Jump to content

కార్తీక్ ఘట్టమనేని

వికీపీడియా నుండి
కార్తీక్ ఘట్టమనేని
జననం(1987-10-28)1987 అక్టోబరు 28
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థఇనిస్టిట్యుట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, హైదరాబాదు
వృత్తిఛాయాగ్రాహకుడు, దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2013 - ప్రస్తుతం

కార్తీక్ ఘట్టమనేని దక్షిణ భారతదేశ చలనచిత్ర దర్శకుడు, ఛాయాగ్రాహకుడు.[1] ఇతను 2013లో ప్రేమ ఇష్క్ కాదల్‌తో ఛాయాగ్రాహకుడిగా అరంగేట్రం చేశాడు. తొలిరోజుల్లో పలు సినిమాల్లో పనిచేశాడు.[2] షార్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ అయిన పాండ్‌ఫ్రీక్స్ ఎంటర్టైన్మెంట్ యొక్క ముఖ్య వ్యవస్థాపకులలో కార్తీక్ ఒకరు.

తొలి జీవితం

[మార్చు]

కార్తీక్ ఘట్టమనేని హైదరాబాదులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ నుండి కంప్యూటర్ సైన్స్ లో బీ.టెక్ పూర్తిచేసాడు. దర్శకుడిగా మారాలని లక్ష్యంగా పెట్టుకుని, పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చేరాలనుకున్నాడు. కాని దానికి అవకాశంరాలేదు. ఆ తర్వాత సినిమాటోగ్రఫీ నేర్చుకోవాలని రాజీవ్ మీనన్ మైండ్‌స్క్రీన్ ఇనిస్టిట్యూట్‌లో ఒక సంవత్సరం కోర్సులో చేరాడు. తరువాత అతను ఇన్ఫినిటీ లఘుచిత్రానికి దర్శకత్వం వహించాడు, అందులో హర్షవర్ధన్ రాణే నటించాడు. ఈ లఘుచిత్రానికిగాను కార్తీక్ ప్రతిభకు ఫర్హాన్ అక్తర్ వంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

సినిమాల జాబితా

[మార్చు]

ఛాయాగ్రాహకుడిగా

[మార్చు]
సంవత్సరం సినిమా భాష ఇతరములు
2019 చిత్రలహరి[3] తెలుగు
2018 కృష్ణార్జున యుద్ధం తెలుగు
అ![4] తెలుగు
2017 నిన్ను కోరి[5] తెలుగు
రాధ తెలుగు
2016 ప్రేమమ్ తెలుగు
ఎక్స్‌ప్రెస్ రాజా తెలుగు
2015 సూర్య వర్సెస్ సుర్య తెలుగు
2014 కార్తీకేయ తెలుగు
2013 ప్రేమ ఇష్క్ కాదల్[6] తెలుగు ఛాయాగ్రాహకుడిగా తొలిచిత్రం

దర్శకుడిగా

[మార్చు]
సంవత్సరం సినిమా భాష ఇతరములు
2015 సూర్య వర్సెస్ సుర్య తెలుగు దర్శకుడిగా తొలిచిత్రం[7]

మూలాలు

[మార్చు]
  1. The Hans India, Cinema (31 January 2015). "Meet Karthik T-town's Youngest Director". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 20 June 2017. Retrieved 7 August 2019.
  2. "Meet Karthik, T-town's youngest director". The Hans India. Retrieved 7 August 2019.
  3. ఈనాడు, సినిమా రివ్యూ (12 April 2019). "రివ్యూ: చిత్రలహరి". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 4 May 2019. Retrieved 7 August 2019.
  4. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (1 February 2018). "'అ!'హా.. ట్రైల‌ర్ అద‌ర‌గొట్టింది...!!". www.ntnews.com. Archived from the original on 7 August 2019. Retrieved 7 August 2019.
  5. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి- సినిమా కబుర్లు (23 February 2017). "నాని.. నిన్ను కోరి". www.andhrajyothy.com. Archived from the original on 24 February 2017. Retrieved 7 August 2019.
  6. "Karthik Ghattamaneni's Interview on Prema Ishq Kaadhal". businessoftollywood.com. Retrieved 7 August 2019.
  7. "Karthik Ghattamaneni's directorial debut". Idlebrain.com. Retrieved 7 August 2019.

ఇతర లింకులు

[మార్చు]