భలే మంచి రోజు
భలే మంచి రోజు | |
---|---|
దర్శకత్వం | శ్రీరామ్ ఆదిత్య టి |
స్క్రీన్ ప్లే | శ్రీరామ్ ఆదిత్య టి |
కథ | శ్రీరామ్ ఆదిత్య టి |
నిర్మాత | విజయ్ చిల్ల శశి దేవిరెడ్డి |
తారాగణం | సుధీర్ బాబు వామికా గబ్బి సాయి కుమార్ |
విడుదల తేదీ | 25 డిసెంబర్ 2015 |
భలే మంచి రోజు 2015లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ కుమార్ రెడ్డి, శశిధర్ రెడ్డి నిర్మించారు. శ్రీరామ్ ఆదిత్య.టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సుధీర్ బాబు, వామికా గబ్బి, ధన్య బాలకృష్ణ, సాయికుమార్ తదితరులు నటించారు. శందత్ ఛాయాగ్రహణం అందించగా, సన్నీ ఎం.ఆర్. సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం 2015 డిసెంబర్ 25న విడుదలయ్యింది. ఆదిత్య మూవీస్ పతాకంపై హిందీలో డబ్ చేసి, కసం ఊపర్వాలే కి అనే పేరుతో విడుదలచేశారు.
కథ
[మార్చు]ప్రేమలో విఫలమైన రామ్ (సుధీర్ బాబు) తనను కాదని వేరే పెళ్లి చేసుకుంటున్న ప్రియురాలి మీద పగ తీర్చుకోవడానికి బయలుదేరతాడు. అదే సమయంలో శక్తి(సాయికుమార్)..సీత(వామిఖ)ను కిడ్నాప్ చేసి తీసుకొస్తుంటాడు. అనుకోకుండా రామ్ తన కారుతో.. శక్తి కారుని ఢీకొంటాడు. ఆ శక్తి బారి నుంచి సీత తప్పించుకుని పారిపోతుంది. ‘సీత తప్పించుకోవడానికి నువ్వే కారణం..అందుకే సీతను నువ్వే తీసుకురా లేదంటే నీ స్నేహితుడ్ని చంపేస్తా’అని బెదిరిస్తాడు శక్తి. దీంతో చేసేది లేక సీతని తీసుకొచ్చే బాధ్యత నెత్తి మీద వేసుకొంటాడు రామ్. ఈ జర్నీలో ఈశు, ఆల్బర్ట్ అనే కిడ్నాపర్లను కలుస్తాడు. వారితో కలిసి రామ్ ప్రయాణం ఎలా సాగింది. చివరకు రామ్, సీతను పట్టుకున్నాడా..? అన్నదే సినిమా మిగతా కథ.[2]
తారాగణం
[మార్చు]- సుధీర్ బాబు (రామ్)
- వామికా గబ్బి (సీత)
- ధన్య బాలకృష్ణ (మాయ డిసౌజా)
- సాయి కుమార్ (శక్తి)
- పోసాని కృష్ణ మురళి (ఫాదర్ పాల్)
- పరుచూరి గోపాలకృష్ణ (మణిక్యం)
- విద్యులేఖ రామన్ (దీప్తి)
- చైతన్య కృష్ణ (సూర్యుడు)
- రాజ్య లక్ష్మి
- పృథ్వీరాజ్ మల్లెపుష్పం రామారావు
- వేణు (టిల్లు) (ఈసు)
- ప్రవీణ్ (ఆది)
- నర్రా శ్రీనివాస్
- శ్రీరామ్ ఎరాగమ్రేడి (ఆల్బర్ట్)
మూలాలు
[మార్చు]- ↑ "Bhale manchi roju a pleasent love story". Retrieved 1 September 2019.
- ↑ Sakshi (25 December 2015). "'భలే మంచి రోజు' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 16 మే 2021. Retrieved 16 May 2021.