్ రాజ్
వడ్డే నవీన్
ఛాయాగ్రహణంఅంజి
కూర్పుఅన్వర్ ఆలీ
సంగీతంరవి శంకర్
నిర్మాణ
సంస్థ
సి.కె. ఎంటర్టైన్మెంట్స్
పంపిణీదార్లుసుభా శ్వేత ఫిల్మ్స్
విడుదల తేదీ
1 ఏప్రిల్ 2016 (2016-04-01)
సినిమా నిడివి
107 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ఎటాక్ 2016, ఏప్రిల్ 1న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] సి. కళ్యాణ్ నిర్మాణ సారథ్యంలో రామ్ గోపాల్ వర్మ[2] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మనోజ్ కుమార్, జగపతిబాబు, సురభి, ప్రకాష్ రాజ్, వడ్డే నవీన్ తదితరులు నటించగా,[3] రవిశంకర్ సంగీతం అందించాడు.

కథా సారాంశం

[మార్చు]

గురు రాజ్ (ప్రకాశ్ రాజ్) తను చేస్తున్న దందాలు మానేసి మంచిగా బ్రతకాలనుకొని, గతాన్ని వదిలి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. గురు ముగ్గురు కొడుకులు కాళి (జగపతి బాబు), గోపి (వడ్డె నవీన్), రాధ (మంచు మనోజ్) ఎవరికి వారుగా బ్రతికేస్తుంటారు. అదే సమయంలో పాత కక్ష్యల నేపథ్యంలో గురు దారుణ హత్యకు గురౌతాడు. తండ్రి హత్య వెనుక ఉన్న వ్యక్తులు కనుక్కునే క్రమంలో కాళి కూడా హత్య చేయబడుతాడు. ఈ హత్యలకు గల కారణాలు ఏంటి, సత్తూ (అభిమన్యుసింగ్) కు గురుకి ఉన్న సంబంధం ఏంటి, ఈ హత్య మిస్టరీను రాధా ఎలా కనుక్కున్నాడు అనేది మిగతా కథ.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
 • రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
 • నిర్మాత: సి. కళ్యాణ్
 • కథ: సమీర్ చంద్ర
 • సంగీతం: రవి శంకర్
 • ఛాయాగ్రహణం: అంజి
 • కూర్పు: అన్వర్ ఆలీ
 • నిర్మాణ సంస్థ: సి.కె. ఎంటర్టైన్మెంట్స్
 • పంపిణీదారు: సుభా శ్వేత ఫిల్మ్స్

పాటలు

[మార్చు]
ఎటాక్
సినిమా by
రవి శంకర్
Released22 మార్చి 2016 (2016-03-22)
Recorded2015
Genreపాటలు
Length26:05
Languageతెలుగు
Labelలహరి మ్యాజిక్
Producerరవి శంకర్

ఈ చిత్రంలోని పాటలను సిరాశ్రీ రాయగా, రవి శంకర్ సంగీతం అందించాడు. లహరి మ్యాజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[4]

పాటల జాబితా
సం.పాటపాటల జాబితాపాట నిడివి
1."చావదురా పగ"రాంకీ, ఉమా నేహ4:28
2."ధర్మరాజు ఓడొద్దని"స్వరాగ్, సాయిచరణ్5:22
3."నాయన్ని అడుగులా"స్వరాగ్, కీర్తన్2:47
4."రక్తపు చుక్కలు"స్వరాగ్5:09
5."ప్రభుం ప్రాణనాథం"శ్రీకాంత్, స్వరాగ్, సాయిచరణ్3:08
6."ధర్మరాజు ఓడొద్దని (రిమిక్స్)"ఉమా నేహ, స్వరాగ్, సాయిచరణ్5:11
మొత్తం నిడివి:26:05

నిర్మాణం

[మార్చు]

చిత్రీకరణ

[మార్చు]

ఈ చిత్రం 2015, ఫిబ్రవరి 20న అధికారికంగా ప్రారంభించబడింది. మరుసటి రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.[5] ఈ చిత్రంలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను హైదరాబాదులోని ఒక ఆర్.టి.ఓ. కార్యాలయంలో చిత్రీకరించారు.[1]

నటీనటులు ఎంపిక

[మార్చు]

1993లో వచ్చిన గాయం సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మతో జగపతి బాబు చేస్తున్న రెండవ సినిమా ఇది.[5] మనోజ్ కు వర్మతో ఇది తొలిచిత్రం కాగా, జగపతి బాబుతో కరెంట్ తీగ తరువాత ఇది రెండవ సినిమా.[2] వడ్డే నవీన్ ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషించాడు.[6] బీరువా సినిమాలో నటించిన సురభి ఈ చిత్రంలో ప్రధానపాత్రలో నటించింది.[3]

విడుదల

[మార్చు]

2015, మే 30న ఈ చిత్ర మొదటి మోషన్ పోస్టర్ విడుదలయింది.[7] 2015, మే 31న థియేట్రికల్ ట్రైలర్ విడుదలయింది.[8] 2016, ఏప్రిల్ 1న ఈ చిత్రం విడుదలయింది.[9]

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 "Manoj attacks an RTO office". 123telugu.com. Retrieved 10 January 2020.
 2. 2.0 2.1 "RGV-Jagapati Babu team up for 'Golusu'". 123telugu.com. Archived from the original on 30 September 2017. Retrieved 10 January 2020.
 3. 3.0 3.1 "Heroine confirmed for RGV-Manoj's 'Golusu'". telugunow.com. Archived from the original on 4 March 2016. Retrieved 10 January 2020.
 4. "Attack (Music)". AtoZ3.com. Archived from the original on 2016-08-02. Retrieved 2019-12-29.
 5. 5.0 5.1 "Jagapati Babu enters Varma compound from today". aptoday.com. 20 February 2015. Archived from the original on 7 October 2015. Retrieved 10 January 2020.
 6. "Vadde Naveen makes a comeback". 123telugu.com. Retrieved 10 January 2020.
 7. "Attack Motion Poster Released- Manoj, RGV". Newsonway.com. Archived from the original on 31 మే 2015. Retrieved 10 జనవరి 2020.
 8. "RGV Attack Theatrical trailer released- Manoj". Newsonway.com. Archived from the original on 31 మే 2015. Retrieved 10 జనవరి 2020.
 9. "'ఎటాక్‌' చేయడానికి సిద్ధమయ్యారు" (in Telugu). Eenadu. Archived from the original on 20 మార్చి 2016. Retrieved 10 జనవరి 2020.{{cite web}}: CS1 maint: unrecognized language (link)

ఇతర లంకెలు

[మార్చు]