గాయం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Minor abrasion injury.

గాయం (Injury) అనగా దెబ్బలు తగలడం.

  • శారీరక గాయము : శరీరానికి బయట వస్తువుల నుండి తగిలే దెబ్బలు వలన చర్మము చిట్లడమో, కమిలిపోవడమో , వాయడమో, గీక్కుపోవడమో జరిగితే దాన్ని గాయమందుము. గాయము కర్రతో కొట్టినందువలన, ముళ్ళు గుచ్చునందువలన, పళ్ళతో కొరికినందువలన, నిప్పుతో కాలినందువలన, సల్ఫూరిక్ ఆమ్లము, జిల్లేడు పాలు వంటి రసాయనాలు వలన, ఇలా ఎన్నో విదములుగా జరుగవచ్చును.

గాయమైనచోట ఇన్ఫ్లమేషన్ కి గురియై 1. వాపు , 2. ఎరుపెక్కడం , 3. ఉష్ణోగ్రత పెరగడం , 4. నొప్పి గా ఉండడం , 5. ఆ భాగము పనిచేయకపోవడం అనేవి జరుగుతాయి .

రకాలు[మార్చు]

శారీరక గాయాలు[మార్చు]

  • బ్రూయీ - : చర్మము క్రింద రక్తము గూడికట్టి గీక్కు పోయేలా ఉండే గాయము .
  • గంటు : పదునైన కత్తి, బ్లేడు వంటి వాటితో కోసుకుపోవడము. రక్తము ఎక్కువగా కారును .
  • బొబ్బలు : మండే వస్తువు వలన కాలిపోయి చర్మము ఉబ్బి నీరుచేరడము.
  • బెణుకు : కొన్ని సమయాలలో నడిచేటపుడు ఒడుదుడుకులు గా అడుగులు వేయడము వలన కీళ్ళలోని లిగమెంట్స్ సాగిపోవడము జరిగి వాపు , నొప్పి వచ్చుట.

ఒక్కొక్కసారి గాయము వలన ప్రాణాపాయము కలుగవచ్చును. మనిషికి గాయాలు మనుషులు, జంతువులు, పక్షులు, ప్రమాదాలు, వలన కలుగును. ఉపశయము చేయుట ప్రధమ చికిత్స లో చూడండి.

గాయం మానడం[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గాయం&oldid=1177109" నుండి వెలికితీశారు