ప్రేమమ్
ప్రేమమ్ | |
---|---|
![]() సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | చందు మొండేటి |
స్క్రీన్‌ప్లే | చందు మొండేటి |
నిర్మాత | సూర్యదేవర నాగవంశీ |
నటవర్గం | |
ఛాయాగ్రహణం | కార్తీక్ ఘట్టమనేని |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | గోపీ సుందర్, రాజేష్ మురుగన్ |
నిర్మాణ సంస్థ | సితార ఎంటర్ టైన్మెంట్స్ |
పంపిణీదారులు | హారిక & హాసిని క్రియేషన్స్ |
విడుదల తేదీలు | 2016 అక్టోబరు 7 |
నిడివి | 136 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 30 cr |
వసూళ్ళు | 40 crores est.₹2 crore[1] |
ప్రేమమ్ - 2016 తెలుగు సినిమా. ఇది మలయాళంలో ఫస్ట్ రిలీజ్ అయి హిట్ అయింది.
కథ[మార్చు]
తాడేపల్లిగూడెంలో పుట్టి పెరిగిన విక్కి (నాగచైతన్య) పదవ తరగతిలో సుమ (అనుపమ పరమేశ్వరన్) ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. చివరకు సుమ ఓరోజు విక్కితో తనకు ఓ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడనే విషయాన్ని చెప్పడంతో విక్కి ఎంతో బాధపడతాడు. సుమను స్వార్ధపరురాలని తిట్టుకుంటాడు. ఐదేళ్ల తర్వాత అంటే డిగ్రీ చదువేటప్పుడు విక్కి మరోసారి గెస్ట్ లెక్చరర్ సితార (శృతిహాసన్) ను ప్రేమిస్తాడు. సితార వయసులో విక్కి కంటే పెద్దదైన ఆ విషయాన్ని తేలికగా తీసుకుని ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. సితార కూడా విక్కితో చనువుగా మెలుగుతుంది. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారే లోపు కాలేజ్‌కి సెమిస్టర్ సెలవులు వస్తాయి. సితార పూణేకు బయలు దేరుతుంది. కానీ దారిలో ఆమె బయలుదేరే బస్సుకు యాక్సిడెంట్ జరుగుతుంది. ఆమె జ్ఞాపకశక్తిని కోల్పోతుంది. దాంతో విక్కి.., సితారకు తన ప్రేమను వ్యక్తం చేయలేకపోతాడు.
సితార వేరొకరిని పెళ్ళి చేసేసుకుంటుంది. పదేళ్ల తర్వాత విక్కి పెద్ద చెఫ్‌గా ఎదుగుతాడు. విక్కి పెట్టిన హోటల్‌కు సిటీలో మంచి పేరు వస్తుంది. విక్కి మాత్రం ఎప్పుడూ సితార జ్ఞాపకాల్లోనే ఉంటుంటాడు. అయితే ఓసందర్భంలో విక్కికి సింధు పరిచయం అవుతుంది. కొన్నిరోజుల తర్వాత సింధుకి విక్కి తన ప్రేమను చెబితే సింధు కూడా తన ఎంగేజ్‌మెంట్ అయ్యిందని చెబుతుంది. విక్కి మరోసారి బాధపడతాడు. కానీ కథ అక్కడే టర్న్ తీసుకుంటుంది. అదెలాంటి మలుపు? విక్కి ప్రేమ సక్సెస్ అవుతుందా? అసలు విక్కికి, సింధు మధ్య చాలా సంవత్సరాల నుండే పరిచయం ఉంటుంది..అదెలాంటి పరిచయం... ? చివరకు విక్కి ఎవరిని పెళ్ళి చేసుకుంటాడు? అనే విషయాలు మిగిలిన కథ
నటులు[మార్చు]
- నాగ చైతన్య
- అనుపమా పరమేశ్వరన్
- శృతి హాసన్
- మడోన్నా సెబాస్టియన్
- ప్రవీణ్
- చైతన్య రావు
- నోయెల్
- ఈశ్వరీరావు[2]
- శ్రీనివాస రెడ్డి
- అక్కినేని నాగార్జున
- దగ్గుబాటి వెంకటేష్ (అతిథి పాత్రలో)
సాంకేతికవర్గం[మార్చు]
- సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
- నిర్మాణ సంస్థః సితార ఎంటర్ టైన్మెంట్స్
- తారాగణం: చైతన్య అక్కినేని, శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్,
- సంగీతం: గోపీసుందర్, రాజేష్ మురుగన్
- చాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
- ఆర్ట్: సాహి సురేష్
- కథ: అల్ఫోన్స్ పుథరిన్
- ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
- నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
- స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: చందు మొండేటి
మూలాలు[మార్చు]
- ↑ crore-mark-7-days-699531 Premam 1st-week box office collection. Ibtimes.co.in (2016-10-14). Retrieved on 2016-10-18.
- ↑ ఈనాడు, ఆదివారం అనుబంధం. "కాలాని అలా సాధించాను..!". తలారి ఉదయ్ కుమార్. Archived from the original on 16 ఏప్రిల్ 2020. Retrieved 16 April 2020.