కాళిచరణ్ (2013 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాళిచరణ్
కాళిచరణ్ సినిమా పోస్టర్
దర్శకత్వంశ్రీ ప్రవీణ్
రచనమాటలు:
ఖాజా పాషా
శివ
శ్రీ ప్రవీణ్
నిర్మాతశ్రీ ప్రవీణ్
తారాగణంచైతన్య కృష్ణ
చాందిని తమిలరసన్
పంకజ్ కేసరి
ఛాయాగ్రహణంవిశ్వ దేవబత్తుల
సతీష్ ముత్యాల
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంనందన్ రాజ్
నిర్మాణ
సంస్థ
శ్రీ కరుణాలయం
పంపిణీదార్లుబేబి మనస్విని
విడుదల తేదీ
2013 నవంబరు 8 (2013-11-08)
దేశంభారతదేశం
భాషతెలుగు

కాళిచరణ్ 2013, నవంబరు 8న విడుదలైన రాజకీయ నేపథ్య తెలుగు చలనచిత్రం. శ్రీ కరుణాలయం పతాకంలో శ్రీ ప్రవీణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చైతన్య కృష్ణ, చాందిని తమిలరసన్, నాగినీడు, రావు రమేష్, పంకజ్ కేసరి ప్రధాన పాత్రల్లో నటించగా, నందన్ రాజ్ సంగీతం అందించాడు.[1] చాందిని తమిళరసన్, పంకజ్ కేసరిలకు ఇది తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రాన్ని పోర్ కుతిరై పేరుతో తమిళంలోకి అనువాదం చేశారు. దానికోసం కొన్ని సన్నివేశాలను అక్కడి స్థానిక నటులతో రీషూట్ చేశారు.[2][3][4][5]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • నిర్మాణం, దర్శకత్వం: శ్రీ ప్రవీణ్
  • మాటలు: ఖాజా పాషా, శివ, శ్రీ ప్రవీణ్
  • సంగీతం: నందన్ రాజ్
  • సినిమాటోగ్రఫీ: విశ్వ దేవబత్తుల, సతీష్ ముత్తుయల
  • కూర్పు: ప్రవీణ్ పూడి
  • నిర్మాణ సంస్థ: శ్రీ కరుణాలయం
  • పంపిణీదారు: బేబీ మనస్విని

నిర్మాణం[మార్చు]

రామ్ గోపాల్ వర్మ శిష్యుడు శ్రీ ప్రవీణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రవీణ్ ఇంతకుముందు 2010లో గాయం 2 సినిమా తీశాడు.[8] ఈ చిత్రంలో చైతన్య కృష్ణ, తమిళ నటి చాందిని తమిలరసన్ ముఖ్య పాత్రల్లో నటించగా, భోజ్‌పురి నటుడు పంకజ్ కేసరి ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.[2] 1980లలో జరిగిన సంఘటనలు, ఎమ్మెల్యే ఎర్రా సత్యం జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. [9] హైదరాబాదులో జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంచు లక్ష్మి, అల్లు అరవింద్, తమ్మారెడ్డి భరద్వాజ, సందీప్ కిషన్ తదితరులు హాజరయ్యారు.[10]

పాటలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను నందన్ రాజ్ స్వరపరిచాడు.[8] పాటలను వనమాలి, సదా చంద్ర రాశారు.

సం.పాటగాయకులుపాట నిడివి
1."కురిసికురిసి"నందన్ రాజ్, శ్రీ కృష్ణ, అపర్ణ3:49
2."మెల్లా మెల్లగా"నందన్ రాజ్, వినయ్4:19
3."దేవుడన్నా పేరు"నందన్ రాజ్, సురేష్ బాబు2:35
4."పలికే ఆ గువ్వా"నందన్ రాజ్, శ్రీ కృష్ణ4:08
5."నాకల్లు చూడు"నందన్ రాజ్, గీతా మాధురి4:22
6."ఓ నింగే తులి హోలీ"నందన్ రాజ్, రాంకీ, సాహితి4:13
7."నా నిన్ను"నందన్ రాజ్, అంజనా సౌమ్య4:07
Total length:27:33

స్పందన[మార్చు]

టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఈ చిత్రానికి 2/5 రేటింగ్ ఇచ్చింది. "ఈ చిత్రంలో కొన్నిచోట్ల ఉత్కంఠ కలిగించడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం వృధా అయింది" అని పేర్కొంది.[6] "కథలో కొత్తదనం ఉన్నాకాని కథనం నిరుత్సాహపరిచింది" అని ది హిందూ పత్రిక రాసింది. [7]

పురస్కారాలు[మార్చు]

  1. నంది పురస్కారం: 2013 నంది పురస్కారాలులో: ఉత్తమ ఎడిటర్ (ప్రవీణ్ పూడి), ఉత్తమ ఫైట్ మాస్టర్ (వెంకట్ నాగ్), ప్రత్యేక బహుమతి (చైతన్య కృష్ణ) విభాగాల్లో అవార్డులు వచ్చాయి.[11][12][13][14]

మూలాలు[మార్చు]

  1. "Chandini gets a makeover - Times of India". The Times of India. Retrieved 2020-10-15.
  2. 2.0 2.1 Chowdhary, Y. Sunita (October 21, 2014). "Banking on nativity". The Hindu. Retrieved 2020-10-15.
  3. "Chaitanya Krishna hopes 'Porkuthirai' finds him more work in Tamil films". October 20, 2014. Retrieved 2020-10-15.
  4. "Chandini is back with Por Kuthirai - Times of India". The Times of India. Retrieved 2020-10-15.
  5. "Tamil version of Kaalicharan gears up for release". Hindustan Times. August 21, 2014. Retrieved 2020-10-15.
  6. 6.0 6.1 "Kaalicharan Movie Review {2/5}: Critic Review of Kaalicharan by Times of India". timesofindia.indiatimes.com. Retrieved 2020-10-15.
  7. 7.0 7.1 Dundoo, Sangeetha Devi (November 10, 2013). "Kaalicharan: A throwback to the 80s". www.thehindu.com. Retrieved 2020-10-15.
  8. 8.0 8.1 "Praveen Sri's new movie is Kaalicharan - Times of India". The Times of India. Retrieved 2020-10-15.
  9. "Proud to be part of 'Kalicharan': Chandini". The New Indian Express. Retrieved 2020-10-15.
  10. "Tollywood celebs at the muhurat of 'Kaalicharan' in Hyderabad - Times of India". The Times of India. Retrieved 2020-10-15.
  11. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 26 October 2020.
  12. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 October 2020.
  13. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 October 2020.
  14. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 October 2020.