70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్
పరిశ్రమవినోదం
స్థాపనహైదరాబాదు, తెలంగాణ in 2015
ప్రధాన కార్యాలయం
కీలక వ్యక్తులు
విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
ఉత్పత్తులుసినిమాలు
యజమానివిజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
వెబ్‌సైట్70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ వెబ్సైట్

70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ తెలుగు సినిమా నిర్మాణ సంస్థ.[1] దీనిని 2015లో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి స్థాపించారు.

చరిత్ర

[మార్చు]

నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి 2015లో ఈ నిర్మాణ సంస్థను ప్రారంభించి అదే సంవత్సరంలో సుధీర్ బాబు, వామికా గబ్బి, సాయి కుమార్ తారాగణంతో భలే మంచి రోజు[2] అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతోపాటు విమర్శకుల ప్రసంశలు అందుకుంది. 2017లో తీసిన ఆనందో బ్రహ్మ[3] చిన్న చిత్రంగా విడుదలై 15కోట్లు వసూలుచేసి విజయం సాధించిన చిత్రాల జాబితాలో చేరింది. 2018లో మహీ వి రాఘవ్‌ దర్శకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి జీవితచరిత్రను యాత్ర[4] సినిమాగా తీశారు.

నిర్మించిన చిత్రాలు

[మార్చు]
క్రమసంఖ్య సంవత్సరం సినిమా భాష తారాగణం
1 2015 భలే మంచి రోజు[5] తెలుగు సుధీర్ బాబు, వామికా గబ్బి
2 2017 ఆనందో బ్రహ్మ[6] తెలుగు తాప్సీ, వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి
3 2018 యాత్ర[7] తెలుగు మమ్ముట్టి

మూలాలు

[మార్చు]
  1. "Yatra to commence its regular shooting". Retrieved 1 September 2019.
  2. "Bhale Manchi Roju Movie Review". Retrieved 1 September 2019.
  3. "Anando Brahma overseas collection". Retrieved 1 September 2019.
  4. "Mammotty roped in to play the lead in Yatra". Retrieved 1 September 2019.
  5. "Bhale manchi roju a pleasent love story". Retrieved 1 September 2019.
  6. "Mahi V Raghav interview with Times of India". Retrieved 1 September 2019.
  7. "Mammootty gets a grand welcome at Yatra movie set". Retrieved 1 September 2019.

ఇతర లంకెలు

[మార్చు]