Jump to content

కె.ఎస్.రవీంద్ర

వికీపీడియా నుండి
కె.ఎస్.రవీంద్ర
జననం
ఇతర పేర్లుబాబీ, బాబీ కొల్లి
వృత్తి
  • సినిమా దర్శకుడు
  • స్క్రీన్ రైటర్
క్రియాశీల సంవత్సరాలు2007 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిఅనూష
పిల్లలు1
బంధువులుద్రోణవల్లి హారిక (మరదలు)

కె.ఎస్.రవీంద్ర భారతీయ చలనచిత్ర దర్శకుడు. తెలుగు సినిమా స్క్రీన్ రైటర్ కూడా అయిన అతను బాబీగా ప్రసిద్ధి. అతను సంతోషం ఫిల్మ్ అవార్డ్స్‌లో పవర్ (2014)కి ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ అవార్డును గెలుచుకున్నాడు.

బాల్యం, విద్య

[మార్చు]

కె. ఎస్. రవీంద్ర గుంటూరులో పుట్టి పెరిగారు. బి.కామ్ లో డిగ్రీ పట్టా పొందాడు.

కెరీర్

[మార్చు]

2003లో రచయిత చిన్నికృష్ణ వద్ద చేరి తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత కొండపల్లి దశరథ్, గోపీచంద్ మలినేని[1]లతో సహా పలువురు దర్శకుల దగ్గర పనిచేశాడు.[2] రవితేజ నటించిన పవర్ (2014)తో కె.ఎస్.రవీంద్ర దర్శకుడిగా పరిచయం అయ్యాడు.[3]

2016లో పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన సర్దార్ గబ్బర్ సింగ్ వాణిజ్యపరంగా పరాజయం పాలైంది.[4] అతని తదుపరి చిత్రం జై లవ కుశ (2017)లో జూనియర్ ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషించాడు, ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ₹100 కోట్లకు పైగా వసూలు చేసింది.[5] 2019లో వెంకటేష్, నాగ చైతన్య నటించిన వెంకీ మామ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించాడు. మిశ్రమ సమీక్షలను అందుకున్నప్పటికీ, ఈ చిత్రం లాభదాయకమైన వెంచర్‌గా నిలిచింది.[6]

ఫిబ్రవరి 2021లో ఆయన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రానికి దర్శకత్వం వహించాడు.[7]

వ్యక్తిగతం

[మార్చు]

చెస్ క్రీడాకారిణి హారిక ద్రోణవల్లి అక్క అనూషను కె.ఎస్.రవీంద్ర వివాహం చేసుకున్నాడు.[8] ఈ దంపతులకు 2018లో ఒక కుమార్తె జన్మించింది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
Year Film Direction Screenplay Story Notes Ref
2008 భద్రాద్రి - - అవును
2010 వీర పరంపరే - అవును అవును కన్నడం
2010 డాన్ శీను - అవును -
2011 ఓ మై ఫ్రెండ్ - అవును -
2012 బాడీగార్డ్ - అవును -
2013 బలుపు - - అవును
2014 అల్లుడు శీను - - అవును
2014 పవర్ అవును అవును అవును [9]
2016 సర్దార్ గబ్బర్ సింగ్ అవును - - [10]
2017 జై లవ కుశ అవును - అవును [11]
2018 పంతం - అవును -
2019 వెంకీ మామా అవును - అవును [12]
2023 వాల్తేరు వీరయ్య అవును - అవును [13]
2025 డాకు మహారాజ్ అవును అవును

మూలాలు

[మార్చు]
  1. "From Guntur to Tollywood". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2014-09-17. Retrieved 2021-02-16.
  2. "కె.ఎస్. రవీంద్ర (బాబీ)". Zee Cinemalu. Archived from the original on 2022-12-28. Retrieved 2022-12-28.
  3. "శ్రీను వైట్ల టు బాబీ..రవితేజ ప‌రిచ‌యం చేసిన డైరెక్ట‌ర్లు వీళ్లే". ntnews. 2021-01-17. Retrieved 2021-02-16.
  4. "Pawan Kalyan starrer 'Sardaar Gabbar Singh' fares miserably at box office". The News Minute (in ఇంగ్లీష్). 2016-05-14. Archived from the original on 2021-01-13. Retrieved 2021-02-17.
  5. "Jai Lava Kusa Box Office Collection: Junior NTR's Film Is At 100 Crore And Counting On Day 6". NDTV.com. Retrieved 2021-02-17.
  6. "'Venky Mama' Box-Office: Venkatesh and Naga Chaitanya starrer turns into a profitable venture - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-02-17.
  7. "Waltair Veerayya: మాస్‌ వీరయ్య". web.archive.org. 2022-12-28. Archived from the original on 2022-12-28. Retrieved 2022-12-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. Jain, Rupam (7 June 2015). "I am uncool, but I'm cool with that: Dronavalli Harika | Chess News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-02-16.{{cite web}}: CS1 maint: url-status (link)
  9. "Balupu Writer Set To Direct Ravi Teja In His Next Film". Oneindia Entertainment. 3 September 2013. Archived from the original on 3 డిసెంబరు 2013. Retrieved 3 September 2013.
  10. "Why Pawan Kalyan sacked Sampath Nandi?". timesofindia.
  11. "Raashi Khanna roped in for Jr NTR's next with Bobby". TheIndianExpress. 2 February 2017.
  12. "Bobby to direct Venky and Chai, 'Venky Mama' as Title". AP NEWS CORNER. Archived from the original on 13 December 2019. Retrieved 3 March 2019.
  13. "Mega 154: Pre-look poster of Chiranjeevi's next with director Bobby released". Times of India. Retrieved 22 August 2021. {{cite web}}: |archive-date= requires |archive-url= (help)