Jump to content

శ్రీను పాండ్రంకి

వికీపీడియా నుండి


శ్రీను పాండ్రంకి
జననం
శ్రీను పాండ్రంకి

(1987-10-05) 1987 అక్టోబరు 5 (వయసు 37)
వృత్తిసినీ దర్శకుడు, రచయిత

శ్రీను పాండ్రంకి నవలా రచయిత, సినీ దర్శకుడు. అతడు ఇంగ్లీష్ లో క్రైమ్ మిస్టరీ నవల రాయగా తెలుగులో కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా నవల నిజంగా నేనేనా రాశారు. ఆయన ఇప్పటి వరకు ముప్పైకి పైగా లఘు చిత్రాలు దర్శకత్వం వహించారు. చాలా చిత్రాలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమయ్యాయి, అవార్డ్స్ గెలుచుకున్నాయి.[1] [2]

జీవిత విశేషాలు

[మార్చు]

శ్రీను పాండ్రంకి విజయనగరం లో తన విద్యాభ్యాసం పూర్తి చేశారు. సినిమాల మీద ఆశక్తితో ఆయన ఇరవై ఏళ్ళ ప్రాయంలో హైదరాబాద్ పయనమయ్యారు. అసిస్టెంట్ గా ఎక్కడా అవకాశం రాకపోవడంతో సొంతంగా నేర్చుకోవాలన్న అభిలాశతో లఘుచిత్రాలు తీయడం ప్రారంభించారు.

కెరీర్

[మార్చు]

శ్రీను పాండ్రంకి 2007 లో తీసిన మొదటి రెండు లఘు చిత్రాల్లో ఒక దానికి అంతర్జాతీయ పురస్కారం రాగా, మరొకటి మాటీవీ వారు నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ కి ఎంపిక అయ్యింది. ప్రతీ లఘు చిత్రం వైవిధ్యంగా ఉండేలా చూసుకోవడం ఆయన శైలి. మొదట్లో సందేశాత్మక చిత్రాలు మాత్రమే తీసిన అతను తర్వాత కాలం లో ప్రయోగాత్మక చిత్రాలపై మొగ్గు చూపారు. తన అవర్ గ్లాస్ చిత్రం ప్రపంచంలొనే మొట్టమొదటి పాలిన్ డ్రోమ్ చిత్రం. మన తెలుగు 'వికటికవి' లా ఎటు నుంచి చూసినా ఒకేలా కనిపించడం ఆ చిత్రం యొక్క విశేషం. ఇలాంటి ఎన్నో ప్రయోగాలు ఆయన చిత్రాల్లో చేశారు.

ఆయన దర్శకత్వం వహించిన పీకాబూ, స్టెల్లా చిత్రాలు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితం కాగా లక్ష్మీ మంచు తో నిర్మించిన డెసిషన్ షార్ట్ ఫిల్మ్ జైపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైంది.

ఆయన రచించిన ఇంగ్లీష్ నవల ను దర్శకుడు రాం గోపాల్ వర్మ ఆవిష్కరించారు.[3][4][5][6]

లఘు చిత్రాలు

[మార్చు]
సంవత్సరం శీర్షిక నిర్మాణం భాష
2007 లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ శ్రీను పాండ్రంకి తెలుగు
2007 ఫ్లాట్ నంబర్ 101 శ్రీను పాండ్రంకి తెలుగు
2008 ఆర్ట్ ఆఫ్ లివింగ్ మునీంద్ర తెలుగు
2009 బ్రేక్ ద సైలెన్స్ మునీంద్ర తెలుగు
2010 పింక్ స్లిప్ అంజన్ & రాం కిరణ్ తెలుగు
2011 ఆర్చిడ్స్ మురళి తెలుగు
2013 అవర్ గ్లాస్ శ్రీను పాండ్రంకి నిశ్శబ్ద చిత్రం
2014 లవ్ ఫరెవర్ భోగాపురపు మధు & పార్వతి తెలుగు
2014 ఏడ్యు ఆర్కుట్ భాను కూరేళ్ల ఇంగ్లీష్
2015 ఉప్మా తినేసింది ప్రణీత్ పాలేటి తెలుగు
2015 అన్ స్పోకెన్ ప్రణీత్ పాలేటి నిశ్శబ్ద చిత్రం
2015 సూడో సైడ్ ప్రణీత్ పాలేటి తెలుగు
2015 ఎం.ఎం.ఎస్ ప్రణీత్ పాలేటి తెలుగు
2016 హ్యాపీ ఆక్సిడెంట్స్ వెంకట్ బొమ్మినేని తెలుగు
2016 బూచి ప్రణీత్ పాలేటి & చైతన్య తెలుగు
2017 మెగా ఫ్యాన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు
2017 స్టెల్లా సుధ భీమిరెడ్డి తెలుగు
2017 డెసిషన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇంగ్లీష్
2018 గుడిలో పువ్వు జీడిగుంట రామలక్ష్మి తెలుగు
2018 డ్రీమ్ రీడర్ నిర్మలా దేవి తెలుగు
2018 మదర్ లాండ్ జె డి చెరుకూరి తెలుగు
2019 అన్ యూజువల్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇంగ్లీష్ & తెలుగు

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "visualising the art of writing". The Hans India. 2013-09-12. Retrieved 2013-09-12.
  2. "nijanga nenena novel launch". Idlebrain. 2021-06-10. Retrieved 2021-06-10.
  3. "'Peek-a-boo' at Cannes". The Hindu. 2014-03-27. Retrieved 2015-05-04.
  4. "'Estella' at Cannes". The Hindu. 2017-04-04. Retrieved 2017-04-04.
  5. Pandranki, Srinu (12 April 2014). X² (X Trilogy) (Volume 1): Mr. Srinu Pandranki: 9781497482265: Amazon.com: Books. ISBN 978-1-4974-8226-5.
  6. "Ram Gopal Varma launches Srinu Pandranki's English thriller novel X Square – Telugu cinema news". Idlebrain.com. 2014-04-13. Retrieved 2015-05-04.