Jump to content

కార్తికేయ (సినిమా)

వికీపీడియా నుండి
కార్తికేయ
సినిమా పాటల ప్రచార చిత్రం
దర్శకత్వంమొండేటి చందు
నిర్మాతవెంకట్ శ్రీనివాస్[2]
తారాగణంనిఖిల్ సిద్దార్థ్
కలర్స్ స్వాతి
ఛాయాగ్రహణంకార్తీక్ ఘట్టమనేని [2]
కూర్పుకె. శ్రీనివాస్ [2]
సంగీతంశేఖర్ చంద్ర
నిర్మాణ
సంస్థ
మాగ్నస్ సినీ ప్రైమ్
విడుదల తేదీ
అక్టోబరు 24, 2014 (2014-10-24)[1]
దేశంభారత్
భాషతెలుగు

కార్తికేయ చందు మొండేటి దర్శకత్వంలో 2014లో విడుదలైన ఉత్కంఠభరిత తెలుగు చిత్రం. ఇందులో నిఖిల్, స్వాతి ప్రధాన పాత్రలు పోషించారు.

సుబ్రహ్మణ్యపురం అనే ఊరిలో సుబ్రహ్మణ్యస్వామి గుడికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందామని ప్రయత్నించే ప్రతి ఒక్కరూ పాము కాటుకి చనిపోతుంటారు. ఆ గుడికి సంబంధించిన రహస్యం ఏమిటనేది తెలుసుకోవాలని తన ప్రయత్నం మొదలు పెడతాడు ఆ ఊరికి మెడికల్‌ క్యాంప్‌ మీద వచ్చిన వైద్య విద్యార్థి కార్తీక్‌ (నిఖిల్‌). ప్రతి యేటా కార్తీక పౌర్ణమికి వెలుగులు విరజిమ్మే ఆ గుడి వెనుక రహస్యం ఏమిటి? ఒకప్పుడు ఎంతో ఖ్యాతి గడించిన ఆ గుడిని గురించి ఎవరైనా మాట్లాడినా కానీ ఎందుకని చనిపోతున్నారు? ఆ రహస్యం ఛేదించడానికి చేసే ప్రయత్నంలో కార్తీక్‌కి ఏమవుతుంది అన్నదే మిగిలిన కథ.[3]

నటవర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

సరిపోవు, రచన: వనమాలి, గానం. హరిచరన్

ప్రశ్నంటే , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.బెన్నీ దయాళ్

ఇంతలో ఎన్నెన్ని వింతలో(మేల్ వాయిస్) రచన: కృష్ణచైతన్య , గానం.నరేష్ అయ్యర్

పున్నమి వెన్నెలకే , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.హరిచరణ్

ఇంతలో ఎన్నెన్ని వింతలో ,(ఫిమేల్ వాయిస్) రచన: కృష్ణచైతన్య, గానం.చిన్మయి

రైస్ ఆఫ్ కార్తీకేయ , గానం.శేఖర్ చంద్ర.

సాంకేతికవర్గం

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Karthikeya (Karthikeyan) Review". aptoday.com. October 24, 2014. Archived from the original on 2014-10-27. Retrieved October 24, 2014.
  2. 2.0 2.1 2.2 "Nikhil – Swathi's Karthikeya in December". 123telugu.com. Retrieved September 27, 2013.
  3. http://www.greatandhra.com/movies/reviews/karthikeya-review-interesting-thriller-60827.html

బయటి లంకెలు

[మార్చు]