వాల్తేరు వీరయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాల్తేరు వీరయ్య
దర్శకత్వంకె. ఎస్. రవీంద్ర
స్క్రీన్ ప్లే
కథకె. ఎస్. రవీంద్ర
నిర్మాత
 • నవీన్ యెర్నేని
 • వై. రవిశంకర్
తారాగణం
ఛాయాగ్రహణంఆర్థర్ ఎ. విల్సన్
కూర్పునిరంజన్ దేవరమనే
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
మైత్రి మూవీ మేకర్స్
విడుదల తేదీs
2023 జనవరి 13 (2023-01-13)[1]
2023 ఫిబ్రవరి 28 (2023-02-28)(నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో)
సినిమా నిడివి
2 గంటల 40 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

వాల్తేరు వీరయ్య - ఇది బాబీ దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ లు కథానాయకుడు, కథానాయికగా నటించిన చిత్రం.[2] ఇందులో రవితేజ కీలక పాత్రలో నటించాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. కాగా జీకే మోహన్ సినిమాటోగ్రఫీ అందించాడు. ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 7న విడుదల చేయగా[3], సినిమా సంక్రాంతి కానుకగా 2023 జనవరి 13న విడుదలైంది.[4]

టైటిల్ విశేషాలు[మార్చు]

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో మత్స్య కారులకు నాయకుడిగా చిరంజీవి కనిపించనున్నాడు. చిరంజీవి సినీ ఇండస్ట్రీకి రాక ముందు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో దర్శక నిర్మాతలకు ఫోటోలు పంపించేందుకు ఒక కెమెరామెన్ అవసరమవ్వడంతో వీరయ్య సహాయపడ్డాడు. ఇతను చిరంజీవి తండ్రి వెంకట్రావు సహోద్యోగి. పోలీస్ శాఖలో పనిచేస్తుండేవారు. చిరంజీవిని అందంగా ఫోటోలు తీయడమేకాక నిర్మాణ సంస్థలకు పంపించేవాడు. అంతేకాకుండా చిరంజీవి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్ళలో ఈ ఫోటో ఆల్బమ్ చాలా ఉపయోగపడింది. ఈ కృతజ్ఞతతో ఉన్న చిరంజీవికి బాబీ చెప్పిన మాస్ ఎంటర్ టైనర్ కథ వినగానే ఎలాగూ విశాఖపట్టణం బ్యాక్ డ్రాప్ కాబట్టి వీరయ్య పేరైతే బాగుంటుందని అన్నారుట. అలా వాల్తేరు వీరయ్య టైటిల్ వచ్చింది. ఇది చిరంజీవి నటిస్తున్న 154వ చిత్రం.[5]

తారాగణం[మార్చు]

పాటల జాబితా[మార్చు]

 • బాస్ పార్టీ , రచన: దేవీశ్రీ ప్రసాద్, గానం. దేవీశ్రీ ప్రసాద్, నాకాష్ అజీజ్ , హరిప్రియ ,
 • శ్రీదేవి చిరంజీవి ,రచన.: దేవీశ్రీ ప్రసాద్ , గానం.జస్ప్రీత్ జాస్ , సమీరా భరద్వాజ్
 • వీరయ్య టైటిల్ సాంగ్ , రచన: చంద్రబోస్ , గానం.అనురాగ్ కులకర్ణి ,పవిత్ర చారి
 • నీకేమో అందమెక్కువ , రచన: రామజోగయ్య శాస్త్రి గానం.మికసింగ్ , గీతా మాధురి , వెలమురుగాన్.
 • పూనకాలు లోడింగ్ , రచన: రోల్ రిదా, గానం. రామ్ మిరియాల, రోల్రీదా.

సాంకేతిక నిపుణులు[మార్చు]

విడుదల[మార్చు]

వాల్తేర్ వీరయ్య జనవరి 2023లో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైంది.[9][10]

మూలాలు[మార్చు]

 1. Namaste Telangana (7 December 2022). "చిరంజీవి వాల్తేరు వీరయ్య రిలీజ్‌ డేట్‌ ఫైనల్‌.. పోస్టర్ వైరల్‌". Archived from the original on 7 December 2022. Retrieved 7 December 2022.
 2. "Chiranjeevi : వాల్తేరు వీరయ్య కోసం పక్కదేశానికి వెళ్తోన్న చిరంజీవి.. Chiranjeevi going abroad for waltair veerayya here are the details– News18 Telugu". web.archive.org. 2022-05-25. Archived from the original on 2022-05-25. Retrieved 2022-05-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 3. Sakshi (7 January 2023). "వాల్తేరు వీరయ్య ట్రైలర్‌.. బాస్‌ నోట మాస్‌ డైలాగ్స్‌, చిరుకు రవితేజ వార్నింగ్‌". Archived from the original on 7 January 2023. Retrieved 7 January 2023.
 4. "Waltair Veerayya Release Date: సంక్రాంతి బరిలో వాల్తేర్‌ వీరయ్య.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌". Hindustan Times Telugu. Retrieved 7 December 2022.
 5. "Sridevi Chiranjeevi from Waltair Veerayya is trending with 5M views". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-12-20. Retrieved 2022-12-20.{{cite web}}: CS1 maint: url-status (link)
 6. "Uravasi Rautela | చిరంజీవితో పనిచేస్తున్నానా అని షాకయ్యా : ఊర్వశి రౌటేలా". web.archive.org. 2022-12-29. Archived from the original on 2022-12-29. Retrieved 2022-12-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 7. 10TV Telugu (3 May 2023). "మనోబాల చివరి సినిమా చిరంజీవితోనే.. ఏ మూవీ తెలుసా?". Archived from the original on 3 May 2023. Retrieved 3 May 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 8. Namasthe Telangana (14 January 2023). "ఓ పండగలా అనిపించింది". Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
 9. "'Mega 154': Chiranjeevi's next with director Bobby set for Sankranti 2023 release - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-07-16.
 10. Hymavathi, Ravali (2022-06-24). "Mega 154: Director Bobby And Chiranjeevi's Mass Entertainer Release Date Is Unveiled…". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-07-16.