ద్రోణవల్లి హారిక
ద్రోణవల్లి హారిక | |
---|---|
పూర్తి పేరు | ద్రోణవల్లి హారిక |
దేశం | భారతదేశం |
టైటిల్ | ఇంటర్నేషనల్ మాస్టర్ మహిళా గ్రాండ్ మాస్టర్ |
ఫిడే రేటింగ్ | 2491 (మే 2010) |
అత్యున్నత రేటింగ్ | 2491 (మే 2010) |
ద్రోణవల్లి హారిక ప్రముఖ చదరంగ క్రీడాకారిణి. జనవరి 12, 1991న గుంటూరు జిల్లాలో జన్మించింది. మహిళా గ్రాండ్ మాస్టర్, అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్ బిరుదులు పొందినది[1]. భారత ప్రభుత్వం నుండి అర్జున అవార్డును, పద్మశ్రీ పురస్కారాలు పొందింది.
జననం, విద్య
[మార్చు]ద్రోణవల్లి హారిక గుంటూరులో 1991, జనవరి 12న స్వర్ణ, రమేష్ దంపతులకు జన్మించారు. ప్రాధమిక విద్య గుంటూరు లోని వేంకటేశ్వర బాలకుటీర్ లో చదివింది.
క్రీడా విశేషాలు
[మార్చు]ద్రోణవల్లి హారిక ఏడు సంవత్సరముల వయసులోనే చదరంగం నేర్చి ఆసియా ఖండపు పది సంవత్సరాలలోపు వయస్సు (U-10), పన్నెండు సంవత్సరాలలోపు వయస్సు (U-12) పోటీలలో మొదటి స్థానము సంపాదించింది. ముంబై లో 2003లో జరిగిన కామన్ వెల్త్ చదరంగపు క్రీడలలో మహిళా విభాగములో రెండవ స్థానము పొందింది.
హారిక మూడు ప్రపంచ యువ చదరంగ బిరుదులు స్వంతము చేసుకున్నది[2].
- హెరాక్లియో, గ్రీసులో అండర్-14 - 2003
- బటూమి, జార్గియా, అండర్-18 - 2006
- గజియాన్ టెప్, టర్కీ, ప్రపంచ యువ చదరంగ పోటీ- 2008
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆమె ఆగస్టు 2018లో హైదరాబాద్‌కు చెందిన కార్తీక్ చంద్రను వివాహం చేసుకుంది.[3][4] ఆమె అక్క అనూష తెలుగు సినిమా దర్శకుడు బాబీ(కె. ఎస్. రవీంద్ర)ను వివాహం చేసుకుంది.
అవార్డులు, పురష్కారాలు
[మార్చు]- 2007లో భారత ప్రభుత్వము అర్జున పురస్కారముతో గౌరవించింది.
- 2019లో పద్మశ్రీ పురస్కారం.
మూలాలు
[మార్చు]- ↑ ratings.fide.com
- ↑ www.chessgames.com
- ↑ "Harika Dronavalli's Wonderful Wedding".
- ↑ "Harika Dronavalli : Indian Chess Grandmaster, Career And Personal Life - Sakshi". web.archive.org. 2023-01-09. Archived from the original on 2023-01-09. Retrieved 2023-01-09.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)