చైతన్య కృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చైతన్య కృష్ణ ఒక వర్ధమాన తెలుగు సినీనటుడు. తెలుగు, తమిళ సినిమాలలో నటించాడు.[1] సినిమాల్లో నటించక మునుపు కొన్ని లఘు చిత్రాల్లో నటించాడు.[2] శ్రీను పాండ్రంకి దర్శకత్వంలో చైతన్య నటించిన పీక్-ఎ-బూ అనే లఘుచిత్రం 2014 లో కేన్స్ లఘుచిత్ర ప్రదర్శనకు ఎంపికైంది.

జీవిత విశేషాలు

[మార్చు]

చైతన్య కృష్ణ భీమవరం లోని ఎస్.ఆర్.కె.ఆర్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తరువాత కొద్ది రోజులు ఓ కంపెనీలో సాఫ్ట్ వేరు ఇంజనీరుగా పనిచేశాడు. నటన మీద ఆసక్తితో ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఈటీవీ నిర్వహిస్తున్న ఢీ అనే డ్యాన్స్ కార్యక్రమం మొదటి సంచికలో పాల్గొన్నాడు.

కెరీర్

[మార్చు]

2009 లో నిన్ను కలిశాక అనే సినిమాతో అతని సినీ రంగప్రవేశం జరిగింది. తరువాత అలా మొదలైంది, స్నేహగీతం, లాంటి సినిమాలలో అవకాశం వచ్చింది.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం శీర్షిక పాత్ర భాష
2009 నిన్ను కలిశాక చందు తెలుగు
2010 స్నేహగీతం కృష్ణ తెలుగు
2010 అది నువ్వే రవి తెలుగు
2011 రౌదిరం తమిళం
2011 అలా మొదలైంది దీపక్ తెలుగు
2012 వెన్నెల 1 1/2 కృష్ణ తెలుగు
2013 కాళిచరణ్ కాళిచరణ్ తెలుగు
2014 చందమామ కథలు రఘు తెలుగు
2014 దృశ్యం రాజేష్ తెలుగు
2014 చక్కిలిగింత రాహుల్ తెలుగు
2015 లేడీస్ అండ్ జెంటిల్మన్ కృష్ణమూర్తి తెలుగు
2015 కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ తెలుగు
2015 S/O సత్యమూర్తి తెలుగు
2015 భలే మంచి రోజు తెలుగు
2016 నేను శైలజ తెలుగు
2016 గరం తెలుగు
2016 ప్రేమమ్ తెలుగు
2017 కాటమరాయుడు కాటమరాయుడి తమ్ముడు తెలుగు
2018 బ్లఫ్ మాస్టర్ నందు తెలుగు
2020 జోహార్ విజయ్ వర్మ తెలుగు
2021 చెక్ తెలుగు

వెబ్ సిరీస్

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Review on an app". thehindu.com. Retrieved 16 September 2016.
  2. సునీతా చౌదరి, వై. "Trailblazers". thehindu.com. కస్తూరి అండ్ సన్. Retrieved 16 September 2016.

బయటి లింకులు

[మార్చు]