శ్రుతి హాసన్
శ్రుతి హాసన్ | |
|---|---|
2020లో శృతి | |
| జననం | 1996 జనవరి 28 |
| ఇతర పేర్లు | శ్రుతి రాజ్యలక్ష్మీ హాసన్, శ్రుతి హాసన్ |
| వృత్తి | నటి, గాయని |
| క్రియాశీలక సంవత్సరాలు | 2000 నుండి ఇప్పటివరకు |
శ్రుతి హాసన్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించిన నటి, గాయని. ఈమె నటుడైన కమల్ హాసన్ కూతురు.
సినీ జీవితం
[మార్చు]కెరియర్ తొలినాళ్ళు (2000, 2008-2011)
[మార్చు]2000లో తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన "హే రాం" సినిమాలో బాల్యనటిగా నటించిన శ్రుతి హాసన్ ఆ తర్వాత సంగీతానికి సంబంధించిన విషయాలపై శ్రద్ధ చూపింది. 2008లో సోహం షా దర్శకత్వంలో తెరకెక్కిన "లక్" సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన నటిగా తొలిసినిమా చేసింది. ఆ సినిమా ఘోరపరాజయాన్ని చవిచూసింది. శ్రుతికి కూడా తన నటనకు విమర్శకుల నుంచి ప్రతికూల స్పందన వచ్చింది. 2011లో కె. రాఘవేంద్రరావు కొడుకైన కె.ప్రకాష్ దర్శకత్వంలో సిద్దార్థ్ సరసన "అనగనగా ఓ ధీరుడు" సినిమాలో నటించింది. విమర్శకుల నుంచి తన నటనకు ప్రశంసలనందుకున్న శ్రుతికి మాత్రం ఈ సినిమా కమర్షియల్ గా పరాజయంగానే మిగిలింది కానీ ఆ సంవత్సరానికి తను ఉత్తమ తెలుగు నూతన నటి విభాగంలో దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును పొందింది.
అదే సంవత్సరంలో "దిల్ తో బచ్చాహై జీ" సినిమాలో అతిథి పాత్రలో నటించిని శ్రుతి ఆపై ఏ. ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో సూర్య సరసన "7అం అరివు" సినిమాలో నటించింది. సెవెంత్ సెన్స్ పేరుతో తెలుగులో విడుదలైన ఈ సినిమా విజయం సాధించింది. శ్రుతికి కూడా తన నటనకు గుర్తింపు లభించడమే కాకుండా ఉత్తమ తమిళ నూతన నటి విభాగంలో దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. ఆ సంవత్సరంలో తన చివరి సినిమా సిద్ధార్థ్ సరసన ఓ మై ఫ్రెండ్ సినిమాలో నటించింది. చిరంజీవి నటించిన "ఇద్దరు మిత్రులు" సినిమాకి దగ్గరగా ఉండే ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత శ్రుతి ఒక నటిగా తెలుగులో మంచి గుర్తింపును సాధించింది.
గబ్బర్ సింగ్ తర్వాత శ్రుతి ప్రస్థానం (2012-ఇప్పటి వరకు)
[మార్చు]
ధనుష్ సరసన 3 సినిమాలో నటించి విమర్శకులనుంచి ప్రశంసలనందుకున్న తర్వాత శ్రుతి హాసన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సరసన "గబ్బర్ సింగ్" సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాక విమర్శకుల మరియూ ప్రేక్షకుల దృష్టిలో శ్రుతి హాసన్ స్థాయిని పెంచింది. తనని నటిగా తెలుగు సినిమాల్లో నిలబెట్టింది. అలాగే తెలుగులో రవితేజ సరసన "బలుపు", జూనియర్ ఎన్.టి.ఆర్. సరసన "రామయ్యా వస్తావయ్యా", హిందీలో ప్రభుదేవ దర్శకత్వంలో "రామయ్యా వస్తావయ్యా", "డీ-డే" సినిమాల్లోనటించింది. ప్రస్తుతం ఆమె 2020వ సంవత్సరంలో మరోసారి నటుడు రవితేజ తో క్రాక్ అనే సినిమాలో నటిస్తోంది.
వార్తలలో శ్రుతి హాసన్
[మార్చు]2013 నవంబరు 20 న గుర్తు తెలియని దుండగుడు ఒకడు సినీనటి శ్రుతిహాసన్ ఇంట్లోకి చొరబడేందుకుయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో పరారయ్యాడు. ముంబై బాంద్రా ప్రాంతంలోని ఓ భవంతి ఆరో అంతస్తులో ఉన్న శ్రుతి ఇంటికి ఉదయం 9.30కు వచ్చిన దుండగుడు తొలుత కాలింగ్‌బెల్ మోగించాడు. శ్రుతి తలుపు తీసింది.‘నువ్వు నన్నెందుకు గుర్తుపట్టడం లేదు? నాతో ఎందుకు మాట్లాడడం లేదు?’ అని దుండగుడు ఆమెను ప్రశ్నించాడు. దీనికి శ్రుతి ‘నువ్వెవరో నాకు తెలియదు’ అని బదులిచ్చింది. దీంతో ఆగంతకుడు ఆమె గొంతుపట్టుకుని లోనికి చొరబడేందుకు ప్రయత్నించాడు. శ్రుతి వెంటనే అతన్ని వెనక్కి తోసి తలుపు మూసింది.తర్వాత అతడు పారిపోయాడు. దాడి చేసిన దుండగుడు శ్రుతి నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఆమె వెంట పడుతున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.[1]
నటించిన చిత్రాలు
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనికలు | మూ |
|---|---|---|---|---|---|
| 2000 | హే రామ్ | వల్లభాయ్ పటేల్ కుమార్తె | తమిళం | బాల కళాకారుడు | |
| హిందీ | |||||
| 2009 | లక్ | ఆయేషా, నటాషా | హిందీ | ||
| 2011 | అనగనగా ఓ ధీరుడు | ప్రియా | తెలుగు | ||
| దిల్ తో బచ్చా హై జీ | నిక్కీ నారంగ్ | హిందీ | |||
| 7 ఓం అరివు | శుభ శ్రీనివాసన్ | తమిళం | |||
| ఓ మై ఫ్రెండ్ | సిరి చందన | తెలుగు | |||
| 2012 | 3 | జనని రామచంద్రన్ | తమిళం | ||
| గబ్బర్ సింగ్ | భాగ్యలక్ష్మి | తెలుగు | |||
| 2013 | బలుపు | శ్రుతి | |||
| రామయ్య వస్తావయ్య | సోనా సింగ్ | హిందీ | |||
| డి-డే | సురయ్య | ||||
| రామయ్య వస్తావయ్య | అమ్ములు | తెలుగు | |||
| 2014 | ఎవడు | మంజు | |||
| రేసుగుర్రం | స్పందన "స్వీటీ" | ||||
| ఆగడు | నర్తకి | "జంక్షన్ లో" పాటలో | |||
| పూజై | దివ్య | తమిళం | |||
| 2015 | తేవర్ | నర్తకి | హిందీ | "మాడమియన్" పాటలో | |
| గబ్బర్ ఈజ్ బ్యాక్ | న్యాయవాది శ్రుతి | ||||
| శ్రీమంతుడు | చారుశీల | తెలుగు | |||
| వెల్‌కమ్ బ్యాక్ | రంజనా శెట్టి | హిందీ | |||
| పులి | పవళమల్లి | తమిళం | |||
| వేదలం | శ్వేత | ||||
| 2016 | రాకీ హ్యాండ్సమ్ | రుక్షిదా అహ్లావత్ | హిందీ | ||
| ప్రేమమ్ | సితార వెంకటేశన్ | తెలుగు | |||
| 2017 | సింగం 3 | విద్య / అగ్ని | తమిళం | ||
| కాటమరాయుడు | అవంతిక | తెలుగు | |||
| బెహెన్ హోగి తేరి | బిన్నీ అరోరా | హిందీ | |||
| 2020 | యారా | సుకన్య | |||
| పుతం పుదు కాలై | రమ్య | తమిళం | "ఎవరికైనా కాఫీ?" విభాగం. | ||
| దేవి | మాయ | హిందీ | షార్ట్ ఫిల్మ్ | ||
| 2021 | క్రాక్ | కళ్యాణి శంకర్ | తెలుగు | ||
| ది పవర్ | పారి | హిందీ | |||
| పిట్ట కథలు | దివ్య | తెలుగు | విభాగం: xLife | ||
| వకీల్ సాబ్ | అమృత కొణిదెల | తెలుగు | అతిధి పాత్ర | ||
| లాబామ్ | క్లారా | తమిళం | |||
| 2023 | వీర సింహా రెడ్డి | ఇషా జై సింహా రెడ్డి | తెలుగు | ||
| వాల్తేరు వీరయ్య | రా ఏజెంట్ అతిధి | ||||
| ది ఐ | డయానా | ఇంగ్లీష్ | |||
| హాయ్ నాన్నా | మోడల్ | తెలుగు | అతిధి పాత్ర | ||
| సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ | ఆద్య కృష్ణకాంత్ | ||||
| 2025 | కూలీ | ప్రీతి | తమిళం | పోస్ట్-ప్రొడక్షన్ | |
| ట్రైన్ † | టిబిఎ | పోస్ట్-ప్రొడక్షన్ | |||
| 2026 | జన నాయగన్ † | టిబిఎ | చిత్రీకరణ | ||
| టిబిఎ | సాలార్ పార్ట్ 2 † | ఆద్య కృష్ణకాంత్ | తెలుగు | ప్రకటించబడింది |
పురస్కారాలు
[మార్చు]- 2011: ఉత్తమ తొలిచిత్ర నటి - అనగనగా ఒక ధీరుడు
- 2012: ఉత్తమ నటి - గబ్బర్ సింగ్
- 2014: ఉత్తమ నటి - రేసుగుర్రం
- 2015: ఉత్తమ నటి - శ్రీమంతుడు
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-24. Retrieved 2013-11-22.