నిన్ను కోరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిన్ను కోరి
దర్శకత్వంశివ నిర్వాణ
నిర్మాతడి. వి. వి. దానయ్య
నటులునాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి
ఛాయాగ్రహణంకార్తీక్ ఘట్టమనేని
కూర్పుప్రవీణ్ పూడి

నిన్ను కోరి 2017లో విడుదలైన ఒక తెలుగు ప్రేమకథా చిత్రం.[1][2] నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, డివివి దానయ్య నిర్మించారు.[3][4]

కథ[మార్చు]

ఉమా మహేశ్వరరావు (నాని), విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో పి. హెచ్. డీ చేసే ఒక కుర్రాడు. ప్రొఫెసర్ మూర్తి (తనికెళ్ళ భరణి) సాయంతో చదువుకునే ఆ కుర్రాడు గీతమ్స్ కాలేజ్ లో చదువుకునే పల్లవి (నివేదా థామస్) కి తొలుత డ్యాన్స్ మాస్టారుగా పరిచయమయ్యి, ఆ తర్వాత ప్రేమలో పడతాడు. పల్లవి ఉంటున్న ఇంట్లోనే పెంట్ హౌస్ లో అద్దెకు దిగుతాడు. అదే సమయంలో పల్లవి తండ్రి (మురళీ శర్మ) జీవితంలో సెటిల్ అవ్వని వాళ్లకు ఏ తండ్రీ తన కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేయడు అని చెప్పిన మాటలతో.. ఎలాగైనా జీవితంలో సెటిల్ అయ్యాకే పెళ్ళి చేసుకుందామని పల్లవిని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు.

తర్వాత తన పిహెచ్ డీ కోసం ఢిల్లీ వెళ్లిపోతాడు. అయితే, పల్లవి తన పేరెంట్స్ చూసిన అరుణ్ (ఆది పినిశెట్టి) ని పెళ్ళి చేసుకొని ఫారిన్ లో సెటిల్ అవుతుంది. అంతా మరిచిపోయి హాయిగా జీవిస్తున్న పల్లవికి ఒకానొక సందర్భంలో ఆమె వల్లే ఉమా మహేశ్వరరావు తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడనే విషయం తెలుస్తుంది. ఆ విషయం తెలిసిన వెంటనే ఆమె అతన్ని వెతుక్కుంటూ వెళ్తుంది. ఉమా మహేశ్వరరావు, పల్లవి సుఖంగా లేదని బాధపడతాడు. కానీ అమె తను సుఖంగానే ఉన్నానని, అతను కూడా తమ జీవితంలో జరిగిన విషయాలు మరిచిపోయి పెళ్ళి చేసుకోవాలని కోరుతుంది. అయినా సరే అతను ఒప్పోకోడు. ఆ సమయంలో పల్లవి, ఉమా మహేశ్వరరావును ఒక 10 రోజులు తమ కుటుంబంతో గడపడానికి ఆహ్వానిస్తుంది. తమ జంట సంతోషంగానే ఉందనే విషయాన్ని అతను నమ్మడానికే ఈ ఆహ్వానమని అంటుంది. అలా అరుణ్, పల్లవి జంట ఉంటున్న ఇంటికి వచ్చిన ఉమామహేశ్వరరావు తొలుత ఆ జంట విడిపోవాలని కోరుకున్నా, ఆఖరికి వారి బంధాన్ని అర్ధం చేసుకోవడంతో కథ ముగుస్తుంది.[5]

పాత్రలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. సాక్షి దినపత్రికలో చిత్ర సమీక్ష
  2. డెక్కన్ క్రానికల్ దినపత్రికలో చిత్ర సమీక్ష
  3. http://www.sakshi.com/news/movies/ninnu-kori-movie-review-490247
  4. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి- సినిమా కబుర్లు (23 February 2017). "నాని.. నిన్ను కోరి". www.andhrajyothy.com. Archived from the original on 24 February 2017. Retrieved 7 August 2019. CS1 maint: discouraged parameter (link)
  5. http://www.deccanchronicle.com/entertainment/movie-reviews/080717/ninnu-kori-movie-review-a-heart-touching-one.html