పెళ్ళైనకొత్తలో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెళ్ళైనకొత్తలో
(2006 తెలుగు సినిమా)
Pellaina Kothalo.jpg
దర్శకత్వం మదన్
నిర్మాణం మదన్
రచన మదన్
తారాగణం జగపతిబాబు,
ప్రియమణి,
ఆస్థా సింఘాల్,
కోట శ్రీనివాసరావు,
ఝాన్సీ (నటి),
బ్రహ్మానందం,
సునీల్,
ఆలీ,
ఎమ్మెస్ నారాయణ,
ధర్మవరపు సుబ్రహ్మణ్యం,
వేణుమాధవ్,
ఆహుతి ప్రసాద్,
కృష్ణ భగవాన్
సంగీతం అగస్త్య
ఛాయాగ్రహణం సురేంద్రరెడ్డి
భాష తెలుగు

పెళ్ళైన కొత్తలో 2006లో మదన్ దర్శకత్వంలో విడుదలైన సినిమా.

కథాగమనం[మార్చు]

ఈ సినిమాలో కథ చాలా సింపుల్. అలాగే ప్రస్తుతం బర్నింగ్ ప్రాబ్లం కూడా. ఈ రోజుల్లో పెళ్ళి చేసుకొనే యువ జంటల్లో సగం మంది కొట్టుకొంటూ తిట్టుకొంటూ కాపురాలు చేసుకొంటున్నారు. మిగిలిన సగం మంది విడాకులు తీసుకొని విడిపోతున్నారు. వీరిలో ఎక్కువగా చదువుకొని ఉద్యోగం చేసుకొంటూ సంపాదించుకొంటున్న సాప్ట్ వేర్ ఇంజనీర్లు. ఈ పాయింటు మీదే ఆధారపడి నిర్మించబడినదీ చిత్రం. వీరమాచనేని హరి {జగపతిబాబు} ముంబాయిలో పని చేస్తూ హైదరాబాదుకు ట్రాన్సఫర్ అవుతాడు. ఒక సెల్ ఫోన్ కంపెనీలో కస్టమర్ కేర్ లో పనిచేస్తుంటుంది లక్ష్మి {ప్రియమణి} . ఈమెను అంతా లక్కీ అని పిలుస్తారు. ఈమెకు ఝాన్సీ {ఝాన్సీ} అనే స్నేహితురాలు ఉంటుంది. లక్ష్మి తనకు ఏంకావాలన్నా ఝాన్సీ మీదే ఆదారపడి ఉంటుంది. ఝాన్సీ తన భర్త సునీల్ ను బానిసగా చూస్తుంటుంది. అలాగే హరిని అతని స్నేహితుడు కృష్ణ భగవాన్ గైడ్ చేస్తుంటాడు. అతడు కూడా తన భార్యను బానిసలా చూస్తుంటాడు. హరి, లక్ష్మీ ఇద్దరూ ఒక రెస్టారెంటులో కాఫీ తాగుతుండగా వాళ్ళిద్దరకూ ఒకరికి తెలియకుండా ఒకరికి వాళ్ళిద్దరూ రాసినట్లుగా లవ్ లెటర్స్ రాసి వారు చదివేలా అందచేస్తారు ఒక టీవీ ఛానల్లో క్రియేటివిటీ ప్రోగ్రాములు చేసే ఆలీ & ట్రూప్. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అపార్దం చేసుకొని తిట్టుకొంటుంటే అదంతా షూట్ చేస్తుంటాడు. తరువాత నిజ తెలుసుకొని ఆలీని ఇద్దరూ కలసి కొడతారు. ఒకరోజు హరి పెళ్ళి చూపులకు వెళ్ళగా అక్కడ పెళ్ళికూతురుగా లక్ష్మి ఉంటుంది. ఇద్దరికీ పెళ్ళవుతుంది. అటు నుండి హరికి కృష్ణభగవాన్ మొగుడు పెళ్ళాన్ని అదుపులో పెట్టాలని, లక్ష్మికి ఝాన్సీ పెళ్ళాం మొగుడిని తన అదుపాజ్ఞలలో పెట్తుకోవాలనీ హితబోధ చేస్తుంటారు. దాంతో హరి లక్ష్మిల తొలిరాత్రి జరగదు. వారి కాపురంలో కలతలు మొదలవుతాయి. దాంతో ఇద్దరూ విడిపోదామనుకొంటారు. ఆ సమయంలో హరి తలిదండ్రులు కొత్త కాపురాన్ని చూసేందుకు వస్తారు. వారికి అనుమానం కలగకుండా ఉండటానికి ప్రయత్నించినా అనుమానం కలుగుతుంది హరి తలిదండ్రులకు. దాంతో వారు హరి తాతయ్య { కోట శ్రీనివాసరావు} తో విషయం చెపుతారు. తనకు గుండెపోటు వచ్చినట్టుగా నాటకమాడి మనవడినీ వాడి పెళ్ళాన్నీ అర్జంటుగా చూడాలని ఉందని పిలుపించుకొంటాడు హరి తాతయ్య. అటునుండి వాళ్ళను కొద్ది రోజులు తనతో ఉండమని తన భార్యతో కలసి మనవడినీ అతని పెళ్ళాన్ని రకరకాల వ్రతాలతోనూ, కొన్ని నాటకీయంగా సృష్టించిన సంధర్భాలతోనూ వాళ్ళిద్దర్కీ దాంపత్యం, పెళ్ళి, సంసారం ఆలుమగల బాందవ్యాల యొక్క గొప్పతనం తెలియచేసే ప్రయత్నం చేసి విజయం సాధిస్తారు. వారిరువురి మధ్య మళ్ళీ విడాకుల ప్రస్తావనే రాదనేంతగా వారిద్దరిలో మార్పు కలిగేలా చేస్తారు.

తారాగణం[మార్చు]

 • జగపతి బాబు
 • ప్రియమణి
 • కోట శ్రీనివాస రావు
 • గీతాంజలి
 • ఆహుతి ప్రసాద్
 • వేణు మాధవ్
 • కృష్ణ భగవాన్
 • ఎం. ఎస్. నారాయణ
 • ఝాన్సీ
 • సునీల్
 • ఆలీ
 • రాజు సుందరం
 • ఆస్థా సింఘాల్

చిత్ర విశేషాలు[మార్చు]

 • చిత్ర సీమలో అరంగేట్రం చేస్తూనే దర్శకత్వం,నిర్మాణం,రచన,చిత్రానువాదం అన్నిటినీ నిర్వహించాడు మదన్.

మూలాలు[మార్చు]